వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు ) మరో రుద్రాభిషేకం వారం -2

వీక్లీ అమెరికా-16 -2(10-7-17 నుండి 16-7-17 వరకు )

మరో రుద్రాభిషేకం వారం -2
12-7-17 బుధవారం టివి 5 దర్శకుడు విశ్వనాధ్ కు గురుపౌర్ణమినాడు చేసిన  గురుపూజోత్సవం ”గురు బ్రహ్మ ”చూసాం దాని అధిపతి నాయుడుగారు చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమ0 నిర్వహించారు అందరూ చెప్పులు ,బూట్లు బయటే వదిలి లోపలి వచ్చి కూర్చున్నారంటే ఎంత నిబద్ధత పాటించారో అర్ధమౌతుంది ప్రముఖగాయకుడు గంగాధర్” లంగరే”శాడు అంటే యాంకరింగ్ చేశాడు .సుస్పష్టమైన శబ్దోచ్చారణతో అపరఘంటసాల అని పించే గానమాధుర్యంతో నిర్వహించిన తీరు ముచ్చటగా ఉంది  కళాతపస్వి విశ్వనాధ్ తోపాటు శ్రీ కందాడై రామా చార్యులు ,సంగీత దర్శకుడు  ఆర్ పి పట్నాయక్ ,నటి నృత్య కళాకారిణి మంజు భార్గవి ,కవి సిరివెన్నెల   అన్నమయ్యపేమ్ భారవి ,సినీ పాటలరచయిత రామ జోగేశ్వరరావు వగైరాలు పాల్గొన్నారు మంజు, మంజుల నాట్యం కను విందు చేసింది . సిరివెన్నెల మాటల సిరి వెన్నెల కురిపిస్తే పట్నాయక్ పాట  కచేరీలా మాట్లాడితే కందాళై గురు పరమార్ధమ్ బోధిస్తే, భారవి విశ్వనాధుని కీర్తి స్తవం చేసి కార్యక్రమ రక్తి కట్టిస్తే విశ్వనాధ్ తనదైన వినమ్ర శైలిలో కృతజ్ఞతలు తెలిపారు సిరివెన్నెల చెప్పిన విషయం ఒకటి అందరు గుర్తించాలి .ఎందరెందరికో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు  లభించింది .ఆ సందర్భం గా ఒకటో రెండో అభినందన సభలు జరిగాయి కానీ విశ్వనాధ్ ను ఆ అవార్డు వరిస్తే ,2 నెలల నుంచి రోజూ ఎక్కడో అక్కడ సభ, సమావేశం, అభినందన చందనం జరుగుతూనే ఉన్నాయి భారత దేశ చలన చిత్ర చరిత్రలో ఇంతటి వేడుక ఎవ్వరికీ  జరగ లేదు ఒక్క విశ్వనాధ్ కే  ఆ అరుదైన గౌరవం దక్కింది కారణం ఆయన సినిమా ప్రతి ఇంటి సినిమా ఆయన ప్రతి ఇంటికీ చెందిన వాడవటం అందులో భారతీయ సంస్కృతీ ప్రతిఫలించటం ఆకధల్లో తెలుగుదనం ఉట్టిపడటం ,హృదయపు లోతుల్లోకి ఆయన పాట  మాట నృత్యం దూసుకుపోయి తిష్టవేయటమే ఇంత అభిమానాన్ని సంపాదించి ఆయనకు ఆంధ్రాజనులు గు0డె లో గుడి కట్టుకున్నారు .”విశ్వనాధ కళా కాశీ నాధుని ”ప్రతిష్టించి పూజ సలిపారు ”అన్నాడు .హృదయపు లోతుల్లోంచి వచ్చిన మాటలవి .గంగాధర శాస్త్రి విశ్వనాధ్ మరొక సినిమా తీయాలని ప్రొద్యూసార్లు రెడీ గా ఉన్నారని అన్నాడు కానీ నా ఉద్దేశ్యం లో విశ్వనాధ్ ఇక సినిమా తీయరాదు .ఉన్న కీర్తి అనుభవిస్తూ ఆనందించాలి క్రియేటివిటీ ఎప్పుడూ ఉండదు .ఒక్కోసారి ఒట్టిపోతుంది .దానిలో నుంచి ఎంతపిండినా సారం రాదు  ఆయన వయసూ ఇక సహకరించదుకనుక ఆయనపై ఒత్తిడి తేరాదు .
