భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2
భూమి క్రస్ట్ లో 10 శాతం అల్యూమిన0 ఉంది .కానీ మన పూర్వీకులకు దాని గురించి తెలియదు . 1827 లో దాన్ని కనిపెట్టేదాకామనకు తెలియదు ,1960 దాకా అది మన ఇళ్లల్లోకి ప్రవేశించలేదు .అప్పటిదాకా టిన్ కాన్స్ ,టిన్ ఫాయిల్స్ వాడేవారు . ఇందులో అల్యూమినం ఉంటుంది మెరుగు పెట్టబడిన అల్యూమినం రిఫ్లెక్టర్ గా బాగా ఉపయోగపడుతుంది .ఇప్పుడు అన్ని టెలిస్కోప్ మిర్రర్ లకు దాన్ని కోటింగ్ కు వాడుతున్నారు . అల్యూమినమ్ కంటే 1. 7 రెట్లు సాంద్రత ఉన్న టైటానియం దానికంటే శక్తివంతమైనది భూ గర్భం లో ఎక్కువగా దొరికే తొమ్మిదవ మూలకం ..దీన్ని వాడటం గొప్ప ఫాషనయింది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లలో విరివిగా వాడుతున్నారు ..విశ్వం లో కార్బన్ కంటే ఆక్సిజన్ పరమాణువులు ఎక్కువ .కార్బన్ తోకలిసి కార్బన్ మోనాక్సయిడ్ కార్బన్ డయాక్సయిడ్ లను ఏర్పరచి ,మిగిలిన ఆక్సికన్ టైటానియం తో బంధాలు ఏర్పాటు చేసుకొంటుంది .రెడ్ స్టార్స్ ల స్పెక్ట్రమ్ లో టైటానియం ఆక్సయిడ్ కనిపిస్తుంది మనం వాడే నీలం, కెంపు లలో టైటానియం ఆక్సయిడ్ ఉంది .టెలిస్కోప్ డోములకు వేసే వైట్ పెయింట్ లో టైటానిక్ ఆక్సయిడ్ ఉంటుంది స్పెక్ట్రమ్ లోని ఇంఫ్రాఅర్ద్ భాగం లో ఎక్కువ పరావర్తనం చెందేది గా కనిపిస్తుంది .టెలిస్కోప్ చుట్టూ ఉండే సూర్యకాంతిని తగ్గించటానికి ఉపయోగపడుతుంది .రాత్రి వేళలో టెలిస్కోప్ డోమ్ తెరచి ఉంటె టెలిస్కోప్ దగ్గరున్న గాలి ఉష్ణోగ్రత ,రాత్రి గాలి ఉష్ణోగ్రతకు సమానమై ,నక్షత్రాలనుండి ,ఇతర గ్రహాంతర పదార్ధాలనుండి వచ్చే కాంతి స్పష్టంగా కనిపిస్తుంది . గ్రీక్ పురాణం లోని టైటాన్ అంటే శని గ్రహ0 చుట్టూ ఉండే పెద్ద చంద్రుడి పేరే ఆమూలకానికి వచ్చింది ..
విశ్వం లో ఇనుముకున్న గిరాకీ ఎక్కువే .పెద్ద నక్షత్రాలు తమ కొర్ లో హీలియం కార్బన్ ,ఆక్సిజన్ నైట్రోజెన్ మొదలైన వాటితోపాటు ఇనుము మూలకాన్నీ ఉత్పత్తి చేస్తాయి .న్యూక్లియస్ లో 26 ప్రోటాన్లు అన్నే న్యూట్రాన్లు కేంద్రం లో కలిగిఉన్న ఐరన్ ఎలిమెంట్ మిగిలినవాటికంటే ఒక విభిన్నమైన లక్షణం-ఏ న్యూక్లియర్ అణువు శక్తి మొత్తం కంటే కనిష్ట శక్తి మొత్తం కలిగి ఉంటుంది .దీని భావం ఏమిటంటే -ఐరన్ పరమాణువును ఫుజన్ ద్వారా కలిపితే అవికూడా శక్తిని పీల్చేస్తాయి (అబ్సార్బ్ )..కానీ నక్షత్రాలు శక్తి నిర్మాణ0 చేస్తాయి .బృహత్తర తారలు ఇనుమును ఉత్పత్తి చేసికోర్ లో కూడబెడితే వాటి చావు మూడిందన్నమాట . అధిక భారం వలన నక్షత్రం తనబరువుకు తానె కూలిపోతుంది .కానీ వెంటనే పుంజుకొని సూపర్ నోవా విస్ఫోట నానికి గురై ఒక బిలియన్ సూర్యుల కాంతితో ఒకవారం దివ్య జ్యోతిలా వెలుగుతుంది .
తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత కల’’ గాలియం ‘’మూలకం ఆస్ట్రో ఫిజిస్ట్ లకు ఎందుకో రుచించలేదు కానీ సూర్యుని నుంచి న్యూట్రియాన్ లు గుర్తించే గాలియం క్లోరైడ్ బాగా ఉపయోగపడింది ..భూగర్భం లో చాలా ఎక్కువ మొత్తం లో లిక్విడ్ గాలియం క్లోరైడ్ ఉంది న్యూట్రియన్లు ,గాలియం న్యూక్లియస్ లు ఢీకొని ‘’జెర్మేనియం ‘’ను ఏర్పరుస్తాయి ..దీనివలన ఎక్స్ రే కాంతి మినుకు మంటుంది .
టెక్నీషియ0 మూలకం రేడియో యాక్టివ్ ధర్మం కలది .ఇది భూమిమీద ఎక్కడా లభించదు .కావాలంటే పార్టికల్ ఆక్సిలరేటర్ లనుండి పొందవచ్చు .గ్రీకు మాట టెక్నీటోస్ అంటే కృత్రిమమైనది అనే అర్ధం తో దీనికి టెక్నీషియ0 అని పేరుపెట్టారు . ఇది రెడ్ స్టార్స్ ప్రాంతం లో ఎక్కడో కొద్దిగా ఉందని గమనించారు .దీని హాఫ్ లైఫ్ టైం కేవలం 2 మిలియన్ల సంవత్సరాలు .ఇది ఉన్న నక్షత్ర జీవితకాలం కంటే తక్కువ .మరోమాటగా చెప్పాలంటే ఇది లేకుండా ఏ నక్షత్రం పుట్టలేదు ,ఒక వేళా పుట్టివుంటే ఈపాటికి గిట్టి ఉండేది ..నక్షత్ర కొర్ నుంచి దీన్ని సంపాదించే సాధనం కనిపెట్టబడలేదు .
ఆస్మియం ప్లాటినం ఇరీడియం మూలకాలు అతిభార మూలకాలు .ఇందులో ఇరీడియం చాలా ఎక్కువ ఉపయోగం లో ఉంది ఫాన్ ల తయారీలో స్మోకింగ్ గన్ తయారీలో ఎక్కువ వాడకం లో ఉంది ..65 మిలియన్ సంవత్సరాలక్రిందటి జియాలాజికల్ స్ట్రాటలోని క్రెటీషియస్ పాలజియన్ ప్రాంతం లో పలుచనిపొరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది .భూమిపై ఇరీడియం తక్కువగానే ఉన్నా ,ఆరుమైళ్ళ మెటాలిక్ ఆస్టెరాయిడ్స్ లో ఉండి ,భూమిని తాకి ఆవిరై ,దాని పరమాణువులను భూమిపై అక్కడక్కడా వెదజల్లింది ..ఈ సమయం లోనేభూమిపై ఉన్న డైనోజార్లు అంతరించిపోయాయి .అందుకే దీన్ని డైనోజార్ కిల్లర్ ఆస్టెరాయిడ్ అంటారు ..దీని ఎత్తు ఎవరెస్టు శిఖరం అంత.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా