బ్లండరే బ్లండర్ -3
పెల్మట్టర్ ,స్కి మిడిస్ట్ శాస్త్ర వేత్త ల సూపర్ నోవాలు న్యూక్లియై ఫ్యూజన్ లో విలువైనవి .. కొన్ని హద్దులలో ఆ నక్షత్రాల విస్ఫోటనం ఒకే మాదిరిగా ఉంది .అంతే శక్తి జనకాలను వినియోగించుకొని ,,అంతే టైటానిక్ ఎనర్జీ ని ,అదే సమయం లో విడుదల చేసి అంతే తీవ్ర ప్రకాశనం పొందాయి .. కనుక ఇవివిస్ఫోటనం చెంది దూరంగా వెళ్ళిపోయిన గెలాక్సిల కాస్మిక్ దూరాలను కొలవటానికి కొలబద్దలుగాలేక స్టాండర్డ్ కాండిల్స్ గా ఉపయోగ పడ్డాయి .సూపర్ నోవా అన్నిటిలో ఒకేరకమైన వాట్తెజి ఉండి తక్కువ కాంతికలవి దూరం గా ఎక్కువ కాంతికలవి దగ్గరగా ఉంటాయి .వాటి కాంతిని గణన చేస్తే అవి మనకు యెంత దూరం లో ఉన్నాయో ఒకదానికొకటి యెంత దూరం లో ఉన్నాయో ఖచ్చితం గా చెప్పచ్చు సూపర్ నో వాల ప్రకాశం *ల్యూమినాసిటి )వేర్వేరుగా ఉండట మ్ వలన ఇదొక్కటే దూరాలను కొలవటానికి కొలమానంగా తీసుకో కూడదు .
అంతాబాగానే ఉంది .గెలాక్సిల దూర గణనకు మరో విధానం ఉంది .అదే-మిల్కీ వే నుంచి వాటి తిరోగమనం లేక మాంద్యం (రిసెషన్ ).ఇదే కాస్మిక్ విస్తరణకు ప్రాతిపదిక .హుబుల్ శాస్త్ర వేత్త గమనించినదాన్ని బట్టి విస్తరిస్తున్న విశ్వం దూరపు వస్తువులు మన నుంచి దూరం జరిగే పందెం (రేస్ )లో దగ్గరున్న వాటికంటే వేగంగా జరిగిపోతాయి . కనుక ఒక గెలాక్షీ మాంద్య వేగాన్ని లెక్కించేటప్పుడు గెలాక్షీ దూరం కూడా కొలిచే వీలుంటుంది ..
ఈ రెండు ముఖ్య విధానాలలో ఒకే వస్తువు కు విభిన్న దూరాలు వస్తాయి కనుక ఇందులో ఏదో తప్పు ఉందని గమనించాలి .సూపర్ నోవాలు నిర్దుష్ట కాండిల్స్ కాకపోవచ్చు .లేక కాస్మిక్ విస్తరణ రేటు ను గెలాక్షీ వేగం ఆధారం గా కొలవటం తప్పు కావచ్చు . దీనిని బట్టి విశ్వం మనం ఊహించిన దానికంటే వేగంగా విస్తరించి గెలాక్సిలను వాటి మాంద్య వేగానికంటే దూరంగా వాటిని ఉంచింది అని తెలుస్తోంది .కనుక అదనపు విస్తరణ ను వ్యాఖ్యానించటానికి అయిన్ స్టీన్ చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ -లాంబ్డా ఉపయోగించకుండా చెప్పటం అసాధ్యం .
ఇక్కడే ఒక ప్రత్యక్ష సాక్షం దొరికింది మాంద్య శక్తి గురుత్వాకర్షణ ను ఎదిరించి సర్వ్తత్రా వ్యాపించి0ది (పేర్మియేట్ ) .అందుకే లాంబ్డా అవసరమైంది .ఇప్పుడు లాంబ్డా ఒక భౌతిక సత్యమైంది దీనికి ఒక పేరుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది .కనుక విశ్వ నాట్యం లో కృష్ణ శక్తి అంటే డార్క్ ఎనర్జీ ఒక ముఖ్య కేంద్ర పాత్ర పోషించింది .శాస్త్ర వేత్తలు పారల్ మట్టర్ ,స్కిమిడ్స్ ,రీస్ లు ముగ్గురూ 2011 నోబెల్ ప్రయిజ్ ”డార్క్ మాటర్ ”కనుగొన్నందుకు పొందారు.
డార్క్ ఎనర్జీ గణనానికి ఖచ్చితమైన లెక్క దొరికింది విశ్వం లో ఉన్న 68 శాతం మాస్ ఎనర్జీ లో డార్క్ మాటర్ (కృష్ణ పదార్ధం )27 శాతం ఉంటె సాధారణ పదార్ధం కేవలం 5 శాతం మాత్రమే ఉంది .మన నాలుగు తరాల (ఫోర్ డైమెన్షనల్ )విశ్వం -విశ్వం లోనిపదార్ధం శక్తి మొత్తానికి , విశ్వం విస్తరిస్తున్న వేగానికి ,సంబంధం కలిగి ఉంది దీని గణనకు ఒక చక్కని గుర్తు” ఒమీ గాఅనే గ్రీకు అక్షరాన్ని ” రూపొందించారు. విశ్వ పదార్ధ శక్తి సాంద్రత ను విశ్వ వ్యాప్తిని నిరోధించటానికి కావలసిన కనీస పదార్ధ శక్తి సాంద్రత(క్రిటికల్ డెన్సిటీ ) తో భాగిస్తే వచ్చే దే ” ఒమీగా ”
ద్రవ్యరాశి ,శక్తి స్పీడ్ టైంవక్రత (కర్ప్ ) కు కారణమైతే ఒమీగా విశ్వం యొక్క ఆకారాన్ని తెలియ జేస్తుంది .ఒమేగా విలువ 1 కంటే తక్కువైతే ద్రవ్యరాశి శక్తి క్రిటికల్ విలువకంటే తక్కువ గా ఉండి ,విశ్వం అనంతంగా అన్ని వైపులకు ,అన్నికాలాల్లో వ్యాప్తి చెంది ,ఒక గుర్రపు జీను ఆకారం పొంది ,అక్కడ సమాంతరరేఖలు వికేంద్రీకరణ చెందుతాయి ..ఒమీగా విలువ 1 అయితే విశ్వం నిరవధికంగా అరుదుగా వ్యాప్తి చెంది ,విశ్వం సమతలంగా మారి మనం సమాంతర రేఖల విషయం లో నార్చుకున్న జామెట్రీ సూత్రాలన్నీ రుజువౌతాయి . . ఒక వేళా ఒమీ గా విలువ 1 కంటే ఎక్కువైతే సమాంతర రేఖలు కేంద్రీకరింపబడి ,విశ్వం మళ్లీ తన పూర్వపు వక్రత పొంది ,ఏ అగ్ని గోళం నుండి తాను ఆవిర్భవిచిందో ,మళ్ళీ దానిలోకి పతనం (కొలాప్స్ )చెందుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D