గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)
భారతీయ భాషలను మొట్టమొదట కంప్యూటరీకించి,వేదాలనూ కంప్యుట రైజ్ చేసిన భారతీయ మేధావి డా శ్రీ రేమెళ్ళ అవధానులు ‘’.యజుర్వేద సంహితలో టు టు ది పవర్ ఆఫ్ 19 వరకు అంకెల ప్రస్తావన ఉంది .దీన్ని ‘’లోక ‘’అంటారు .వాల్మీకి రామాయణం లో’’ మహౌమ’’ఉంది అంటే పది టు ది పవర్ ఆఫ్ 62 .పైధాగరస్ కనిపెట్టాడని చెప్పుకొంటున్న లంబ కోణ త్రిభుజ సూత్రం బోధాయన ‘’శుల్బ సూత్రాలలో ‘’ఉంది .’’ఇన్ఫినిటీ ‘’గురించి ‘’పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ‘’శ్లోకం లో ఎప్పుడో మనవాళ్ళు చెప్పారు .హైడ్రోజెన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదం లో కనిపిస్తుంది .ఏకతాయ స్వాహా ద్వితాయా స్వాహా త్రితాయా స్వాహా ‘’లోని ద్వితా డ్యుటీరియం,త్రిథా త్ట్రిటీణీయంగా మార్చి నట్లు అనిపిస్తుంది . ట్రిగనా మెట్రీ ని అందరికంటే ముందుకనుక్కోని ,ఆర్య భట్టు వరాహమిహిరుడు సైన్ ,కాస్ ల విలువలను ముందే చెప్పారు . .స్టీమ్ ‘’అనే పదం పాణిని అష్టాధ్యాయి లో ఉంది .స్టీమ అర్జీ భావే ‘’అంటే ఆవిరి అవటం .న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ శక్తి ని భాస్కరాచార్యుడు 12 వ శతాబ్దం లో తన ‘’సిద్ధాంత శిరోమణి ‘’లో భూమ్యాకర్షణ శక్తిగా చెప్పాడు .ఆధునిక భౌతిక రసాయన వైద్య వైమానిక శాస్త్రాలలో ఉన్న సమాచారం అంతా వేదాల్లో నిక్షిప్తమై ఉంది .అందుకే ‘’అన్నీ వేదాల్లోనే ఉన్నాయష ‘’అనే సామెత వచ్చింది .ఇది వెటకారం కాదు పచ్చినిజం ‘’అంటారు అవధానులుగారు .
తనకు మంత్రాలపై మంచి అవగాహన ఉండేదని ,కానీ పరమాణు భౌతిక శాస్త్రం లో ఏం ఎస్ సి చేశానని చెప్పారు .అప్పుడే ఒక ప్రయివేట్ కంపెనీ మొదటిసారిగా కంప్యూటర్ కోర్సు ప్రకటన చేసిందని ,అందులో చేరి డిప్లొమా పొంది ,తర్వాత రాజోలు కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ సాయంకాలలలో ప్రక్కనే ఉన్న వేద పాఠ శాలలో వేదం నేర్చుకొంటూ ,1971 లో హైదరాబాద్ లో యి.సి.ఐ.ఎల్. లో టెక్నీకల్ ఆఫీసర్ గా చేరి పని చేశారు .మన దేశం లో మొదట కంప్యూటర్ తయారు చేసింది ఈ కంపెనీయే .ఇక్కడ శిక్షణలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది .దీన్ని 3 వేల సంవత్సరాలక్రితమే భారతీయులు కనుక్కొన్నట్లు తెలిసి ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగిందట . ఇక్కడ పని చేస్తూకూడా వేదం నేర్చుకొంటూ ,అప్పటికి ఏ భారతీయ భాషా కంప్యూటరీకరించబడలేదని గ్రహించి మొదటగా తెలుగును కంప్యూటరీకించాలన్న ఆలోచనవచ్చి ఆయన స్నేహితులతోకలిసి 6 నెలలు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్ లోకి ఎక్కించారు .ఇలా 1976 లో భారతీయ భాషలలో తెలుగు భాష ఒక్కటే మొట్టమొదటిసారిగా కంప్యూటరైజ్ అయి అవధానులు బృందానికి ఘన కీర్తి నిచ్చింది.అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ వావిలాల గోపాల క్రష్ణయ్య గారు కంపెనీకి వచ్చి అభినందించారట .కానీ ఆఫీసువారి ప్రోత్సాహం కరువై ముందుకు సాగలేదన్నారు .
తెలుగు కంప్యూటర్ లోకి ఎక్కిందన్న సంచలన వార్త పార్లమెంట్ ను కుదిపేసి ,హిందీ ని కూడా చేర్చమని కంపెనీ అధికారులపై ఒత్తిడి వస్తే ,అవధానులు బృందం దాన్నీ ఎక్కించారు .పార్ల మెంటరీ కమిటీ వచ్చి చూసి స0తృప్తి చెంది అభినందించింది . 1978 లో ఢిల్లీ లో ‘’భారతీయ భాషల కంప్యూటీకరణ ‘’అనే అంశం పై సదస్సు నిర్వహించారు ,కానీ ప్రోత్సాహం కరువై ఆగిపోయింది . 1991లో నిమ్స్ లో పని చేస్తున్నప్పుడు గోదావరి పుష్కరాలలో తిరుమల దేవస్థానం గ్రంధాలు చదివి 1131 వేదం శాఖలకు కేవలం 7 శాఖలే మిగిలాయని చదివి అశ్రద్ధ చేస్తే ఇవి కూడా త్వరలోనే అంతరించిపోతాయేమోననే భయమేసి ఎలా రక్షించుకోవాలన్నా ఆలోచనవచ్చి రికార్డ్ చేయిస్తే అంచిదనిపించి ,యజుర్వేదం నేర్చుకొంటూ ,మరీ ప్రమాద లో పడిపోయిన ఋగ్వేదం నేర్చిన వారెవరైనా ఉన్నారేమోనని అన్వేషణ చేస్తూ ,మహా రాష్ట్రలో ఒకాయన ఉన్నారని తెలిసి కుటుంబ సమేతంగా ఆహ్వానించి పోషణ బాధ్యత తీసుకొని వారితో ఋగ్వేదాన్ని 1992లో రికార్డ్ చేయించటం ప్రారంభించారు .
