గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
376— చతుర్వర్గ చింతామణి కర్త -హేమాద్రి పంత్ (1259-1274)
దేవగిరి యాదవ రాజ మంత్రి హేమాద్రి లేక హేమాద్రి పంత్ .కరణాధిపుడు అని పిలుస్తారు . 1263 లో పండరీపురం లోని పాండురంగ విఠల దేవాలయ నిర్మాణం లో హేమాద్రి భూరి విరాళమండించినట్లు శిలాఫలకం ఉంది .గొప్ప పరిపాలనా దక్షుడేకాక సంస్కృత కావ్యాలు కూడా రాశాడు .ఆయన సంస్కృత రచన ”చతుర్వర్గ చింతామణి ”లో అనేక వ్రతాలు నోములు వాటిని ఆచరించే విధానాలు అన్నీ సవివరంగా ఉన్నాయి .ఇదికాక ”మోడీ లిపి ”ని తయారు చేసి ప్రచారం లోకి తెచ్చాడు .1 272 వరకు దేవ గిరిరాజు రామచంద్ర దేవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు .మరాఠీ భాషపైనా గొప్ప అభిమానం ఉన్నవాడు .ఆభాషలోనూ రచనలు చేశాడు .ఆయన మత సహనం మెచ్చదగినది జైనమతానికీ సహాయం చేశాడు అనేక దేవాలయాలు నిర్మించాడు .అయన శిల్ప శాస్త్రం లో ప్రావీణ్యుడు ఆయన తన ధై న శైలిలో నిర్మించిన ఆలయాలను ”హేమాద్రి దేవాలయాలు ”అంటారు .దక్షిణ భారత దేశం లో హేమాద్రి వందలాది ఆలయాలు కట్టించాడు .చతుర్వర్గ చింతామణి లో దేవాలయ రకాలు విగ్రహాల రకాల వివరాలన్నీ పొందు పరచాడు పంత్ .ఆయన గ్రంధాలు శిల్పాలు దేవాలయాలు ఆయన సంస్కృతీ మూర్తిమత్వానికి ప్రతీకలుగా నిలిచాయి
కర్ణాటకల దక్షిణ కన్నడ జిల్లా హేమాద్రి గ్రామం లో బ్రాహ్మణ కుటుంబం లో హేమాద్రి జన్మించాడు .శుక్ల యజుర్వేదీ శ్రీ వత్సగోత్రీకుడు పఞ్చార్షి ప్రవరుడు .. తండ్రి కామదేవుడు బాలుని బాల్యం లోనే మహారాష్ట్రకు చేరాడు .సంస్కృత మహా విద్వా0సుడు శిల్ప శాస్త్రవేత్త .యాదవ మహాదేవ రాజు ,రామ చంద్ర దేవా రాజుల ఆస్థాన మంత్రిగా గొప్ప చాకచక్యం సమర్ధత తో రాచకార్యాలు నిర్వహించాడు .అయన మంత్రిత్వ లో రాజ్యం సుభిక్షమే కాక అన్ని విధాలా అగ్రస్థానం లో నిలిచి చరిత్ర సృష్టించింది .హేమాద్రి పదవీ విరమణ తర్వాత ఢిల్లీ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ రాజ్యాన్ని ఆక్రమించి యాదవరాజ్య వినాశనం చేశాడు
హేమాద్రి పంత్ ”ఆయుర్వేద రసాయనం ”అష్టాంగ హృదయం ”అనే ఆయుర్వేద గ్రంధాలు రాసి అనేక వ్యాధులు వాటి చికిత్సావిధానాలు తెలిపాడు .ఆయన జీవిత చరిత్రపై ”హేమాద్రి పంత్ బఖార్ ”వ్రాయబడింది .రాజ్య పాలనా సౌకర్యం కోసం రాజ్యాన్ని ”మేస్ట కాలు ”గా ఏర్పాటు చేశాడు
మరాఠీ భాషను సంస్కరించి పరిపాలనలో మోడీ లిపి ”ని ప్రవేశ పెట్టాడు
మహారాష్ట్రలో వర్షాధార పంటగా ”పెర్ల్ మిల్లెట్ ”సజ్జ పంట ను పండించే కృషి చేశాడు
మహారాష్ట్రలో వర్షాధార పంటగా ”పెర్ల్ మిల్లెట్ ”సజ్జ పంట ను పండించే కృషి చేశాడు
మహా రాష్ట్రలో శ్రీ మహా లక్ష్మి అమ్మవారి ఆరాధనకు విశేషప్రాచుర్యం తెచ్చాడు .ఎందరో కవులకు కళాకారులకు ఆశ్రయం కల్పించి వారి సృజనకు ప్రోత్సాహమిచ్చి సత్కరించాడు .బోపదేవ కవిని సన్మానించి అయన రచనలపై చక్కని వ్యాఖ్యానం రాసి ప్రచారం కలిగించాడు .
