గుగ్గురు దర్శనం -2
లాసా లో ఒక లామాను కలిసి తాను ఆధ్యాత్మిక మార్గదర్శనానికి టిబెట్ వచ్చానని ,తనకు రాజకీయ ఉద్దేశ్యాలేవీ లేవని , చెప్పి నమ్మక0 కలిగించి ఆయనవద్ద 15 రోజులు గడిపాడురామా .ప్రభుత్వ ఉద్యోగులకు స్వామిరామాను పరిచయం చేస్తే , వ చ్చీరానీ టిబెటన్ భాషలో వారికి నచ్చ చెప్పగలిగాడు .ఈ లామా స్నేహితుడైన మరోలామా ఆశ్రమం గుగ్గురువు ఆశ్రమానికి సమీపం లోనే ఉన్నదని చెప్పిలాసాకు ఈశాన్యం లో 75 మైళ్ళ దూరం నాగరికతకు చాలా దూరం లో ఉన్నఅక్కడికి కొందరు గైడ్ లను తోడు ఇచ్చి పంపాడు .అక్కడినుంచి గుగ్గురువును తేలికగా చేరుకోవచ్చు .
ఆ ఆశ్రమంలో 300 కు పైగా లామాలున్నారు . టిబెట్ లో చాలా మొనాస్టరీస్ ఉన్నాయి .. వీటిలో వేలాది లామాలు వివిధ సంప్రదాయాలకు చెందినవారున్నారు . లామాయిజం అంటే బౌద్ధం లో వ్యక్తిగతమైనమతం అనిపించిందిరామా కు . ప్రతిలామా తనదైన ప్రత్యేక తరహాలో ఉత్సవాలు పూజా ధ్యానాదులు మంత్రోచ్చారణ ,ప్రార్ధనా చక్రాన్ని త్రిప్పటం నిర్వహిస్తాడు .నలందాలోని ప్రాచీన బౌద్ధ విశ్వ విద్యాలయంలో స్వామి రామా ఈ తంతు అంతా చూశాడు .బౌద్ధాన్ని క్షుణ్ణంగా ఇదివరకే చదివి ఉన్నాడు ..వెయ్యేళ్ళక్రితం టిబెటన్ విద్యావేత్త ఇండియా వచ్చి బౌద్ధాన్ని అధ్యయనం చేసి ఇక్కడి బౌద్ధ మత గ్రంధాలను టిబెట్ కు తీసుకు వెళ్లాడు అప్పటి నుంచి ఇండియానుంచి బౌద్ధపండితులు టిబెట్ వెళ్ళటం ప్రారంభి0చి అక్కడివారికి బౌద్ధ సాహిత్యాన్ని నేర్పారు .టిబెట్ లో బౌద్ధం లో ఉన్న అనేక శాఖలు స్వామి రామాకు తెలుసు ..వారిలో దేవుళ్ళు దేవతలను నమ్మేవారు బుద్ధుడు దేవుడని భావించేవారు ఉన్నారని గ్రహించాడు.
టిబెట్ బౌద్ధం తంత్రం తో ముడిపెట్టబడి ఉంటుంది .గుగ్గురువును కలవటానికి ముందు ఒక చిన్న లామా ఆశ్రమం చూశాడు. అక్కడిలామా టిబెట్ లోనే ప్రసిద్ధి చెందినలామా అని పేరు టిబెట్లోని యోగ విధానం కొంతమారిన తంత్రశాస్త్ర0.దీనినే ‘’వామాచారం ‘’అంటారు ..ఈ మార్గం లోవారు మధిర మాంసం,చేప , మగువ మంత్రా లను నమ్ముతారు .రామా వెళ్లిన ఆశ్రమ లామా ఒక చెక్క గదిలో అనేకమందిమంత్రాలు చదివే స్త్రీల మధ్య కూర్చుని కనిపించాడు .కొన్ని మంత్రాలు చదివాక వారంతా అక్కడ ఉన్న పచ్చి మాంసపు ముక్కలను కొన్ని సుగంధద్రవ్యాలు పచ్చిమిర్చి కలిపి తిని మళ్ళీ మంత్రాలు చదివారు . 15 నిమిషాల తర్వాత ఆ లామా రామాను చూసి పలకరించి వచ్చినపని అడిగాడు .ఈ లామాను చూడటానికే వచ్చానన్నాడు. ’’ అది అబద్ధం నీపేరు స్వామిరామా నువ్వు నీ గురువుగారి గురువును చూడటానికి మారు వేషం లో వచ్చావు .సిక్కిం పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ‘’అని చాలాకోపంగా తీవ్రం గా అన్నాడు బహుశా మగువలమధ్య మాంసం తింటుండగా చూశాడని ‘’ఎక్కడో ‘’కాలి అలా అని ఉంటాడని గ్రహించాడు రామా ..ఈయన ఆలోచనలన్నీ ఆయన పసిగట్టేశాడు .రామా వణికిపోయాడు .తమాయించుకొని టిబెట్లో కొంత తంత్ర విద్య నేర్వాలని వచ్చానని వినయంగా చెప్పాడు .చల్లబడిన లామా తనవద్ద ఉన్న ఒక తంత్ర పుస్తకాన్నిచ్చాడు దాన్ని తిరగేసినరామా అది ఇదివరకే తాను చదివేసిందే నని చెప్పగా మరొక తాంత్రిక లామా వద్దకు పంపాడు .ఈలామాకు బుద్ధగయ లో ఉండిచదవటం వలన హిందీ బాగా వచ్చు .
టిబెట్ సారస్వతం అంతా హిందూపురాణ అనువాదాలు కొన్నిటిలో టావోయిజం బౌద్ధం కన్ఫ్యూషియన్ మతం కలిసికనిపిస్తాయి .వ్యవస్తీకృతంగా సృజనాత్మకంగా ఏదీ లేదు .రామాకున్న టిబెటన్ భాషా పాండిత్యం తక్కువేకాని ఈలామా హిందీలో మాట్లాడటం వలన ఇబ్బందికలుగలేదు .జనసామాన్యం తోమాట్లాడే టిబెటన్ మాటలు బాగానే వచ్చినాఅనేక మొనాస్టరీలలో భద్రపరచబడిన వ్రాత ప్రతులలోని సారస్వతాన్ని చదివేంతగా రాదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—