  టివి 5 వారు ;;హిందూ ధర్మం ”అనే కొత్త ఛానల్ ను ప్రారంభిస్తు న్నారట  దానికి పాట  సిరివెన్నెల రాయాలని ,పట్నాయక్ స్వర కల్పన  చేయాలని నాయుడుగారుకోరగా వేదిక మీదే  సిరివెన్నెల పల్లవి రాసి వినిపించి అందరి కరతాళ ధ్వనులు అందుకొన్నాడు  .నేత్రపర్వంగా జరిగిన ఈకార్యక్రమంలో విశ్వనాధ్  దట్టమైన తెల్ల గడ్డం,  మీసం తోకూచిపూడి సిద్ధేంద్ర యోగి ముఖవర్ఛస్సుతో వెలిగి పోయాడు  అని పించింది . టివి 5 కు అభినందన చందనం ..
   గురువారం రాత్రి యు ట్యూబ్ లో కేరక్టర్ నటి అన్నపూర్ణ ఇంటర్వ్యూ చూసాం ఆమె నవ్వులో మాటలో ఎంతో స్వచ్ఛత  గుబాళించింది . సినీ అమ్మ లుగా శాంతకుమారి ,నిర్మలమ్మ ,అంజలీదేవి సూర్యకాంతం లతర్వాత ఆతల్లి పాత్రకు మరింత వన్నె తెచ్చింది  అన్నపూర్ణ . తనను తానూ తీర్చి దిద్దుకొన్నది . తానూ ఏ వేషానికి పనికొస్తానో  అర్ధం చేసుకొని అందులోనే శిఖరాయమానంగా నిలిచింది .స్వర్గం నరకం సినిమాలో హీరోయిన్ గా ఉన్న ఆమె ఆతర్వాత హీరోయిన్ వేషాలకు వెంపరలాడ లేదు .. వేషాలకోసం ప్రాకులాలేదు ఆమెను వెతుక్కొని వచ్చాయి వేషాలు .సార్ధక నటి అన్నపూర్ణ  .
  14-శుక్రవారం మధ్యాహ్నం హాస్య నటుడు రావికొండలరావు ఇంటర్వ్యూ చూసాం .. క్రేన్స్ చలన చిత్రోత్సవం లో ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే ”ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు ”అని చెప్పినమాట పరమ ప్రామాణ్యం అంటాడు రావి .డబ్బు నిలువ చేసుకోలేక  హాస్య నటుడు కస్తూరి శివరావు   మహా నటుడు  నాగయ్య ,అత్యుత్తమ విలన్ రాజనాల వంటి వారు జీవితం చివరి దశలో అత్యంత దీన స్థితిలో గడిపిన వైనాన్ని గుర్తుకు తెచ్చాడు కస్తూరి రాజనాల వ్యసనాలకు బానిసలై ఉన్నదంతా పోగొట్ట్టుకొన్నారు .ఆనాడే ఏ హీరోకూడా తీసుకోనంత అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు తీసుకొన్న నాగయ్యగారు డబ్బు అజమాయిషీలేక చివరికి ఆయన నటించిన ”బీదల పాట్లు ”లాగా గడిపారన్నాడు  .నాగయ్య గారి ఆనాటి లక్ష ఈ నాటి లెక్కల్లో 15 కోట్లు ఉంటుంది అని అక్కినేని ఎప్పుడూ చెప్పేవాడని అన్నాడు .
    ప్రముఖ హా స్యనటుడు పుణ్యమూర్తుల రాజ బాబు తమ్ముళ్లు చిట్టిబాబు ,అనంత్ లు తామూ అన్నకు తక్కువ ఏమీ కాదని నిరూపించారు .  .ఇండస్ట్రీ తమను బాగా ఆదరించిందని తమకేమీ లోపం లేదని ధీమాగాచెప్పారు .చిట్టిబాబు ఇంటర్వ్యూలో రాజబాబు ఎన్టీ రామారావు తో సమానంగా ఆయనకు 30 వెలిస్తే తానూ 30 వేలు ఆయనకు లక్ష ఇస్తే డిమాండ్ చేసి తానూ లక్షా పారితోషికం తీసుకొన్న దమ్మున్న హాస్య నటుడు అన్నాడు . ఆయన చేయని పుణ్యకార్యాలు లేవని ఏం జి రామ చంద్రన్ లాగా రిక్షావాలాకు చెప్పులు డ్రస్సులు కొనిపెట్టిన ఉదారహృదయయుడని ,ఆయన పుట్టిన రోజు మద్రాస్ లో మూడు రోజులు ఘనంగా జరుపుకొని దేశం లోని కళాకారులందర్నీ పిలిపించి ప్రయాణపు ఖర్చు లాడ్జింగ్ బోర్డింగ్ లన్నీ పెట్టుకొని నాటకాలు బుర్రకథలు వగైరా చెప్పించి తగిన పారితోషికం ఇచ్చి పంపేవాడని అన్నాడు ..అక్కినేని  నందమూరి  వగైరా  అగ్రనటులనేకాక అందర్నీ ”బాబాయ్ ”అని పిలిచే చొరవ ఉన్నవాడు అన్నాడు ..వాళ్ళు కూడా రాజబాబు లేకుండా వేషాలు ఒప్పుకొనేవారుకాదట
