ఒకరోజు స్వామీ రామా ను గురువు బెంగాలీ బాబా టిబెట్ లో ఉన్న తన గురువు వద్ద కొంతకాలం ఉండి రమ్మని పంపాడు . గుగ్గురువు ను చూసి అనుభూతి పొందాలనే ఆత్రత తో రామా 1931లో బయల్దేరాడు .మానస పాస్ దగ్గర ఆపేశారు మళ్ళీ 1946 లో టిబెట్ రాజధాని లాసా కు డార్జిలింగ్ కాళీపాంగ్ సిక్కిం ల ద్వారా వెళ్ళాడు .ముఖ్యోద్దేశం గుగ్గురు దర్శనమే .అక్కడ కొంత అడ్వాంస్డ్ ప్రాక్టీస్ పొందటమే ..డార్జిలింగ్ లో కొన్నిరోజులుండి ఉపన్యాసాలిచ్చాడు .బ్రిటిష్ ఆఫీసర్లు రామాను విప్లవావాది గా ఇండియాలోని బ్రిటిష్ ప్రభుత్వానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడనిభావించారు కాలిఫాన్గ్ కు వెళ్లి పదిరోజులుండి ‘’కుంగ్ ఫు ‘’నేర్చాడు .అక్కడి నుంచి సిక్కిం కు వెళ్ళాడు .అంతాకాలినడకనే అని మర్చిపోకండి .సిక్కిం లో దలైలామా దగ్గర బంధువు ఇంట్లో అతిధిగా ఉన్నాడు .సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ రామా టిబెట్ లో శాంతికి విఘాతం కలిగిస్తాడేమోనని భయపడి ముందుకు పోవటానికి అనుమతించలేదు చాలా రోజులు ఆ ఆఫీసర్ తో తన గోడు చెప్పుకొన్నాడు ..కానీ రామా కాంగ్రెస్ పార్టీ గూఢచారి అని అనుకోని ,అప్పుడాపార్టీ బ్రిటిష్ ప్రభుత్వం తో స్వాతంత్య్రం కోసం తీవ్రం గా పోరాడుతున్నందున అనుమతి నిరాకరించాడు . అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతివాద మితవాదులుండేవారు . గాంధీ ఆయన అనుచరులు మితవాదులు .మిగిలినవారు అతివాదులు ..రామా ఈ రెండు గ్రూపుల వారితో సంబంధం ఏదీ లేదు .రామదగ్గర నెహ్రు రాసిన ,గాంధీరాసిన ఉత్తరాలను చూశాడు ఆఫీసర్ .అనుమానం మరింతబలీయమై రామానుప్రభుత్వ ఇన్స్పెక్షన్ బంగళా లో హౌస్ అరెస్ట్ లో ఉంచాడు..అన్ని సౌకర్యాలు కలిగించారు కానీ రెండు నెలలు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది .ఎవరితోమాట్లాడటానికి ఎవరికీ ఉత్తరం రాయటానికి వీ లు లేదు . .ఒకరోజు ఆఫీసర్ ‘’నువ్వేమీ చేయలేదని నాకు తెలుసు ,కానీ నిన్ను రాజకీయ గూఢచారిగా అనుమానిస్తున్నాను .నాకు నీపై మంచి రిపోర్ట్ వచ్చేదాకా ఇక్కడినుంచి కదలటానికి వీల్లేదు ‘’అన్నాడు .ఒకగార్డ్ ఇరవైనాలుగు గంటల కాపలాఉన్నాడు .ఈ కాలం లోనే రామ టిబెటన్ భాష అధ్యయనం చేసి నేర్చుకొని వాళ్ళతో మాట్లాడే వీలు కలిపించుకొన్నాడు . .
రెండు నెలలు హౌస్ అరెస్ట్ లో ఉన్నా ఎంతమందికి మొరపెట్టుకున్నా లాభం లేకపోయే సరికి రహస్యంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు స్వామిరామా ..ఒక గార్డ్ ను మచ్చిక చేసుకొని పొడవైన తలా ముఖం పైకూడా కప్పుకొనే టిబెటన్ కోటు సంపాదించాడు .ఒక చలిరాత్రి గార్డ్ ఫుల్ గా మందుకొట్టి నిద్రపోతున్నసమయం లో రాత్రి 11 గంటలకు జులై 15 ఆకోటు తొడుక్కునితాను ఢిల్లీ వె డుతున్నట్లు ఒక ఉత్తరం రాసి టేబుల్ మీద ఉంచి చీకట్లో ఉడాయించాడు ..ఇదేమీ తప్పనిపించలేదు అంటాడురామ కారణం తనను అనవసరంగా ఏ కారణం లేకుండా నిర్బంధించటం న్యాయం కాదుకాబట్టి .మూడు రోజులు నడిచి చివరి చెక్ పోస్ట్ కు చేరాడు .అక్కడ సిక్కిం గూర్ఖా సైనికులు పహారా కాస్తున్నారు .రామాను ప్రశ్నించి ఆయన గురించి అడిగి తెలుసుకొన్నారు .తనకు నేపాలీ భాష వచ్చుకనుక ధారాళంగా ఆభాషలో మాట్లాడి ,వాళ్లకు తాను నేపాలీ అనే అభిప్రాయం కలిగించటం తో వాళ్ళు సరిహద్దు దాటి టిబెట్ లోకి వెళ్ళటానికి అనుమతించారు. గండం గడిచి పిండం బయట పడింది .
