గుగ్గురు దర్శనం -3
స్వామి రామా విడిది చేసిన ఆశ్రమం లో సంస్కృత వ్రాత ప్రతి లామాలచేత పూజింపబడుతోంది .గట్టి గుడ్డ కవర్ తో ఉన్న ఆ ప్రతి గంధం తో దుమ్ముకొట్టుకు పోయింది .ఆ ప్రతిని చదివినవాడికి వెంటనే కుష్ఠురోగం వచ్చి చస్తాడని వాళ్ళ నమ్మకం లామాలు చాలామంది వచ్చి దాన్ని పూజిస్తారుకాని ఎవరూ తెరిచి చదివిన దాఖలా కనిపించలేదు .రామాకు దాన్ని చదవాలనే కోరిక బలీయమైంది .దాన్ని కనీసం చూపించటానికి కూడా ఎంతబ్రతిమిలాడినా అల్లామా ససేమిరా అన్నాడు .అప్పుడు రామాకు ‘’గ్రంధాలు వాటిని చదివే వారికే కానీ అందులో ఏముందో తెలుసుకోకుండా పూజించేవారికి కాదు ‘’అన్న పెద్దలమాట జ్ఞాపకమొచ్చింది .తెల్లవారుజామున 3 గంటలకు ఆశ్రమాన్నికి వెళ్లి ,ఆసిల్కు గుడ్డ లో చుట్టబడి ఉన్న ఆ గ్రంధం ఉన్న గదిలో చేరి దాన్ని తెరచి అక్కడిదీపపు వెలుగు లో దాన్ని చదువుతుంటే అది ‘’లింగ పురాణం ‘’అని అర్ధమై ,అందులో వేలాది శ్లోకాలలో ఆధ్యాత్మిక కథలు విధానాలు ,పద్ధతులు పురాతన భారతీయ వేద సాహిత్యాధారంగా రచింపబడిందని గ్రహించాడు . కంగారులో లోపలి కి చేరటం దీపాలు చెదరటం మళ్ళీ మూట సరిగ్గా కట్టలేక పోవటం వలన దాన్ని ఎవరో తప్పక తెరచి చదివి ఉంటారని అనుకొంటారు .స్వామి రామా పై అనుమానమొచ్చింది .లామా పిలిపించి గద్దించాడు .అప్పుడు రామా తెలివిగా ‘’హిమాలయ యోగులు నన్ను దీన్ని చదివి రమ్మని పంపారు .మీరు నన్నేమైనా అంటే నాకేమీ కాదు మీరే ఇబ్బందిపడతారు ‘’అన్నాడు హిందీలో ..ఇక ఏమీ మాట్లాడ లేక ఈ లామా ,లామాల పెద్దా విషయాన్ని అక్కడితో వదిలేశారు లేకపోతె స్వామి రామాను పిచ్చ కొట్టుడు కొట్టి ఉండేవాళ్ళు . దీనితో వాళ్లందరికీ బుద్ధ గయ నుండి ఒక గొప్ప పండితుడైన లామా వచ్చాడని మహా తెలివిగలవాడని మహా మంత్ర తంత్ర వేత్త అని రామా గురించి ప్రచారం చేశారు రామాతో వెంటవచ్చిన టిబెటన్ గైడ్ లు రామాను ఇక ఇక్కడినుంచి వెళ్ళిపోవటం మంచిదని చెప్పారు . ఇక్కడిలామాల గుడ్డినమ్మకానికి నవ్వుకున్నాడు రామా
ఫలించిన గుగ్గురు దర్శనం
ఎట్టకేలకు గుగ్గురు దర్శనం చేశాడు స్వామిరామా .రామాను చూడగానే ఆనందం తో ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నాయనా !చాలా దూరం నుంచి వచ్చావు .ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నావు అలసినట్లున్నావు . విజ్ఞాన రహదారి చాలా కష్టమైనది విజ్ఞానం గ్ర హించటమూ కష్టతర మైనదే ‘’అంటూ రామా ప్రయాణం లో సర్వ విషయాలు తన కళ్ళతో చూసినట్లు రామాకే వర్ణించి చెబుతుంటే స్వామి రామా అవాక్కయ్యా డు ..దూరం కష్టప్రయాణం లో తపం ధ్యానం అన్నీ ఉట్టికెక్కాయనిపించింది .స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తే అలానే చేశాడు .మార్గాయాసం శ్రమ ఇబ్బందులు గురువుగురువు గారి ఆత్మీయ ఆలింగనం తో మాయమైపోయాయి తన గురువు బెంగాలీ బాబా ఎలాతనపై కారుణ్యం చూపించేవాడో ఈయనా అలానే అపార కారుణ్య వర్షం కురిపించాడు .గొప్ప యోగులు తమ శిష్యులను చూస్తే వారిపై అనంత అనుకంప వాత్సల్యం ప్రేమ కలుగుతాయి .
రామాగురువు ఈ టిబెట్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .బాల్యం లోనే ఇల్లువదిలి హిమాలయాల్లో పాద చారిగా సంచరించి ,అనేక గురువులవద్ద అన్నీ నేర్చాడు .ఇప్పుడు చాలా ముసలివాడుగా ఉన్నాడు .కానీ ఆరోగ్యంనే ఉన్నాడు .కూర్చున్న చోటు నుంచి ఉదయం ఒకసారి ,,సాయంత్రం ఒకసారిమాత్రమే లేస్తాడు . ఐదడుగుల పది అంగుళా ల ఎత్తు ,సన్నగా శలాకలాగా మాంచి శక్తి సంపన్నం గా ఉన్నాడు .దట్టమైన కనుబొమలు ,ముఖం లో చెరగని ప్రశాంతత ,వెలుగు ,కళ్ళల్లో కాంతి చెదరిని చిరునవ్వు తో ఆకర్షణీయంగా ఉన్నాడు …ఆయన ఆహారం ‘’యాక్ పాలు ‘’..ఒక్కోసారి సూప్ .అప్పుడప్పుడు కొందరులామాలు వచ్చి ఈయనవద్ద చదువుకొంటారు ..7 వేల అడుగుల ఎత్తున ఉన్న స్వాభావికమైన చిన్నగుహలో ఉంటాడు .నిప్పు రాజేసి లోపలి చీకటిని పోగొడతాడు .దానితోపాలు నీళ్లు కాస్తాడు . గుహముందు కర్రలతో పోర్టికో ను శిష్యులు నిర్మించారు .ఈ గుహ నుంచి చూస్తే అద్భుతమైన ఎత్తైన పర్వత శ్రేణి ,శిఖరాలు అందమైన దిక్చక్రమ్ కనుల విందు చేస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-17-కాంప్-షార్లెట్-అమెరికా