వీక్లీ అమెరికా -16(10-7-17 నుండి 16-7-17 వరకు )
మరో రుద్రాభిషేకం వారం -1
10-7-17 సోమవారం -మా మనవళ్లు చి ఆశుతోష్ ,పీయూష్ లను ఒక నెలరోజుల కాంప్ లో చేర్చారు .ఉదయం 7 గంటలకు వెళ్లి సాయ0కాలం 4 కు వస్తారు పొద్దున్న దిగబెట్టి సాయంత్రం తీసుకొస్తున్నారు .పెద్దమనవడు చి శ్రీకేత్ ని కూడా ఇంగిలీషు స్పెషల్ కోచింగ్ లో చేర్చారు రోజుకు రెండుగంటలు .వాడినీ దింపి తీసుకు వస్తున్నారు .దీనితోనే వీళ్ళ టైం సరిపోతోంది . తప్పదు . రాత్రి ”గొట్టం ”లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వాలుజడ తోలు బెల్టు ,అప్పు చేసిపప్పుకూడు చూసాం సరదాగా ఉన్నాయి రేలంగి నరసింహారావు డైరెక్టర్ .మనవడు ,మనవరాలు చరణ్ రమ్యలకు ఫోన్ చేసిమా ట్లాడాం . రమణ ఉయ్యూరు విషయాలు ఎప్పటికప్పుడు తెలియ జేస్తున్నాడు వర్షాలు బాగానే పడుతున్నాయి కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయట .
మంగళవారం -గీర్వాణం పని నిన్నా ఇవాళ . రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ 83 ఏళ్ళ గుడిపూడి శ్రీహరితో తెలకపల్లి రవి ఇంటర్వ్యూ చూశా .ఈ నాడులో ”హరివిల్లు ”శీర్షిక 30 ఏళ్ళు నిర్వహించిన ఘనత ఆయనది .జర్నలిజం లో 60 ఏళ్ళ అనుభవం ఆయనది హిందూ కు కూడా ఆయన రాస్తాడు ఆయన ఆర్టికల్స్ చదవటం అదొక గొప్ప అనుభూతి హాస్య0 అంతర్వాహినిగా చక్కగా నిండుగా చురుకుగా కరుకుగా ప్రవహిస్తుంది .ఆయన సినిమాలమీద రాసిన వ్యాఖ్యానాలు సూపర్బ్ .నాకు చాలా ఇష్టమైన రచయిత.ఈ కామెంట్లు నాకు అత్యంత ఆప్తులు భారతీయ సాహిత్య పరిషద్ అధ్యక్షులు బందరు హిందూ హై స్కూల్ లెక్కలమేస్టారు గొప్ప కదా రచయితా ఇంగ్లిష్ లో అమోఘ పాండిత్యం ఉన్న స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారి పోకడ కనిపిస్తుంది మూర్తిగారు వారం వార0 జాగృతి వారపత్రికలో సినిమా సమీక్ష చాలా ఏళ్ళు నిర్వహించారు
గుడిపూడి వారు చెప్పిన విషయాలు మీతో చెప్పాలని పిస్తోంది ..ఒక సారి సురభి నాటక కంపెనీ గురించి హిందూ పత్రికలో రాయటానికి ఫోటోగ్రాఫర్ ను తీసుకొని వాళ్ళు ఉండే పల్లెటూరువెళ్లి వారంతా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకొనే వరకు వారి దైనందిన కార్యక్రమాలన్నీ ఫోటోలు తీశారని వీళ్ళ కోసం వాళ్ళు అప్పటికప్పుడు తెరలు కట్టి నాటకాలు ఆడి చూపించారని ,మద్రాస్ వెళ్లి దీనినంతటిని హిందూ ఆదివారం స్పెషల్ లో 4 పేజీల వ్యాసం రాశానని ఫోటోలన్నీ అందులో పెట్టానని హిందూ పేపర్ చరిత్రలో ఒక అంశం పై అన్ని పేజీల ఆర్టికల్ అంతవరకూ ఎన్నడూ రాలేదని ఈ ఎడిషన్ ప్రపంచం అంతా చదివే ఎడిషన్ అని దీనితో సురభి చరిత్ర