అదే సమయం లో తిరుపతి దేవస్థానం వారు ‘’అఖిల భారత వేద శాస్త్ర సమ్మేళనం ‘’నిర్వహిస్తున్నప్పుడు తనను వేదాలపై ఒక ప్రదర్శన ఇవ్వమని కోరగా ‘’నమక0 ‘’లోని మూడుమంత్రాలను వాటి అర్ధాలను సి లాంగ్వేజ్ సాయం తో కంప్యూటర్ లో పెట్టగా దాన్ని చూసిన ఉపరాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ అవధానులుగారిని మనస్ఫూర్తిగా అభినందించి తనకు 10 నిమిషాల సమయాన్నిమాత్రమే ఇచ్చినా, శర్మగారు 45 నిమిషాలుదాకా మాట్లాడి ప్రపంచం లోనే మొట్ట మొదటిసారిగా వేదాలను కంప్యూటర్ లో పెట్టిన ఈ విలువైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయమని కోరారు .కంప్యూటర్ కొనాలంటే లక్షల మీద ఖర్చు .దీనికి అశ్విని హెయిర్ ఆయిల్ అధినేత సుబ్బారావు గారు వెంటనే ఒక లక్షా ఇరవై వేల రూపాయలు ఉచితంగా ఉదారం గా అందజేయగా అవధానులుగారు అత్యాధునిక కంప్యూటర్ కొన్నారు .పని చేయటానికి కుర్రాళ్ళు కావాలి వాళ్లకు జీతాలు తనజీతంలోనుంచి ఇచ్చేవారు. తానూ వారితో పంచేస్తూ ‘’వేద భారతి ట్రస్ట్ ‘’ఏర్పాటు చేయగా విరాళాలు అంది పని నిరాటంకంగా సాగింది . 1995 వేదానుక్రమణిక రాస్స్హారు . ఈ విషయాలు తెలుసుకొన్న రాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ ఢిల్లీకి ఆహ్వానించారు .యజుర్వేదానికి చెందిన 7 అనుక్రమణికలు కంప్యూటరీకించి ,దేశం లోనే మొదటి సారి మల్టీ మీడియా లో ఆయనకు చూపించారు . ఆయన మహా గొప్పగా ఆనందించి అభినందించారు . 2000 నాటికి ఋగ్వేదాన్ని సి డి లలో పొందుపరచారు .వీటిని ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ఆవిష్కరిస్తూ ‘’మా చిరకాల స్వప్నం సాకారమైంది ‘’అని మెచ్చుకొన్నారు .
బెంగుళూరులో వైదిక సరస్సు జరుగుతుంటే పాల్గొనాలని వెడితే తనకు ఏ శాస్త్రం లోను ప్రవేశం లేదుకనుక అనుమతి లేదని చెబితే పట్టుబట్టి రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన తనబాబాయి శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి వద్ద మీమాంస శాస్త్రం నేర్చుకొన్నారు .తర్వాత సంస్కృతం జ్యోతిషం లలో ఏం ఏ చేసి ,’’వేదాలలో సైన్సు ,భూకంపాలు -జ్యోతిషం ‘’లపై పిహెచ్ డి చేసి ,వేదగణితం వేద విజ్ఞానా లపై చానళ్లలో కార్యక్రమాలు చేశారు .అవధానులుగారు చేసిన ‘’మల్టీ మీడియా వేదిక డేటా బేసిక్ డిజైన్ ‘’కు భారత ప్రభుత్వం పేటెంట్ హక్కునిచి ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదుతో సత్కరించింది .
వేద భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 700 కు పైగా గంటల రికార్డ్ పూర్తయింది .ఇది 200 కుపైగా ఆడియో మల్టీమీడియా సిడి లుగా తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు .మిగిలిన వేద శబ్దాన్ని రికార్డ్ చేయటానికి ఇంకా 2500 గంటలు కావాల్సి వస్తుందన్నారు .అంత ఆర్ధిక స్తొమత తమకు లేదని వదాన్యులు ముందుకు వచ్చి ప్రోత్సహించి వేద విజ్ఞానాన్ని సంరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు .అవధానులుగారు ‘’వేద గణితం ,రామాయణ భాగవత భారతాలలో జ్యోతిశ్శా స్త్ర విశేషాలు ,ఉపనిషత్ రత్నావళి ,సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ‘’గ్రంధాలు రాశారు .ఇంట గొప్ప పరిశోధకులు క్రియాశీలి వేద గణితం పై అధారిటీ అయినా శ్రీ అవధానులు గారి గురించి ఇంతఆలస్యంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో రాయటం క్షమించరాని నేరమే.అయినా ఇప్పటికైనా రాయగలిగా నని ఒక ప్రక్క సంతోషిస్తున్నాను.
అవధానులుగారు 25-9-1948న తూర్పుగోదావరి పొగడపల్లి లో జన్మించారు .తండ్రిశ్రీ వి సూర్య నారాయణ తల్లి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—