గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
380-వాసుదేవ వాగ్వేణు కర్త -డా.ఉమాచంద్ర శేఖర్ వైద్య (1952)
–19-9-1952 లో పంజాబ్ లో జన్మించిన డా ఉమావైద్య కవికులగురు కాళిదాస సంస్కృత యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పని చేశాడు .సంస్కృత మరాఠీ హిందీ ఇంగ్లిష్ లవ్ అపార పాండిత్యం సంపాదించాడు అనర్గళ వక్త కూడా .సంస్కృత పాళీ వ్యాకరణం లో మొదటి రాంక్ లో ఏం ఏ ,,సంస్కృత వ్యాకరణం లో ఫై హెచ్ డి సాధించాడు వైస్ ఛాన్సలర్ కాకపూర్వం బొంబాయి భద్రకార్ సంస్కృత ఇన్ స్టిట్యూట్ సంస్కృత శాఖాధ్యక్షుడు గా ,ఠాగూర్ చైర్ ఆఫ్ కంపారేటివ్ లిటరేచర్ కు గైడ్ గా ఉన్నాడు .పాళీ భాషలో అధారిటీ ఉన్నవాడు .రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్కృత నాటకపోటీలకు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు .అనేక సాహిత్యప్రసంగాలు రేడియో ప్రసంగాలు చేసిన వక్త .సంస్కృత వాడుక భాష పై అనేక వర్క్ షాపులు నిర్వహించాడు .ఈయనవద్ద 10 మంది రీసెర్చ్ చేసి పి హెచ్ డి లయ్యారు
సంస్కృతం లో ”వాసుదేవ వాగవేణు ,తోపాటు అభిజాతా సంస్కృత సాహిత్య చల్తీహాసం ,అప్షనల్స్ ఇన్ సంస్కృత లాంగ్వేజ్ అండ్ పాణిని ,మిస్టిక్స్ ఇన్ వరల్డ్ రెలిజియన్స్ గ్రంధాలురాశాడు .వివిధ అంశాలపై 80 కి పైగా రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు .
బొంబాయి బ్రాహ్మణసభ ”ప్రజ్ఞావంత పురస్కారం ,ర్రాష్ట్రీయ గౌరవ పురస్కారం ,ఉత్తమ దేశిక ,ప్రబోధ పురస్కారం ,సంస్కృత సేవ ,సంస్కృత సాహిత్య పురస్కారం వంటివి ఎన్నో అందుకొన్నాడు
2001 నుంచి 2008 వరకు విజిటింగ్ ప్రొఫెసర్ గా జపాన్ ,అమెరికా ,ఇటలీ ,ఆస్ట్రేలియా ,మారిషస్ లు సందర్శించాడు .
సాహిత్య అకాడెమి ప్రచురించిన భారతీయ అలంకార శాస్త్ర విజ్ఞాన సర్వస్వ0 ప్రాజెక్ట్ లో తనవంతు కర్తవ్యమ్ నిర్వహించాడు .చైనా యుని వర్సిటీలలో ఒకదానిలో ప్రవేశపెట్టే సంస్కృత కోర్సు తయారు చేశాడు .సౌరాష్ట్ర బొంబాయి ఔరంగాబాద్ వగైరా యుని వర్సిటీలలో రిఫ్రెషర్ కోర్స్ లు నిర్వహించాడు చాలా యుని వర్సిటీలకు కన్సల్టింగ్ఎక్సపర్ట్ గా ఉన్నాడు ,