టిబెట్ లో మరిన్ని ఇక్కట్లు పడ్డాడు ..తానూ శాకాహారి .అక్కడ మాంసం తప్ప తినటానికి ఏమీ దొరకదు .టిబెట్ లో ఒక్క శాకాహారికూడా ఆయనకు కనిపించలేదు .టిబెట్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండటం ఎప్పుడూ మంచు కురవటం తో అక్కడ జనం మాంసం చేపలు తింటేనే బతకగల పరిస్థితి .ఎక్కడో ఒకటీఆరా కాయగూరలు దొరికితే తినేవాడురామా . గుడ్లు కూడా తినాల్సి వచ్చేది .ఆహార మార్పువలన డయేరియాతో బాధపడ్డాడు .ఆరోగ్యం క్షీణించింది .కానీ ఇక్కడ కొన్ని సన్యాసా శ్రమాలు గుహలు దర్శించి తాను వచ్చినపని నెరవేర్చుకొందామనుకొన్నాడు .
రాత్రి వేళపడుకునేసమయం లో ప్రజలు రామా దగ్గరున్న వస్తువులను దొంగిలించటానికి తనిఖీ చేసేవారు . కానీ ఆయనదగ్గర కొన్ని పౌండ్ల బిస్కట్లు కొద్దిగా పప్పు ,నీళ్ల సీసా 2 వేల రూపాయలు మాత్రమే ఉండేవి .డబ్బును లోపలి దుస్తులలో జాగ్రత్తగా దాచేవాడు .కాళ్లబూట్లు ఎప్పుడూ ఎవరి ముందూ విప్పేవాడుకాదు . రోజుకు 15 మైళ్ళు నడిచి లేకపోతె కంచరగాడిదపై ప్రయాణించేవాడు .తటస్థ పడిన మనుషులతోమనసుకు నచ్చక పోయినా జ్యోతిషం ,జోస్యం చెబుతూ గడిపేవాడు . టిబెటన్లకు వీటిపై మహా గురి ..కనుక ఈయనపై నమ్మక గౌరవాలేర్పడి ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్ళటానికి మ్యూల్స్ ను ఏర్పాటు చేసేవారు .దారిలో చాలాసార్లు అడవి ఎలుగు బంట్లు తారస పడేవి .టిబెటన్ గ్రామాలను కాపలాకాసే పెద్ద పెద్ద భూతియా కుక్కలు కనిపించేవి .ఈ సమస్యలు బాధిస్తున్నా రామాకు ప్రయాణం ఉత్సాహాన్ని ఇచ్చింది .హిమాలయ యోగుల మహత్యాలు తెలుసుకోవాలనే ఆరాటం పెరిగిందేకాని తగ్గలేదు ..వెనక్కి తిరిగి ఇండియాకు వెడితే బ్రిటిష్ ప్రభుత్వం తనను తప్పక అరెస్ట్ చేసి జైలు లో పెడుతుంది .కనుక పీచే మూడ్ కుదరదు ఆగే మూడ్ మాత్రమే తప్పనిసరి అనుకున్నాడు .
ఎవరి సాయం గైడ్లు లేకుండా ఏ ప్రణాళికా లేకుండా హిమ పర్వత వాహినులు , హిమానీ నదాలు కనుమలు దాటుకొంటూ ముందుకు వెళ్ళాడు దైవమే తనకు రక్షా ఏడుగడ ..దారితప్పేవాడు దైవమె మళ్ళీ మార్గం చూపేవాడు .పగటి వేళా భయం అసలు ఉండేదే కాదు చావుభయం అసలే లేదు .తన గుగ్గురువు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకున్నాడు .ఆయన వద్ద కొంతకాలం తన గురువు చెప్పినట్లు ఉండాలన్నదే తపన .ఆయన ఇక్కడ ఒంటరి ప్రదేశం కనుక ఉన్నాడు . యోగా లో ఆధునిక పురోగమన పద్ధతులు నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారికి నేర్పుతున్నాడు .హిమాలయ కుమయూన్ హిల్ యోగులైన హరికృష్ణ బాబా మొదలైన వారు ఆయనంటే విపరీతమైన ఆరాధన కలిగిఉన్నారని ఈయనను హిమాలయ శాశ్వత (ఎటర్నల్ )యోగి అని అందరూ భావిస్తారని తన గుగ్గురువు దగ్గరే యోగ శిక్షణ పొందాడని తన గురువు బెంగాలీ బాబా ద్వారా రామా తెలుసుకొన్నాడు .ఈ కోరికే రామాను ఇంతదూరం తెప్పించింది .
విపరీతంమైన ప్రయాణం రెండునెలలు చేసి రామా లాసా చేరాడు అక్కడ ఒక కేథలిక్ ప్రీస్ట్ కలిశాడు .ఆయన తన చిన్న నివాసం లో రామాను ఉంచాడు .ఈఇద్దరుకాక మరో ఇద్దరు మిషనరీలు అందులో ఉన్నారు .ఈ ముగ్గురే లాసా లో ఉన్న కేథలిక్కులు .వీరికదలికలను టిబెటన్ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుంది .అలసట తీరే దాకా వారితో పది రోజులున్నాడు .ఈలోగా సిక్కిం పొలిటికల్ ఆఫీసర్ కు రామా టిబెట్ లో ఉన్నట్లు తెలిసింది .రామా కేసును సి ఐ డి కి అప్పగించాడు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—