ప్రపంచానికి అంతటికీ తెలియ జెప్పే అవకాశం తనకు దక్కిందని అన్నారు . ఆతర్వాత ఎప్పుడో సురభి వాళ్ళు ఆయన దగ్గర కొచ్చికేంద్ర అకాడెమీ ద్వారా తమకేదైనా ఆర్ధిక సాయం చేయించమని అభ్యర్ధించారని తానూ వాళ్లకు ఒక రికమండేషన్ లెటర్ ఇచ్చిఢిల్లీలో ఉన్న శ్రీ గరిమెళ్ళ వెంకట రమణ ? గారి వద్దకు పంపానని ,ఆయన వారిని అకాడెమీ అధ్యక్షుల దగ్గరు తీసుకు వెళ్లారని ,సురభి అధినేత ఆయనతో తమ గోడు చెప్పుకోబోతుంటే ”మీరేమీ చెప్పక్కరలేదు మీ గురించి అంతా గుడిపూడి శ్రీహరిగారు హిందూ లో రాసిన ఆర్టికల్ చదివి పూర్తిగా తెలుసుకున్నామని చెప్పి క్షణం ఆలస్యం చేయకుండా 75 లక్షల చెక్ ఇచ్చి పంపారని చెప్పారు మహోపకారం జరిగింది శ్రీ హరిగారిద్వారా సురభికి .అకాడెమీ వదాన్యతనూ ప్రశంసించాలి .
మరో విషయం గుడిపూడి చెప్పారు .ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఏం ఎస్ రామారా వు గారు గొప్ప సంగీతజ్ఞులు ఆయన సినిమాలకు ఎన్నో పాటలు పాడారు చక్కని స్వరం ఆయనది .ఆయన పాడిన ”ఓహో జహాపనా ” అలాగే చివరికి మిగిలేది సినిమాలో మల్లాది రాసిన పాటలు ”చెంగున అలమీద మిడిసిపోతది మీను ”వంటి పాటలు అంటే నాకు మహా ఇష్టం . నా ఆరాధ్యగాయకులలో ఆయన ఒకరు . అలాంటి ఏం ఎస్ .రాజమండ్రి లో దిక్కూ మొక్కూ లేకుండా ఒక చిన్న గుడిసెలో భార్యతో ఉండేవారట తిండి తినే వారో లేదో తెలీదు . ఆయన ప్రక్కన ఉన్న ఒక ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ,ఈయన కమ్మగా పాడుకొంటుంటే ”ఏమిటీ పొద్దున్నే ఈ దరిద్రపు పాటలు ఇక ఆపు ”.అని కేకలేయటం గుడిపూడి స్వయంగా చూసి కరిగిపోయి అంత గొప్పగాయకుడికి ఇంతటి అవమానమా అని బాధపడి వెంటనే హైదరాబాద్ కు తనతో పాటు తీసుకొచ్చి తన ఇంట్లోనే 3 నెలలు ఆదంపతులను ఉంచుకొని ,అన్నిరకాల ఆదు కొంటూ తన స్కూటరు పై ఆయన్ను ఎక్కించుకొని ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సంస్థలవారందరికి పరిచయం చేసి ,ఒక రోజు రవీంద్ర భారతి లో 6 సంస్థల ఆధ్వర్యం తో రామారావుగారి సంగీత విభావరి ,హనుఆం చాయీసా ఏర్పాటు చేస్తే ,క్రిక్కిరిసి రసజ్ఞులతో హాలు నిండి ,ఆయన గాన వాహినిలో జనం తన్మయం చెందారట వారికి తగినంత ఆరాధిక సాయమూ చేకూరింది ఆతర్వాత ఆయనే సుందర కాండ తెలుగులో రాసి అనేక సభలో పాడి మంచి ప్రచారం పొంది ”సుందర దాసు ”అయ్యారు అమీర్పేట లో సవంత గృహం నిర్మించుకొని బాగా పాప్యులర్ అయ్యారు ఏలోటూ లేకుండా గౌరవ గా జీవించారు .గడిపూడిచెయి అందించకపోతే ఆ మహా గాయకుడి అరిస్థితి ఎలా ఉండేదో సుందరదాసుగారి మనవడు ఇప్పుడు సుందరకాండ పారాయణలో ఛానళ్లన్నీ దున్నేస్తున్న సంగతి మనకు తెలుసు ..
