బ్లండరే బ్లండర్ -2
అయిన్ స్టెయిన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం అంతకు ముందున్న గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని దాటి చాలా ముందుకు దూసుకు వెళ్ళింది .న్యూటన్ ఆలోచనా పరిధిని దాటి సాధారణ సాపేక్ష సిద్ధాంతం, ఇతర ద్రవ్యరాశి లేక శక్తి క్షేత్ర గురుత్వాకర్షణ అంతరిక్ష కాల స్థానిక వక్రత ద్రవ్యరాశి కి సమాధానమై నిలిచింది ..ఇంకొంచెం అర్ధమయ్యేట్లు చెప్పాలంటే -ద్రవ్యరాశి కేంద్రీకరణ వక్రీకరణ కు దారి తీసి అంతరిక్ష- కాల నేత (ఫాబ్రిక్ )లో సొట్టలు -డింపుల్స్ ఏర్పడుతాయి .ఈ వక్రీకరణలు కదిలే ద్రవ్యరాశులకు మార్గ దర్శనం చేసి సరళ రేఖా మార్గ ”జియో డెసిక్స్ ”కు అంటే వక్రత ఉన్న పథం అంటే కక్ష్యలుగా మారుస్తాయి .ఇక్కడ జియో డేసిక్స్ అంటే విస్తరించిన వక్రతాతలంపై రెండు బిందువులమధ్య ఉన్న అతి తక్కువ దూరం .ఇది నాలుగు తరాల స్పేస్ -టైం నేతలో ఉన్న రెండు బిందువులమధ్య ఉన్న కనిష్ట దూరం గా అర్ధం చేసుకోవాలి . .దీనిపై అమెరికా దేశ దీరిటికల్ ఫిజిసిస్ట్ జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ ”పదార్ధం స్పేస్ కు ఎలా వంగాలోచెబితే స్పెస్ ద్రవ్యరాశి ,ఎలా కదలాలో చెబుతుందన్నమాట ”అని వివరించాడు .
సాధారణ సాపేక్ష సిద్ధాంతం రెండురకాల గురుత్వాకర్షణలను చెప్పింది .ఒకటి మనందరకు తెలిసిందే -భూమ్యాకర్షణ శక్తి .రెండవది స్పేస్ -టైం కల్పించే రహస్యమైన (మిస్టీరియస్ ) యాంటీ గ్రావిటీ ప్రెజర్ .ఐన్స్టీన్ కానీ ఇతర సైన్టిస్ట్ లు కానీ గట్టిగా నమ్మిన లాంబ్డా అనేది పూర్తి యదార్ధమే ..విశ్వం యొక్క మార్పు లేని స్థితి అంటే అస్థిర చలనం లేని విశ్వమే .కానీ ఒక భౌతిక వస్తువు అస్థిర స్థితిలో ఉండటం శాస్త్ర పద్ధతిని (క్రెడో ) ను ఉల్లంఘించటమే అవుతుంది . ఒక్క విశ్వం విషయం లోనే విశ్వమంతా ఎప్పటికప్పుడు సమతుల్యంలో ఉంటుందని ప్రత్యేకించి చెప్పలేం ..ఇంతకు ముందుశాస్త్ర చరిత్రలో యెవరూ చూడని కొలవని కనీసం ఊహించని కొత్త విషయం ఇది .ఇదే ఇప్పుడు ఉదాహరణ గా దృష్టాంతంగా మారి పోయి సవాలు విసిరింది ..
