గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్ అండ్ మైథలాజికల్ స్టడీస్ వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –
1-శ్రీ దిగ్వే కర్ యాచించిన -కురుక్షేత్ర మాహాత్మ్యం 2-నాగేశభట్టు రాసిన -పరమ లఘుమంజరి 3-డా జి ఏం భట్టాచార్య రాసిన మేఘ దూత టీకా 4-నారాయణ తీర్థుల -కుసుమాంజలికారికా వ్యాఖ్య 5-రాజానక ఆనందకవి కృత-ష్తత్రి0శత్తత్వ సందోహ 6-డా కపిల్ దేవ శాస్త్రి రచన -గాణాపత్య 7-డా బల్దేవ్ సింగ్ కృత -పాదపదార్ధ సమీక్ష 8-ధర్మోత్తర వ్యాఖ్యతో న్యాయబిందు 9-డా ఎస్ యెన్ శాస్త్రి రాసిన -దయానంద దర్శన 10-డా ఎస్ యెన్ శాస్త్రి కృత -వేదం ప్రామాణ్య తదా ఋషి దయానంద
374-ఘెరండ సంహిత కర్త -ఘెరండుడు (17 వ శతాబ్దం )
హఠ యోగం పై ఉన్న మూడు ప్రసిద్ధ గ్రంధాలలో ‘’ఘెరండ సంహిత ‘’ఒకటి మిగిలిన రెండు హఠ యోగ ప్రదీపిక ,శివ సంహితలు ,ఘెరండుడు చంద్ర కాపాలికి బోధించిన హఠ యోగం ఇది . 17 వశతాబ్దికి ఈ చెందిన ఈ గ్రంధం హఠయోగానికి విజ్ఞాన సర్వస్వము .దీనిలో సప్త విధ యోగాలు చెప్పబడినాయి 1-శతికర్మ -బాహ్యాభ్యంతర శుచికి 2-ఆసన -బలానికి 3-ముద్ర -నిశ్చలత్వానికి 4-ప్రత్యాహార -ప్రశాంతికి 5-ప్రాణాయామ -తేలిక కు 6-ధ్యాన దర్శనానికి 7-సమాధి -తాదాత్మ్యానికి చెప్పబడ్డాయి .ఇది ‘’ఘటస్థ యోగం ‘’కు చెందినదిగా కూడా భావిస్తారు .సమాధి ప్రకరణం లో పతంజలి చెప్పినదానికంటే అనేక పద్ధతులు దీనిలో చెప్పబడ్డాయి -ఒక శ్లోకం –
‘’అద్యశ్య సేతే పద యుగ్మ వ్యస్తం పృష్టే నిధియాపి ధృతం కరాభ్యాం -ఆకుంచ సంయ ద్యుదరాస్తు గాఢం ఉష్టం ఉచ్ఛం చ పీఠం యాతాయో వదంతి ‘’(ఉష్ట్రా సన వర్ణన )భావం -ముఖం కిందకు వంచి రెండుకాళ్లు వెనక్కిమడిచి ,పాదాలను చేతులతోపట్టుకొని పొట్ట .మూతి అక్కలిస్తే ఉష్ట్రాసనం
375-శివ సంహిత -అజ్ఞాత కవి (17 వశతాబ్దం )
హఠ యోగం పై మరోగ్రంధమే శివ సంహిత శివుడు పార్వతికి తంత్ర శాస్త్రాన్ని గురించి బోధించిన గ్రంధం .1 7 వశతాబ్దిలో దీన్ని వారణాసిలో ఒక అజ్ఞాత కవి రాసినట్లు దీని పై డి ఫిల్ పరిశోధన రాసిన డా మాలిన్సన్ అభిప్రాయపడ్డాడు.దీన్ని తంత్ర శాస్త్రమని కవి చెప్పాడు .ఇందులో 84 ఆసనాలు చెప్పబడ్డాయి .కానీ అయిదింటినిమాత్రమే పూర్తిగా వివరించి చెప్పాడు .సామాన్య గృస్తహుకూడా దీన్ని అభ్యాసం చేయచ్చు అనికవి భరోసా ఇచ్చాడు అనేక ఆంగ్లానువాదాలున్నాయికానీ 1884 లో లాహోర్ కు చెందిన శ్రీ చంద్ర వాసు అనువాదం పరిపుష్ఠిగా ఉందని విశ్లేషకులు భావిస్తారు .ఒక శ్లోకం చూద్దాం –
‘’ఏకం జ్ఞానం నిత్య మాధ్యంత శూన్యం కిఞ్చిద్వత్తే తే వస్తు సత్యం -యద్దేవారి మన్నింద్రి యోపాధినా వై జ్ఞానస్యాయ భాసతే నాణ్య యైవ ‘’-భావం -జ్ఞానమొకటే శాశ్వత0 అది ఆద్యన్తరహితం .సత్యమైనది వేరొకటి లేదు ప్రపంచం లో మనం చేసే వైవిధ్యం ఇంద్రియ సంబంధమైనడది .ఈ భావం నశిస్తే ఉన్నదొక్కటే సత్యమనే జ్ఞాన0
2-సత్యం కేచిత్ ప్రశంసంతి తపః శోచం తథాపరే -క్షమాం కేచిత్ప్రశంసంతితథైవ సమ్మార్జనం ‘’
భావం – కొందరు సత్యాన్ని కొంద రు స్వచ్ఛతను మరికొందరు సన్యాసాన్ని పొగుడుతారు .కొందరు క్షమను కొందరు సమానత్వాన్ని రుజుత్వాన్ని పొగుడుతారు
375-హఠ యోగ ప్రదీపిక కర్త –స్వామి స్వాత్మా రామ్ (15 శతాబ్దం)
స్వామి గోరఖ్ నాధ్(శ్రీనాధ్ ) శిష్యుడు స్వామి స్వాత్మారాం 15 వ శతాబ్దం లో హఠ యోగ ప్రదీపిక రాశాడు .హఠ యోగం పై ఇదే మొదటి గ్రంధం .దీనిలో భౌతిక ఆంతరిక శుద్ధి వివరించాడు .ఆసన ,ప్రాణాయామాలపై ఎక్కువ దృష్టిపెట్టాడు .దీనికి ఆంగ్లం లో పంచన్ సిన్హా చక్కని వ్యాఖ్య రాశాడు .
‘ఆసనాలపై చెప్పిన మొదటి శ్లోకం ‘’శ్రీ ఆదినాధాయ నమోస్తు తస్యై ఏనాపాదిస్టా హఠ యోగ క్రియా – విభ్రాజతే పరే న్నత రాజయోగం ఆరో ఆరో ధుమి చ చ్చోరాది రోహిణీవ ‘’
భావం -హఠ యోగ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన ఆది దేవుడైన శివునికి ప్రణామం .ఇది రాజయోగాన్ని అధిరోహించటానికి మెట్టుగా తోడ్పడుతుంది
‘’ప్రణమ్య శ్రీ గురుం నాదం స్వాత్మా రామేణ యోగినా -కేవలం రాజ యోగాయ హఠ విద్యో పాదిశ్యతే ‘’
భావం – స్వాత్మానంద యోగి గురువైన శ్రీనాధునికి నమస్కరించి రాజయోగ మార్గాన్ని దారి చూపే హఠ యోగాన్ని రాస్తున్నాడు ..
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-17- కాంప్-షార్లెట్- అమెరికా
—