భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )
మొదటి హైడ్రోజెన్ బాంబ్ పరీక్షదక్షిణ ఫసిఫిక్ లోఎనీవేటోక్ లో 1-11-1952లో జరిగినప్పుడు ఆల్బర్ట్ శాస్త్రవేత్త అక్కడి శిధిలాలను పరిశీలిస్తుంటే ఒక కొత్తమూలకం ను కనుక్కొని దానికి ‘’అయిన్ స్టీనియమ్ ‘’అని పేరుపెట్టారు ..ఫాస్ఫరస్ కు కాంతిమంట ఉండటం తో ఆ గ్రీక్ పేరు సార్ధకమైంది .ఇది వీనస్ గ్రహం అంటే శుక్రగ్రహానికి అనాదిగా ఉన్న పేరే .ఆ గ్రహం సూర్యోదయానికి ముందు ఆకాశం లో కనిపిస్తుంది . సెలీనియం మూలకం పేరు సెలెనా అనే గ్రీకు పదం నుండి వచ్చింది . గ్రీకు ల చంద్రునిపేరు సెలెనా ..దీనిఖనిజాలలో ఇది’’ టే ల్ల్యురియం ‘’అనే మరో మూలకం తో కలిసి లభిస్తుంది .లాటిన్ లో టెల్లస్ అంటే భూమి అని అర్ధం .
1-1-1801 న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ గిసెప్పె పియాజ్జి సూర్యుని చుట్టూ కుజ ,,గురు గ్రహాలమధ్య తిరుగుతున్న కొత్త గ్రహాన్ని కనిపెట్టి రోమన్ల సస్య దేవత ‘’సెరేస్ పేరుపెట్టారు ..సిరియల్ మూలం నుండి వచ్చిందే సేరేస్..ఈ సంఘటన తర్వాత కనిపెట్టబడిన మొదటి మూలకానికి ఈ ఉత్సాహం లో ‘’సెరియం ‘అని గౌరవంగా ఆ దేవత పేరే పెట్టారు ..రెండేళ్ల తర్వాత సూర్యుని చుట్టూ సె రెస్ లాగే తిరిగే మరో గ్రహాన్నికనిపెట్టి విఙ్నానానికి అధిదేవత అయిన రోమన్ దేవత ‘’పొల్లాస్ ‘’పేరుమీదుగా పిలిచి దీనితర్వాత కనుగొనబడిన మూలకానికి ‘’పల్లాడియం ‘’అని పిలిచారు ..ఆతర్వాత ఇలాంటివే అనేక బుల్లి బుల్లి గ్రహాలూకనిపెట్టారు .చివరికి తేలిందేమిటంటే సెరె స్ పొల్లాస్ లు గ్రహాలుకావు ఆస్టెరాయిడ్స్ అని ..ఇలాంటివన్నీ వందల వేల సంఖ్యలో ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఉన్నాయని గ్రహించారు .
పాదరసం అంటే మెర్క్యురీ ద్రవ మూలకం పేరు గ్రహాలలో అత్యధిక వేగం గా తిరిగే మెర్క్యురీ అంటే బుధ గ్రాహం పేరుతో పిలిచారు .ఇది కూడా రోమన్ వార్తాహరుడైన దేవత పేరే .
ధోరియం మూలకాన్ని గురుగ్రహం నుంచి మెరుపులు చిమ్మే స్కాండినేవియన్ మెరుపు దేవతపేరుతొ పిలిచారు.హబుల్ టెలిస్కోప్ జూపిటర్ యొక్క పోలార్ ప్రాంతం లో లెక్కలేనన్ని ఎలెక్ట్రిక్ చార్జెస్ ఉన్నట్లు గమనించింది . పాపం శనిదేవత పేర ఒక్క మూలకమూ లేదు .కానీ యురేనస్ ,నెప్ట్యూన్ ప్లూటో గ్రహాలపేర 1789 లో కనిపెట్టబడిన యురేనియం కు పెట్టారు యురేనియం ఐసోటోప్ లన్నీ అస్ధిరాలు .అవి యాదృచ్చికంగా (స్పాంటేనియస్ )శిధిలమై తేలిక మూలకాలుగా ఏర్పడతాయి .మొదటి పరమాణు బాంబులో యురేనియం నే ఉపయోగించి జపాన్ పట్టణాలైన హీరోషిమా ,నాగసాకిలపై అమెరికా6-8-1945 న ప్రయోగించింది .న్యూక్లియస్ లో 92 ప్రొటాన్లున్న యురేనియం ప్రకృతిలో విరివిగా లభించే రేడియో యాక్టివ్ మూలకం
నెప్ట్యూన్ పేరిట1940 లోబెర్కెలీ సైక్లో ట్రాన్ లో కనిపెట్టబడిన నెప్త్యూనియం మూలకం పిలువబడింది .జోసెఫ్ లీ వెర్రియర్ అనే ఫ్రెంచ్ గణిత వేత్త యురేనస్ వింత ప్రవృత్తిని అధ్యయనం చేస్తూ నెప్ట్యూన్ ను గుర్తించాడు .సౌర వ్యవస్థ (సోలార్ సిస్టమ్ )లో యురేనస్ తర్వాతే నెప్ట్యూన్ ఉంటుంది .భూమిపై పీరియాడిక్ టేబుల్ లో కూడా యురేనియం తర్వాత స్థానమే నెప్ట్యూనియం ది .
బెర్కిలీ సైక్లో ట్రాన్ చాలా మూలకాలను కనుక్కున్నది అందులో ప్లుటోనియం మూలకం నెప్త్యూనియం తర్వాత వస్తుంది . 1930 లో ఆరిజోనాలోని లోవెల్ అబ్సరేటరీ క్లైడ్ టామ్ బాగ్ ప్లూటో గ్రహాన్ని కనుక్కున్నాడు .దీనిపేరు ప్లుటోనియం కు పెట్టారు .ప్లూటో సైజ్ ను నిర్దుష్టంగా కొలవగలిగారు .ప్లూటో క్రమక్రమంగా తగ్గిపోతోంది .చల్లగా మంచుతో ఉండే ప్లూటో నవగ్రహాలలో అతి చిన్నది .ఇలా మూలకాలకూ ,అంతరిక్ష గ్రహాలకు సన్నిహిత సంబంధం ఉందని తెలుస్తోంది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-17 కాంప్-షార్లెట్-అమెరికా