13 ఏళ్ళ తర్వాత 1929 లో అమెరికన్ ఆస్ట్రో ఫిజిస్ట్ ఎడ్విన్ . పి . హబుల్ విశ్వం స్థిరంగా(స్టాటిక్ ) లేదని కనిపెట్టాడు. దీనికి తగిన సాక్ష్యా ధారాలు చూపించాడు ..గెలాక్షీ దూరమైన కొద్దీ ,అది వేగవంతంగా మిల్కీ వే(పాలపుంత ) నుంచి వెనక్కి తగ్గుతుంది (రిసీడ్స్ ) .మరోరకంగా చెప్పాలంటే విశ్వం వ్యాకోచిస్తోంది అన్నమాట ..మరిప్పుడు కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ కలిగించిన ఇబ్బంది వలన ప్రకృతి శక్తులలో అప్పటివరకు కని పెట్టబడనిదేదీ విశ్వ విస్తరణను ఆపగలిగేది లేదని అర్ధమై మహా మేధావి అయిన్ స్టీన్ తన ”లాంబ్డా ”ను పూర్తిగా తొలగించేసి ”నా జీవితం లో చేసిన అతి గొప్ప బ్లండర్ ఇది ”అని లెంపలు వాయించుకొన్నాడు. తాను చెప్పిన సమీకరణం లో మార్పు చేసి లాంబ్డా విలువ సున్నా -జీరో గా భావించాడు .ఉదాహరణకు a= b +c అనేది అన్ని విషయాలలోనూ సరిపోతుంది కానీ c కి సున్నా విలువ ఉంటె మాత్రం అందులో c ఉండాల్సిన అవసరం లేదని ఏమాత్రం లెక్కలొచ్చినవాడికైనా తెలుసు అదే అయిన్ స్టీన్ చేసింది. అందుకే కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ కు జీరో విలువ ఇచ్చాడు . తాను పూర్తిగా పొరబాటు పడ్డానని తాను చేసింది బ్లండర్ అని పశ్చాస్తాపపడ్డాడు ఆ మేధావి శాస్త్ర వేత్త . ఇది ఇంతటితో ఆగిపోతే ,కథ కంచికి పొతే ఆయన గొప్పతనం ఏముంది ?
ఆతర్వాత దశాబ్దాల కాలాల లో సైన్టిస్ట్ లు ఐన్స్టీన్ పాతర వేసి గోరీ కట్టిన లాంబ్డా ను బయటికి తీయి కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ ఉంటె తమ భావాలు ఎలా ఉంటాయి అని ఆలోచించటం ప్రారంభించారు . 69 ఏళ్లతర్వాత 1998 లో సైన్స్ లాంబ్డాను చివరి సారిగా త్రవ్వి తీసి బయట పెట్టింది ఆ ఏడాది ప్రారంభం లో మూడు ఆస్ట్రో ఫిజిస్ట్ ల బృందాలు ఒకటి కాలి ఫోర్నియాలోని బెర్కిలీ లో ఉండే బెర్కిలీ నేషనల్ లేబొరేటరీ లోని సాల్ పెరల్ మట్టర్ ,మరొకటి ఆస్ట్రేలియాకలో కాన్ బెర్రా కు చెందిన మౌంట్ స్ట్రోమ్లో అండ్ స్దడింగ్ స్ప్రింగ్స్ అబ్జార్వేటరీకి చెందిన బ్రియాన్ స్కిమిడ్స్ మేరీ లాండ్ లోని బాల్టిమోర్ జాన్ హాప్కిన్స్ యుని వర్సిటీ కి చెందిన ఆడం రైసెస్ బృందాలు డజన్ల కొద్దీ సూ పర్ నోవాలను భావించినదానికంటే తక్కువ కాంతితో అంటే డిమ్ గా ఉన్నట్లు గుర్తించారు . నక్షత్ర విస్ఫోటనాలు చూశారు .ఈ సూపర్ నోవాలు తమ సమీప సోదర నోవాలకంటే భిన్నంగా ప్రవర్తించి పదిహేను శాతం ఎక్కువ దూరం లో ఉన్నట్లు గమనించారు .ఈ సహజ స్థితికి ముఖ్యకారణం ఐన్ స్టీన్ చెప్పిన లాంబ్డా అంటే కాశ్మలాజికల్ కాన్ స్టెంట్ మాత్రమే కారణం అని అర్ధం చేసుకొన్నారు .ఇప్పుడు సైన్టిస్ట్ లే లెంపలేసుకొని దుమ్ము కొట్టుకు పోయిన ఆ మేధావి చెప్పిన లాంబ్డా కు జీవ ప్రతిష్ఠ చేసి అయిన్ స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్ష సమీకరణం లో ఉంచి ఆ సమీకరణం అన్నిటికీ సమాధాన0 చెప్పింది అని నిరూపించారు . కథ ఇంతటితోనూ ఆగలేదు .ఇంకా ముందుకు జరిగింది ఆ విషయాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D