   రాజబాబు సినీ అరంగేట్రం పై ఒక కధ  చెప్పాడు  .మొదటిసారి వేషం దొరికి మొదటి షాట్ రేలంగితో రేలంగి నౌకరు వేషం వచ్చింది.  మేకప్ అయి రెడీ గా ఉన్నాడు.  వరుసగా అందరీమేకప్పులు అయి ఈయన యాక్టింగ్ కు టైం ఉండటం తో  ఆరుబయట స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వాళ్ళు చేయమన్న  మిమిక్రీ చేస్తూ రేలంగిని కూడా అనుకరించమంటే అనుకరిస్తుండగా షాట్ రెడీ వార్త వచ్చి షూటింగ్ కి వెళ్లి ఆ రేలంగి ఇమిటేషన్ లోంచి బయటపడకుండానే మొదటి డైలాగ్ రేలంగితో ఆయన అనుకరణ తో చెప్పాడట .ఇంకేముంది రేలంగి ఫైర్ అయి ”ఎవడీ దొంగ నాకొడుకు నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు తీసిపారెయ్యండి ఈ రాస్కెల్ ని ”అని హుకమ్ జారీచేయగా యెంత బ్రతిమాలినా వేషం దక్కక వెళ్లి పోయాడట . 4నెలల తర్వాత అదే రేలంగి తానూ తీస్తున్న ”సమాజం ”సినిమాకు ”ఒరే .ఆ రోజు నన్ను ఇమిటేట్ చేసిన పంతుల్ని పిలిపించండి వేషం వేయిద్దాం ”అని పిలిచి వేషం ఇచ్చాడట . ఇదే రాజబాబు మొదటి సినిమా .
               రాజమండ్రి  గోదావరి తీరం లో రాజబాబు కాంశ్య విగ్రహాన్ని మద్రాస్ లోని హాస్య నటులందరూ కలిసి నిర్మించి ట్రెయిన్ లో నాలుగు బోగీలలో వారంతా రాజమండ్రి వచ్చి ఆవిష్కరణ మహోత్సవం లో పాల్గొన్నారని అంతటి అభిమానం ఏ హాస్య నటుడికీ దక్కలేదని అన్నాడు.మనకు తెలియని ఎన్నో రాజబాబు రహస్యాలు విప్పి చెప్పాడు చిట్టితమ్ముడు చిట్టిబాబు .
  15-7-17 శనివారం     మరో రుద్రాభిషేకం
జూన్ 3 న ఇక్కడ శ్రీ గ్రంధి హరి గారింట్లో ఆయన కోరికపై నేను రుద్రాభి షేకం జరిపించటం చూసిన కన్నడ దంపతులు శ్రీమతి మాలిని శ్రీ వాసుకి దంపతులలో మాలిని జూన్ 5 వతేదీ సోమవారం ఉదయం మా ఇంటికి వచ్చి ఇంగ్లిష్ లో హ రిగారింట్లో అభిషేకం బాగా చేయించానని మెచ్చి ,జులై నెలల15 వతేదీ సాయంత్రం  తమ ఇంట్లో రుద్రాభిషేకం నా ఆధ్వర్యం జరిపించాలని కోరితే సరే అన్నాను
  నిన్న అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మా అమ్మాయి నన్ను కారులో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది 3.-30 కి మాలిని దంపతులచేత విఘ్నేశ్వర పూజ ,శివ ఆవాహనం ,అష్టోత్తర శతనామ పూజ లలితా అష్టోత్తరం వారి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర  వల్లీ ,దేవ సేన పూజ చేయించి రుద్రం ప్రారంభించేసరికి సాయంత్రం 5-15 అయింది .ఇంతలోకి రుద్రం చదివే వాళ్ళు సుమారు 10 మంది వచ్చారు .లఘున్యాసం తో రుద్రాభిషేకం ప్రారంభించిఏకాదశ రుద్రం చేసి  వచ్చిన వారందరి చేత చేయించి ,మళ్ళీ అష్టోత్తరపూజ ,నైవేద్యం హారతి ఇప్పించి అందరం కలిసి మంత్రం పుష్ప0 ఏక కంఠం తో చెప్పి వేద హోరుతో పునీతం చేసాం . ఆ తర్వాత భోజనాలు .దాదాపు 80 మందికి పైగానే వచ్చారు .రాత్రి 9 అయింది .అంటే సుమారుఅయిదున్నర గంటల కార్యక్రమం.  మాలిని కోరిక పై నిర్విఘ్నంగా జరిగింది ..   తర్వాత భోజనాలు -టమేటా  బాత్, రెండు స్వీట్లు ,మజ్జిగపులుసు ,వగైరాలు .నాకేమీ తినాలని పించక కొద్దిగా మజ్జిగ పులుసు కొంచెం పెరుగన్నం ఒక స్వీట్  తో    సరి పెట్టుకొన్నాను