హేమాద్రిపంత్ నే రఘునాధ దండో ల్కర్ అనీ అంటారు ఈయన షిరిడి సాయిబాబా భక్తుడు ఆయన జీవితం పై శ్రీ షిరిడీ బాబా సచ్చరిత్ర ”మరాఠీ భాషలో రాశాడు ఇది ఇవాళ చాలా సాధికార గ్రంధం .అన్నిభాషలలోకి అనువాదం పొంది సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమైంది .ఇందులో సాయిబాబా జన్మ కాలాన్ని హేమాద్రి 1838 గా నిర్ణయించాడు .బాబా గురువు వద్ద 12 ఏళ్ళు ఉన్నాడని ఆగురువుపేరు ”వేణూక్ష’లేక సెలుకు చెందిన సూఫీ ఫకీర్ గోపాల్ రావు దేశ్ ముఖ్ కావచ్చు నని చెప్పాడు . 1854లో షిరిడీలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండగా మొదటిసారిగా అందరూ బాబాను చూశారని తెలియజేశాడు .మిగిలినవన్నీ మనకు తెలిసిన విషయాలే
377-పంచ రత్న గీత కర్త -స్వామి సత్యానందం సరస్వతి (1923-2009 )
వేద శాస్త్రాలలో అఖండ పాండిత్యం సాధించిన స్వామి స త్యానంద సరస్వతి దేశం లో ప్రముఖ సంస్కృత విద్వా0సులు ,60 కి పైగా సంస్కృతం తో సహా పలుభాషలలో రచనలు చేశారు .హిందూ ధర్మ రక్షణకు కంకణం కట్టుకొన్న మహానుభావులు .గురువు నుండి 1971లో దీక్ష పొంది వేదం విజ్ఞానాన్ని సంస్కృతం చండీ పథం లను గురువుశివానంద సరస్వతి ”డివైన్ లైఫ్ సొసైటీ ”లో చేరి శ్రీ అమృతానంద సరస్వతి నుండి పొందారు .
హిమాలయాలలోని బాక్రేశ్వర్ వద్ద మంచుకాలం లో వేసవిలో దేన్నీ లెక్క చేయకుండా చండీ పథం కంఠస్థం చేశారు .హిమాలయ పర్వత శ్రేణువులలో 15 సంవత్సరాలు ఆ చివరనుంచి ఈ చివర వరకు ఆయన తిరగని ప్రదేశమే లేదు .సంస్కృతం పై ప్రత్యేక ఆరాధన ఏర్పడి దాన్ని ఆమూలాగ్రం నేర్చి బెంగాల్ ,హిందీలలో కూడా ప్రావీణ్యం సాధించారు .శ్రీ రామ కృష్ణ పరమహంస బోధలు అధ్యయనం చేసి ప్రచారం చేశారు .1 979 లో శారదా మాత ను సందర్శించారు .దేశ మంటా పర్యటిస్తూ పూజలు హోమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ప్రజలకు మార్గ దర్శి అయ్యారు
1984 లో అమెరికా వచ్చి ”మాతృ మందిర్ ”స్థాపించి నఫా ,కాలిఫోర్నియాలలో బాగా ప్రచారం చేశారు . పంచ రత్నాలు అంటే గీతా మహాత్మ్యం విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్మ స్తవం ,అనుస్మృతి ,గజేంద్ర మోక్షం .వీటిలోని భావార్ధాలను చక్కడా వివరించి చెప్పారు ;
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా