గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 341-యతిరాజ వింశతి కర్త -మనవాల  మాముని(1370-1443 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

341-యతిరాజ వింశతి కర్త -మనవాల  మాముని(1370-1443 )

1370 లో జన్మించి 1443 లో మరణించిన మనవాల  మాముని తమిళనాడు కేదారం లో జన్మించి ప్రబంధాలకు మొదటి వ్యాఖ్యాత అయ్యాడు . తండ్రి వద్దే వేద వేదాంగ శాస్త్రాలు  నేర్చాడు  .ద్రావిడ వేదాన్ని అభ్యసించాడు .ఎల్లలు లేని అనంత విజ్ఞానఘనుడయ్యాడు .వివాహం చేసుకొని వైష్ణవ సంప్రదాయాన్ని చక్కగా పాటించాడు .ఆళ్వార్ తిరునగరి చేరి తిరువాయ్ మోజేహి పిళ్ళై శిష్యుడయ్యాడు .రామానుజులపై విపరీత భక్తియున్న శిష్యుడిని చూసి గర్వపడిన గురువు ఆయనకు ఒక దేవాలయాన్ని తిరునగరి లో నిర్మించాలని భావించి బాధ్యత మామునిపై పెట్టాడు .ఈసమయం లోనే మాముని 20 సంస్కృత శ్లోకాలతో ‘’ యతి రాజ వింశతి ‘’రామానుజులు స్తుతిస్తూ రచించాడు .గురువు అబ్బురపడి ‘’యతీంద్ర ప్రవరనార్  ‘’బిరుదును ప్రదానం చేశాడు

  .గురు మరణం తర్వాత ముని కుటుంబం తో శ్రీరంగం చేరివానమామలై జియ్యర్ శిష్యుడై అందరి అభిమానం పొంది ఆలయ పూజాదికాలను  రామానుజ విధానం లో  సంస్కరించాడు .పూర్వపు ఆచార్యుల గ్రంధాలను సేకరించి నకళ్ళు రాయించి భద్రపరచాడు .కంచి శ్రీ పెరుంబుదూర్ తిరుపతి సందర్శించి కంచిలో కిలాంబి నాయనారు వద్ద శ్రీ భాష్యం చదివాడు .శ్రీరంగం తిరిగివచ్చి గృహస్థ జీవితానికి స్వస్తి చెప్పి సన్యాసం  స్వీకరించి ,ఆలయ విషయాలలో దృష్టిపెట్టాడు .రామానుజాశ్రమానికి మరమ్మతులు చేయించి ,పిళ్ళై లోకాచార్య విగ్రహం దేవాలయం లో నెలకొల్పాడు .

  1430 ప్రాంతం లో శ్రీ రంగ నాధస్వామి ఉత్సవాలను ఒక ఏడాదిపాటు ఆపేసి  నమ్మాళ్వార్ రచించిన తిరుమొఝి పై  దానికున్న 5 వ్యాఖ్యాలనాధారం గా మలవాల మాముని ప్రవచనం ఏర్పాటు చేశారు  .ప్రవచనం పూర్తయ్యాక చివరి రోజున శ్రీరంగ నాధుడే స్వయంగా బాలుని గా వచ్చి మాముని పాదాల చెంత ఒక కాగితం పెట్టాడు .అందులో ఉన్న శ్లోకమే ‘’మలవాల మాముని తనియన్ ‘’గా సుప్రసిద్ధమైంది -ఆశ్లోకం -’’శ్రీశైలేశ దయాపాత్రం ధి -భక్త్యాది గుణార్ణవం -యతీంద్ర ప్రవణమ్  వందే రమ్య -జా మంత్రం మునిమ్ ‘’భావం -శైలేంద్ర శిష్యుడు, రామానుజుని పై అవ్యాజమైన గౌరవమున్న బుద్ధి వివేకం భక్తి గుణ సముద్రుడు అయిన మనవాల మాముని ప్రవచనానికి శ్రీ రంగనాధుడు ప్రశంసించి ఇస్తున్న నమస్కారం .దీనితో శ్రీరంగనాథునికే ముని గురువైపోయాడని అర్ధం .ముని ‘’ఆచార్య హృదయం ‘’కు గొప్ప వ్యాఖ్యానం రాశాడు

342-భగవద్ గుణ దర్పణ కర్త -పరాశర భట్టార్ (1122-1174 )

కూరత్తాళ్వార్ కుమారుడైన పరాశర భట్టార్ గురువు ఎంబార్ వద్ద సకల శాస్త్రాలు నేర్చి ‘’నడిచే విశ్వ విద్యాలయం ‘’అని పించాడు .విష్ణు సహస్రనామాలపై ‘విష్ణు సహస్ర నామ  భాష్యం అనే ‘’భగవద్ గుణ దర్పణం ‘’రాశాడు .రంగ నాధ స్తోత్రం రంగనాధాష్టకం ,శ్రీ గుణ రత్న కోశం ,క్రియాదీపం ,అష్ట శ్లోకి ,చతుషలోకి ,ద్విశ్లోకి తని శ్లోకి కూడా రాశాడు .ఇతని బాల్యం లో అద్వైత పండితుడు కోలాహలుడు పల్లకీ లో ఊరేగుతూ రామానుజుని వాదం లో ఓడించాలని వెడుతున్నాడు .అప్పుడే ఈ బాలుడు గుప్పెడు నిండా ఇసుక తీసుకొని తనదగ్గర  యెంత ఇసుక ఉంది అని కొహలుడిని ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోగా ‘’గుప్పెడు ఇసుక ఉంది అని చెప్పలేని నువ్వు భగద్రామానుజులతో వాదానికి వెడుతున్నావా ?’’అని ఎద్దేవా చేశాడు .కొహలుడు పరాశర బాలుడిని తండ్రి కూరేశుని గురువు ఎంబార్ ను మెచ్చి ఆశీర్వదించాడు . తర్వాత పరాశరునిశిష్యుడయ్యాడు  ,