  కన్నడ సంప్రదాయం లో మా దంపతులకు మాలిని వాసుకి దంపతులు మంచి నూతన వస్త్రాలు ,4 కొబ్బరికాయలతో ” ఘనమైన నగదు” తాంబూలం తో సత్కరించి ఆశీర్వాదం అందుకొన్నారు .అప్పుడు ఆ దంపతులతో ”ఇవాళ ఉదయం షష్ఠి  సాయంత్రం సప్తమి తిధి . రేపు రాత్రి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడుకనుక దక్షిణాయనం వస్తుంది .ఇవాళ ఉత్తరాయణ మహా పుణ్యకాలం లో సప్తమి తిధినాడు మీ ఇంట్లో రుద్రం చేసాం”అనగానే వాళ్ళు ”ఈజిట్ ఆ0కుల్  వి ఆర్ వెరీ ఫార్ట్యు నే ట్ యు డిడ్  వెరీ వెల్ అంకుల్ ”అని ఉప్పొంగిపోయారు .ఆతర్వాత శివలింగాన్ని ఎందుకు పూజించాలో కూడా క్లుప్తంగా చెప్పా . అలాగే -మాలిని అంటే మాలలు ధరించేది అని సరస్వతి దేవి అష్టోత్తరం లో మాలిన్యైనమః అని ఉందని వాసుకి శివుని కంఠాభరణమైన సర్పరాజని  మాలిని హారం గా అంటే భర్తగా వాసుకి ఉన్నాడు కనుక వారిద్దరూ అర్ధ నారీశ్వరులని మొత్తమంతా ఇంగ్లిష్ లో చెప్పా .ఎంతో సంతోషించి ఇలాంటి మంచిమాటలు ఒక సారి మా ఇంట్లో మళ్ళీ చెప్పాలి మీరు అంకుల్ అన్నది మాలిని సరే అన్నా .  ఆ దంపతులు ఇక్కడి సాయి సెంటర్ కు వెన్నెముక వంటివారు . మాలిని గొప్ప సహాయకారి అని మా అమ్మాయి ఎప్పుడూ చెబుతుంది ..కార్తీకమాసం లో మా వాళ్ళు నిర్వహించే అభిషేక కార్యక్రమానికి ఆమె ఎంతగానో తోడ్పడుతుంది .. మంచి మనసున్న మహిళ మాలిని . వాసుకి కూడా హిందూ సెంటర్లో జరిగే అన్నికార్యక్రమాలకు మైక్ లైటింగ్ వగైరాలు దగ్గరుండి చూస్తాడ్రు . అందుకే అంత  అభిమానంగా ఇంతమంది వచ్చారు.
  మా షార్లెట్   మనవరాలు రమ్య
  ఇక్కడ జరిగిన మొదటి సాయి కార్యక్రమం లో నాకు ఒక అమెరికా మనవరాలు దొరికింది మా ఉయ్యూరు మనవరాలు రమ్య పేరే ఆమెదీ .మొదటి సారే  చెప్పా .నువ్వు మామనవరాలవు అని ఆమె పొంగిపోయింది ఎప్పుడు కనిపించినా నేను మనవరాలు అనే పలకరిస్తాను .  చక్కని నవ్వు అణకువ సంప్రదాయమున్న తమిళ అమ్మాయి తెలుగు కొంతవరకు బాగానే మాట్లాడుతుంది . ఇవాళ రుద్రాభిషేకం భోజనం అయ్యాక నా దగ్గరకు వచ్చి ”అంకుల్ !మీరు పట్టు బట్టలు రుద్రాక్షలతో చాలా ”క్యూట్ ”గా కనిపించారు అంకుల్ ”అన్నది నాకు మహా ఆనందం కలిగింది . అందరి భోజనాలు అయి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10-45 అయింది . నా కొడాక్ కెమెరా పని చేయటం లేదు .అందుకని సెల్ లో ఫోటోలు తీస్తున్నా వీటిని పెట్టాలంటే మా మనవడు చి పీయూష్ ఎక్స్ పర్ట్ వాడిపై ఆధార పడాల్సి వస్తోంది .ఇవాళ పొద్దున్న వాడితోనే పెట్టించా .
5 ఏళ్ళ క్రితం 2012లో షార్లెట్ వచ్చినప్పుడు అంతా ”సాయి ”హవా నడిచింది .ఇప్పుడు దాన్ని తిరగేస్తే ”ఈశా ”హవా” నడుస్తోంది . ఈ వారం కథ ఇంతటితో సమాప్తం .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.