గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
379-అన్వీక్షికి వ్యాఖ్యాత -కపిలామహర్షి (క్రీ.పూ. 650-575 )
-అన్వీక్షి కి సంప్రదాయ వ్యాఖ్యాత -కపిలమహర్షి . ఆత్మ విద్యకు మరోపేరు అన్వీక్షి కి మనువు తన ధర్మ శాస్త్రం లో ఆత్మ విద్య ను అన్వీక్షికి అని పేర్కొన్నాడు .తర్వాత ఇది ఉపనిషత్తులలో ఒక భాగమైంది .యదార్ధానికి అన్వీక్షికి ఉపనిషత్తులకు ఆత్మ విద్యకు భేదంగా కనిపిస్తుంది .క్రీపూ 327 వాడైన కౌటిల్యుడు”త్రయీ అంటే వేదాలు వార్తికాలు ,,దండనీతి కంటే భిన్నమైన విశేష విషయాలున్నది అన్వీక్షికి అన్నాడు ఆత్మ విద్య ఆత్మా స్వభావాన్ని గురించి వివరిస్తే అలా భావించటానికి గల కారణాలను అన్వేషించి చెప్పింది అన్వీక్షికి అన్నాడు చాణక్యుడు .ఆత్మా.హేతువులను గురించి చెప్పిందే అన్వీక్షికి అన్నాడు వాత్సాయనుడు ఉపనిషత్తు చెప్పింది ఆత్మా విద్య లేక ఆధ్యాత్మ విద్య మాత్రమే .హేతువులను చర్చింది అన్వీక్షికి . కానీ క్రీ పూ 650 వరకు కపిలుడు దీనిపై సాంఖ్యం రాసేదాకా ఒక నిర్దిష్ట రూపం సం త రించుకోలేదు . అన్వీక్షికి సాటిలేని ఒక దర్శనశాస్త్రం అయింది తర్క శాస్త్రం లో ప్రాముఖ్యమైంది .హేతు విద్య లేక హేతు శాస్త్రం గా పిలువబడి చివరికి తర్క శాస్త్రం గా పేరు పొందింది .దీనినే వాద విద్య అన్నారు – ఇప్పుడు న్యాయ శాస్త్రంగా గుర్తింపు పొందింది .చార్వాక ,జాబాలి మొదలైన వారు దీన్నిఅనుసరించగా కపిలుడు గొప్ప వ్యాఖ్యానం రాశాడు
కపిల మహర్షి క్రీ పూ 650-575 కాలం వాడు .అజ్మీర్ దగ్గర పుష్కరం వద్ద జన్మించినట్లు పద్మపురాణం లో ఉంది .సాంఖ్య సూత్రాలు రాశాడు .దీని వివరణ అంతా సాంఖ్యకారికలో లభిస్తుంది .మహాభారతం లో కపిల మహర్షి అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించినట్లు ఉంది . స్వేతాశ్వతర ఉపనిషత్ లో కపిలునిపై విస్తృతంగా ఉన్నది .
బ్రహ్మ పురాణం లో వేనుడు అనే రాజు వేదాలను వదా ధ్యయ నాన్ని క్రతువులను నిషేధి0చి వేద ధర్మానికి విఘాతం కలిగిస్తే ,అతనిని సంహరించి కపిలుడు మహర్షులను వేనుని తొడను మధించమంటే నిషాదుడు పుట్టాడు .కుడి చేతిని మధిస్తే పృధువు జన్మించి భూమిని సస్యశ్యామలం చేశాడు అందుకే భూమిపృథ్వి అని అతని పేరుతో పిలుస్తున్నాం .మహర్షులతో కలిసి కపిలుడు కపిల సంగమానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు .సాగరపుత్రులు 60 వేలమంది అశ్వమేధ అశ్వాన్ని రక్షిస్తూ వస్తే విష్ణుమూర్తి కపిలముని వేషం లో పడుకొని నిద్రిస్తుంటే నిద్రాభంగమై కళ్ళు తెరవగానే సాగర పుత్రులు నలుగురైదుగురు తప్ప అందరూ కంటి మంటకు భస్మమైపోయారు
భాగవతం లో కర్దమ ప్రజాపతి,దేవ హోతి దంపతులకు కపిలుడు జన్మించినట్లున్నది .మత్శ్యపురాణం లో కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురు దను ల 100 మందిసంతానం లో కపిలుడు ఒకడు ;సాంఖ్య సూత్రాలు ఒకటి రెండు చూద్దాం –
1-కృపయా చివి దదుహ్ కాత్య0తాని వృత్తి రత్యంత పురుషార్ధహ్ ”భావం మనిషిలోని మూడుబాధలు అతని అంతానికి కారణం .
2-న దృష్టాంత చ్చిద్ధార్ణ వృత్తియే రప్యను వృత్తిదర్శనాత్ -భావం ఈ బాధ మందూమాకులవలన తగ్గేదికాదు
3-ప్రత్యాహి కక్షుత్మతీకర చేస్టనా త్పురుషార్థత్వం . భావం -మనసులోని కోరిక బాధకు కారణం .అది నిత్యం ఆకలిలాంటిది
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-17- కాంప్-షార్లెట్-అమెరికా
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D