ఇంకో విషయమ -రామోజీ రావు తీసిన సినిమాను విక్టరీ మధుసూదనరావు డైరెక్ట్ చేశాడట ఆసినియా గురించి హరి తన సహజ ధోరణి లో తానూ ఈ నాడులో పనిచేస్తున్నా నిష్కర్షగా సమీక్ష రాశాడు .నిగ్రహించుకోలేని విక్టరీ రామోజీ దగ్గరకు వెళ్లి ”మన సినిమాపై కూడా ఇలా రాస్తే ఎలాగండి కాస్తపిలిచి చీవాట్లు పెట్టండి ”అన్నభావ తో కంప్లైంట్ చేస్తే ”అది ఆయన స్వభావ0 ఆయన సినిమాను సినిమాగా చూసి రాస్తాడు అది నేను తీసిందా ఇంకోరు తీసినదా కాదు అందులో పదార్ధం ఉందా లేదా అనేదే ఆయన వెతుకులాట .మనం దీనిలో వేలు దూర్చరాదు .సినిమా బాగుంటే చూస్తారు లేకపోతె లేదు మనకోసం ఆయన రాయడు అయన పధ్ధతి అంతే ”అన్నాడట దిమ్మ తిరిగిందివిక్టరీకి .ఆసినిమా ఆడనే లేదట . గుడిపూడి సుమా రు 4 వేల తెలుగు సినిమాలు ఒక వెయ్యి ఇంగ్లిష్ హిందీ సినిమాలు మొత్తం 5 వేలకు పైగా సీనియాలు చూసిమాత్రమే సమీక్షలు రాశాడు .ఇంట్లో కూర్చుని చూడా కుండా రాసినవి కావు అన్నాడు ..ఒకసారి మద్రాస్ లో తెలుసుసినీ ప్రొద్యూసర్లు అందరూ సమావేశమై శ్రీహరి సమీక్షలపై విరుచుకు పడ్డారని ,రామోజీ తరపున కేస్ రామారావు వెళ్లి పాల్గొని గుడిపూడి ముక్కు సూటితనాన్ని తెలియ జెప్పారడని .చివరికి ”కనీసం సమీక్ష హెడ్డింగ్ అయినా సౌమ్యంగా పెట్టమని కోరారని ”కానీ తానూ వీటిని వేటినీ లెక్క చేయక తన ధోరణిలో తానూ రాసుకు పోయాయానని చెప్పాడు
పద్మశ్రీ పిక్చర్స్ అధినేత ,దర్శకుడు పి .పుల్లయ్య దగ్గర ఏదైనా సినిమాలో ప్రయత్నిద్దామని వెడితే ”ఇదిగో అయ్యోరూ !ఇక్కడ సెట్ మీన నానో టికి బ0డ బూతులొస్తాయి .అందరూ విని భరించి పనిచేస్తారు .నువ్వు బాగా సడదు కున్నోడివి నీకిది వద్దులే అబ్బాయా ”అన్నాడని చెప్పారు .రామోజీ అన్ని విషయాలు తనతో చర్చించేవాడాని ,గొప్ప ఆలోచనా పరుడని ,వాళ్ళ సినీపత్రిక ”సితార ”లో కూడా తానూ సినీ సమీక్షలు రాశానని చెప్పారు . వెంగళరావు దాకా అందరు ముఖ్యమంత్రులతో తనకు మంచిపరిచయం ,చొరవ ఉండేదని తమా టకు విలువ ఉండేదని ,ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ తనకు తెలియరని అన్నారు .మరో ముఖ్యవిషయం చెప్పారు ,.ఎన్టీ రామారావు గారు తానూ ఆ రోజు చేయబోయే సినిమాలో తన స్క్రిప్ట్ ను తెల్లవారు జాముననే భార్య బసవతారకం గారికి చదివి వినిపించేవాడని ఇది తానూ స్వయంగా చూసిన విషయమని గుడిపూడి చెప్పాడు . ఫిలిం సెన్సార్ బోర్డు లోనూ హరిపనిచేశాడు .
తనకు అన్నమయ్య సినిమా నచ్చలేదని అందులో ఎన్నో అసందర్భాలున్నాయని తానూ సమీక్షలో రాశానని అన్నాడు . ఒక అభిమాన జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చూసిన ఆనందం కలిగింది .మిగిలిన విషయాలు పార్టీ -2 లో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-16-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—