బ్లండరే బ్లండర్-4(చివరిభాగం )
విశ్వ విస్తరణ గురించి హబుల్ తెలియజేశాక మరెవ్వరూ ఒమీగా విలువ 1 కి దగ్గరగా ఉండటం చూడలేదు . ఉన్న పరిశోధనా ఫలితాలలో వచ్చిన అత్యంత నిర్దుష్ట ఫలితం ఒమీగా విలువ 0. 3 కు అతి దగ్గరగా ఉంది . కనుక విశ్వం తెరచి అంటే ఓపెన్ గా ఉంది . 1979లో అమెరికా లో మాసా చుసెట్స్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ టెక్నలాజి ఫిజిసిస్ట్ అలాం హెచ్ గూత్ బృందం బిగ్ బాంగ్ ధీరీకి సవరణలు చేస్తూ సమస్యలను అధిగమిస్తూ విశ్వం లో పదార్ధం ,శక్తి మనకున్నట్లుగానే సజావుగా ఉన్నట్లు గ్రహించారు దీనివలన ఒమీగా విలువ 1 కి దగ్గరాగా చేర్చబడింది కానీ అరకు కానీ 2 కు దగ్గరగాకాని లేక అంతకంటే పెద్ద సంఖ్య కు కానీ చేర్చలేదు . 1దగ్గరకు మాత్రమే చేర్చింది . ఈ తర్జన భర్జనలు తర్వాత దృశ్యమాన పదార్ధం క్రిటికల్ డెన్సిటీకి 5 శాతం కంటే ఎక్కువ లేదు అని స్పష్టమైంది ..మరి డార్క్ మాటర్ మిస్టరీ ఏమిటి ?.ఎవరికీ అదేమిటో తెలియదు కానీ మొత్తం(టోటల్ ) లో మాత్రం దాని పాత్ర ఉంది దీనితర్వాత తేలిందేమిటంటే మనకు కనిపించే పదార్దానికి అయిదారు రెట్లు డార్క్ మాటర్ ఉంది .మళ్ళీ గందరగోళం అయినా ఓ లుక్కేసి ఉండాలి అన్నారు ధీరిస్ట్ లు .రెండు శిబిరాలవారుడార్క్ ఎనర్జీ కనిపెట్టబడే దాకా అవతలివారిదే తప్పు అనుకొంటున్నారు అన్నారుకూడా .ఈ ఒకే ఒక భాగం (కాంపోనెంట్ )ను సాధారణ పదార్దానికి సాధారణ ఎనర్జీ కి కలిపితే విశ్వం యొక్క మాస్ ఎనర్జీ డెన్సిటీ క్రిటికల్ లెవెల్ దాకా పెరిగి0ది . ఇది పరిశీలకులకు ధీరీస్ట్ లకు సంతృప్తి నిచ్చింది . ఇద్దరూ కరెక్ట్ అనుకోని అభినందించుకున్నారు . ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎన్ని కూడికలు చేసినా దేన్నీ కలిపినా అంతతరిక్షం లో అంతకంటే పదార్ధం ఏదీ అదనంగా లేదని తేల్చారు
ఈ డార్క్ ఎనర్జీ అనేది క్వాంటం ప్రభావం కావచ్చు అంతరిక్ష శూన్యం ఒత్తి శూన్యంకాక కొన్ని కణాలు ,వాటి వ్యతిరేక కణాల సముదాయం .అవి నిరంతరం జతలుగా కలిసి విడిపోతూంటాయి కనుక వాటిని కొలిచే వీలు లేదు సూక్ష్మ విషయాలను చెప్పే క్వాంటం ఫిజిక్స్ దీన్ని తీవ్రంగానే అధ్యయనం చేయాలని భావించింది .వాస్తవిక కణాలు అంటే వర్చువల్ పార్టికల్స్ జంటలు కొంత అతితక్కువ బయటి పీడనాన్ని కలిగించి మళ్ళీ అంతరిక్షం లోకి దూరిపోతాయి . దురదృష్ట వశాత్తు రిపల్సివ్ వాక్యూమ్ ప్రెజర్ మొత్తం 10 టు ది పవర్ ఆఫ్ 20 రెట్లు ప్రయోగశాలలో గుర్తించిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ కంటే ఎక్కువ .ఇది దిమ్మతిరిగే ఫలితం కనుక మళ్లీ అనుమానం
దీనిపై కీ లక సమాధానం ఏదీ కనిపించలేదు . అంతమాత్రాన నిరాశ కలగలేదు డార్క్ ఎనర్జీ ఒక చిన్న ముందడుగు . దీన్ని అయిన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంత సమీకరణాలకు అను స0ధించాలి .అంటే ఆయన చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ లాంబ్డా మాత్రమే ఇప్పుడు శరణ్యమైంది . అంతరిక్షం లో గతం లో వర్తమానం లో భవిషత్తులో యెంత డార్క్ ఎనర్జీ వచ్చినా ,దాన్ని కొలవటానికి ,లెక్కించటానికి దాని ప్రభావం తెలుసుకోవటానికి అవకాశం దీనివలననేఅంటే లాంబ్డా వలననే లభించింది
కనుక నిస్సంకోచంగా మహా మేధావి చెప్పిన కాస్మ లాజికల్ కాన్ స్టెంట్ అంటే లాంబ్డా యే దిక్కైంది పాపం ఆయన దీన్ని తన బ్లండర్ అని లెంపలేసుకొన్నాడు .కానీ ఆయన చెప్పిందే నూటికి వెయ్యిశాతం కరెక్ట్ .కనుక అప్పటి బ్లండరే ఇప్పుడు బ్లండర్ అయింది .అందరికి ఊపిరి తీసుకొనే అవకాశాన్నిచ్చింది .దార్శనికుడు అయిన్ స్టీన్ మేధస్సు బహు చురుకైనది అని మళ్ళీ రుజువైంది . ఏతావాతా తేలిందేమిటి అంటే డార్క్ ఎనర్జీ అనేది విశ్వ0 లో మూల లక్షణమైన ఆస్తి అన్నమాట.
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-17-కాంప్-షార్లెట్-అమెరికా
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D