గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా
పాండిచ్చేరి ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో ఇండాలజిస్ట్ డా దేవీ ప్రసాద్ మిశ్రా యువ సంస్కృత విద్యావేత్తగా ‘’మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ ‘’పురస్కారం 2015 లో అందుకున్నాడు .దీనికి ఒక లక్ష రూపాయల పారితో షికం ఇచ్చారు .ఈ పురస్కారాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదుగా 2016 అందుకున్న అదృష్టవంతుడు మిశ్రా
ఒరిస్సాలో నయాగరా జిల్లాకు చెందిన మిశ్రా ,1999 లో పాండిచ్చేరి ఫ్రెంచ్ ఇన్ ష్టి ట్యూట్ లో సంస్కృత రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు .సంస్కృతం లో ‘’సూర్య శతకం ‘’రాయటమే కాక ,శైవాగమాలపై విపరీతమైన కృషి చేశాడు .ఈ సంస్థలో మిశ్రా 3, 500 వ్రాత ప్రతులను క్రోడీకరించాడు .నేనుఈ సంస్థలో చేరి పి .హెచ్ .డి.చేస్తుండగా ఈ కేటలాగింగ్ చేసే అదృష్టం నాకు కలిగింది ‘’అంటూ పొంగిపోయి చెప్పాడు మిశ్ర .ఈ సంస్థలో 8 400 కు పైగా తాళపత్ర గ్రంధాల కట్టలున్నాయని ,అందులో శైవాగమాలు కర్మకాండ గ్రంధాలే ఎక్కువని ,మిగిలినవి ఆలయ శిల్పకళా ,జ్యోతిషం ఖగోళ శాస్త్రామ్ ,తిరుక్కురళ్ దక్షిణ భారత దేశ వైద్యం ,సంస్కృత సాహిత్యం ,తమిళ ఆధ్యాత్మిక0 కు చెందినవని అన్నాడు .
వీటిలో చాలా గ్రంధాలు ‘తమిళ బ్రాహ్మణుల ‘’’గ్రంథ లిపి ‘’లో రాయబడిన సంస్కృత గ్రంధాలని ,మిగిలినవి కాశ్మీరీ శారదా లిపి ,నందినాగర,నెవారి ,తీగలారి ,గ్రంథ ,తెలుగు ఒరియా ,తుళు పుస్తకాలని ,ప్రతి తాటాకు కట్టలో చిన్న చిన్న అక్షరాలలో డజన్ల కొద్దీ గ్రంథాలుంటాయని పరిశోధకుడు దేవీ ప్రసాద్ మిశ్రా తెలియ జేశాడు .
363-విదేశీ భాషా గ్రంధాలపై సంస్కృత ప్రభావం
ఫిలిప్ గ్లాస్ రాసిన ‘’సత్యాగ్రహ ఒపేరా ‘’లో భగవద్గీత శ్లోకాలను సంస్కృతం లో పాడటం జరిగింది .ది మార్క్సిస్ట్ రివల్యూషన్ ‘’లో ‘’బృహదారణ్యక ఉపనిషద్ ‘’ప్రార్ధన ఉంది .ప్రఖ్యాత మడోన్నా మ్యూజిక్ ఆల్బమ్ లోని ‘’సైబర్ రాగ ‘’లో సంస్కృత మంత్రోచ్చారణ ఉంది . 1998 లో మడోన్నా గ్రామీ అవార్డు అందుకున్న ఆల్బమ్ ‘’రే ఆఫ్ లైట్ ‘’లో ‘’అష్టాంగ విన్యాస యోగ ‘’మంత్రాలున్నాయి .అసలు లిరిక్కే ఓం శాంతిశాంతి తో ప్రారంభమవుతుంది .సంగీత కర్త జాన్ విలియమ్స్ ‘’ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్‘’లో ‘’స్టార్ వార్ ‘’ఎపిసోడ్ లో సంస్కృత శ్లోకాల కాయిర్ సింగింగ్ ఉంది . 2004 నాటి ‘’బాటిల్ స్టార్ గాలాక్టికా ‘’అంతా ఋగ్వేదం లోని గాయత్రీ మంత్రమే .ఎనిగ్మాతా రాసిన’’ లిరిక్స్ ఆఫ్ చైల్డ్ ఇన్ యు ఎస్ లో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి ..(ఆధారం –సాంస్క్రిట్ -గీకీ పీడియా )