343-ప్రపన్న పారిజాత కర్త -వరద విష్ణు ఆచార్య (1165-1275)

1165 లో జన్మించిన వరద విష్ణు ఆచార్య 110 సంవత్సరాలు జీవించి 1275 లో మరణించాడు . సుదర్శనాచార్య నికూడా పిలుస్తారు .తండ్రి దేవ రాజా పెరుమాళ్ ,తాత నాదదూర్ ఆళ్వార్ .శ్రీ భాష్య సింహాసనాధిపతి అయి ,కంచిలో అర్చావిగ్రహ ప్రతిష్టాపన చేశాడు .ఈయన కుల దైవ విగ్రహం తిరువేళ్లూర్ లో ఉంది .వరద విష్ణు 19 గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనది ప్రపన్న పారిజాతం .ఇదికాక శ్లోక ద్వయి ,పరత్వాది పంచక స్తుతి ,తత్వ నిర్ణయం తత్వ సారం ,సామాన్యఅ ధికారణ వాదం ,యతి లింగ సమర్ధనం ,హేతి రాజస్తవం ,ప్రమేయ మాల శ్రీ భాష్య సంగ్రహం ,ఆహ్నిక చూడామణి వంటి గ్రంధాలు రాశాడు .పిల్లాడికి తల్లి వేడిపాలు త్రాగించినట్లు ఈయన కంచి వరద రాజస్వామికి గోరు వెచ్చని వేడిపాలు నైవేద్యం  పెట్టే  వాడు.స్వామి సంతోషించి ‘’నువ్వు నా తల్లివా ?’’అన్నాడట అప్పటినుంచి ఈయనపేరు ‘’నాదదూ ర్ అమ్మాళ్ ‘’అయింది

344-విష్ణు పురాణ వ్యాఖ్యాత -విష్ణు  చిత్తుడు(1280

రోహిణీ నక్షత్రం లో చైత్రమాసం లో విష్ణు చిత్తుడు  జన్మించాడు .శ్రీభాష్యం భాగవత వైభవం ప్రవచనాలతో జీవితం గడిపాడు .విష్ణుపురాణం భాష్యం రాశాడు .ఇదికాక విష్ణు చిత్తీయం సారార్ధ  చతుష్టయం ,సంగతిమాసం రాశాడు .శ్రీ విల్లి పుత్తూరు లోని కోలాక్కొండ లో పరమపదం పొందాడు .

345- జ్ఞాన ,ప్రమేయ సారల కర్త -దేవ రాజముని(975)

  రామానుజుని పూర్వ అద్వైత గురువుయజ్ఞమూర్తి చివరికి శిష్యుడై  దేవరాజముని అయ్యాడు .జ్ఞాన సార ,ప్రమేయం సారగ్రంథాలు  రచించాడు .గురువు రామానుజుడు వీటిని తీక్షణంగా పరిశీలించి ఆమోదించాడు .వరద రాజస్వామి తిరుమర్దనం బాధ్యతను ను దేవ రాజమునికి అప్పగించాడు .

రామానుజుని అనుజుడు -గోవింద(1020

రామానుజా చార్యులవారి తమ్ముడు వరుసయిన గోవిందతమిళ తాయి నెల పునర్వసు నక్షతరం లో పుట్టాడు .రామానుజుని గురువు యాదవ ప్రకాశుడు రామానుజుడిని విషం తో చంపే ప్రయత్నం చెస్ట్ గోవిందుడే అన్నను  ప్రాణ గండం నుంచి బయట పడేశాడు .ఒకసారి ఒక నదిలో స్నానం చేస్తుంటే ముకుంద చేతుల్లోకి ఒక శివ లింగం చేరింది .అప్పటికప్పుడు వైష్ణవం వదిలి అద్వైతి అయిపోయాడు ముకుందా .ఆతర్వాత కొద్దికాలానికే తిరుమలనంబి ,రామానుజుల హిత వుతో మళ్ళీ విశిష్టాద్వైతి అయ్యాడు .రామానునుజునికి స్నానం చేయించటం ప్రక్క ఏర్పాటు చేయటం  నడకలో సాయం చేయటం ఆయన వస్త్రాల జాగ్రత్త ముకుంద యే శ్రద్ధగా చేసేవాడు .ముకుంద గొప్పతనాన్ని తెలియబరచే ఒక తనియన్ –

‘’రామానుజ పదశ్చాయా  గోవిందా ఆహ్వాన పాయినే -దధాధ్యతా స్వరూపాశ్చ జియాన్ మద్  విశ్రమస్థలే ‘’

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.