364-ఆరవ శతాబ్ది రామాయణం కనుగొన్న -కలకత్తా ఏషియాటిక్ సోయాసైటీ
కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ రీసెర్చ్ స్కాలర్స్ వారు 6 వశాతాబ్దానికి చెందిన ‘’వహ్ని (అగ్ని )పురాణం పై పరిశోధిస్తుంటే అందులో ఒక అసంపూర్తి వ్రాతప్రతి గ్రంధం చూసి ఆశ్చర్య పడిపోయారు .అప్పుడు జర్మన్ స్కాలర్ Aufrecht గోబర్ రిపాజిటరీ గా సంస్కృత గ్రంధాలపై తయారు చేసిన ‘’కేటలాగో కేటలాగం ‘’ను పరీక్షగా చూడగా ఒకే రకమైన రెండు వ్రాత ప్రతులు ఉన్నట్లు గమనించారు .ఒకటి లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ వారు భద్రపరచినది ,రెండవది శతాభి చరిత్రకలిగిన కలకత్తా సంస్కృత సాహిత్య పరిషత్ భద్ర పరచింది గా తెలుసుకొన్నారు .వారి ఉత్సాహం పెరిగి అగ్నిపురాణం వ్రాతప్రతి బూజు దులిపి దాని సంపూర్ణ ప్రతిని పట్టుకొన్నారు .దీన్ని విశ్లేషిస్తుండగా ‘’దశగ్రీవ రాక్షస వధ ‘’కు వహ్నిపురాణానికి ఏమీ సంబంధం ఉన్నట్లు కనబడ లేదు .ఈ పురాణం లో అకస్మాత్తుగా మరొక రకమైన కథా శ్లోకాలు ఎలా చేరాయో అర్ధం కాలేదువారికి .నిదానం గా ద్రుష్టి సారిస్తే వారికి తాము చదువుతున్నది అనేక చేర్పులు మార్పులతో ఉన్న 6 వ శతాబ్దపు రామాయణ గ్రంధం అని అర్ధమైంది .ఆర్కిమిడీస్ లాగా ‘’యురేకా ‘’అని ఆనందం తో కేకలేసుకొన్నారు . అసలైన వాల్మీకి రామాయణం క్రీ పూ 4 వ శతాబ్దానికి చెందింది .
ఈ 6 వ శతాబ్ది రామాయణం లో 7 కాండలకు బదులు 5 కాండలు మాత్రమే ఉన్నాయి .బాలకాండం ఉత్తర కాండలు లేవు .రావణ వధ తర్వాత రామాదులు అయోధ్యచేరి పట్టాభి షేకం జరుపుకోవటం తో ఈ రామాయణం సమాప్తం .ప్రారంభం కూడా దశరధుని శాపం రాముడిని అరణ్యాలకు పంపటం లేదు .దీని బదులు శుక్రాచార్యుల భార్యను విష్ణుమూర్తి సంహరించినందుకు ఆయన లక్ష్మీ దేవిని శపించటం ,చనిపోయిన రాక్షసులను బ్రతికించటం తో కధ ప్రారంభమౌతుంది .రెండవ శాపం నిరంతరంగా జరుగుతున్న దేవ దానవ యుద్ధానికి ధరిత్రి వ్యధ చెందగా లక్ష్మీ నారాయణులు బాధ్యత తమపై వేసుకొని తామిద్దరం శాప ఫలంగా భూమిపై జన్మిస్తామని తెలియ జేయటం జరుగుతుంది .ఈ రామాయణం భార్యా భర్తల వియోగానికే ప్రాధాన్యం తప్ప తండ్రీ కొడుకుల వియోగాన్ని ప్రాధాన్యమివ్వలేదు .ఇందులో రాముడు దేవుడుగాకాక మానవత్వమున్న ఉన్నత మానవునిగా కనిపిస్తాడు
(ఆధారం -న్యూ రామాయణ డిస్కవరీ అ స్టాండ్ స్కాలర్స్ ఇన్ కలకత్తా –ఝిమి ముఖర్జీ పాండే ) దీని ఫోటో జతచేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—