చచ్చి బతికి బోధించి దేహత్యాగం చేసిన యోగి
మహిమాన్విత యోగులు హిమాలయాలలోనే ఉంటారనే భ్రమలో ఉండేవాడు స్వామిరామా . కానీ ఒకనది ఒడ్డున పట్టణానికి దగ్గరలో ఒక యోగిఅనుభవం ఆయన్ను అప్రతిభుడిని చేసింది . ఆయన్ను చూడాలని బయల్దేరాడు . .ఇంకా అయన ఆశ్రయానికి నాలుగు మైళ్ళ దూరం లో ఉండగానే ఆయన రామాకు శిష్యులతో ఆహారం పంపాడు ..ఎవరైనా వస్తుంటే తానూ ఇలాగె చేస్తానుకదా ఇందులో వింతయేమున్నది అని పించింది . ఆశ్రమానికి వెళ్ళగానే ఆయన ‘’నాయనా !నువ్వు ఆలస్యంగా వచ్చావు .రేపు ఉదయం నేను శరీర త్యాగం చేయబోతున్నాను’’ .అన్నాడు రామా ఆదుర్దాగా ‘’స్వామీ తమరు మరొక పూట ఉండి నాకు జ్ఞాన బోధ చేయలేరా ?’’అన్నాడు వినయంగా .’’లేదు కుదరదు.సమయం లేదు ‘’అన్నాడు నిర్మొహమాటంగా .
అక్కడ ఆయనవద్ద అనేక మార్గాలపై విశ్వాసం వున్న శిష్యులున్నారు . హిందువులకు ఆయన స్వామి .ముస్లిం లకు ఇస్లా0 ముల్లా క్రిస్టియన్లకు యేసు అనుయాయి ..ఆయన చనిపోగానే ఆయన శరీరాన్ని క్రిస్టియన్ సెమిటేరికి తీసుకు వెళ్లాలని క్రైస్తవులు ,ముస్లిం లు మసీదుకు ,హిందువులు ఆయన్ను అక్కడే సమాధిచేసి ఒక స్మారక చిహ్నం కట్టాలని తీవ్రంగా భావిస్తున్నారు ..
మర్నాడు ఉదయం ఆయన ముందే చెప్పినట్లు దేహ త్యాగం చేసేశాడు .డాక్టర్ వచ్చి ఆయన చనిపోయాడని నిర్ధారించాడు .తర్వాత కొన్ని గంటలు శిష్యులమధ్య తర్జన భర్జనలు గందర గోళం ..అన్నిమతాలవారు ఆ పార్థివ శరీరం తమకే దక్కాలని పోట్లాడుకొంటున్నారు సమస్య జఠిలమై పోయింది . పరిష్కారం లభించటం లేదు . జిల్లా మాజిస్ట్రేట్ వచ్చాడు .స్వామి రామాతో ‘’మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఈ యోగి ఏ మతానికి చెందిన వాడో చెప్పండి ‘’అని అడిగాడు ..రామా ఆయనతో ‘’నాకేమీ తెలియదు ‘’అన్నాడు .మనసులో ‘’ఇదేమిటి ఈ యోగి చనిపోతూ భలే ఫిట్టింగ్ పెట్టాడే .నాకు ఈయనేం బోధ చేస్తాడు .నిజంగా మహా యోగి అయివుంటే ఇలాంటి సమస్యను సృష్టించేవాడు కాదుకదా ‘’అని మనసులో రామా వితర్కించుకొన్నాడు ..
ఆ యోగి ప్రాణం విడిచి అప్పటికి నాలుగు గంటలయింది ..అప్పుడు అకస్మాత్తుగా ఆయన లేచి ‘’ఒరే మూర్ఖుల్లారా !మీరు నా దేహం కోసం కొట్టుకు చస్తున్నారు కనుక నేను చావ దలచుకోలేదు ‘’అన్నాడు అక్కడున్న మేజిస్ట్రేట్ ,జనమూ ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయారు ..ఆయోగి అక్కడి మూడుమతాల శిష్యులతో ‘’తెలివితక్కువ సన్నాసుల్లారా! నా కళ్ళ ముందు నుంచి మీరు తక్షణం వెళ్లిపోండి .నాకు కనిపిస్తే సహించను .నేను దేవునికి తప్ప ఎవరికీ చెందిన వాడినికాను .పొండి వెళ్లి పోండి ‘’అని గద్దించాడు . స్వామి రామాను దగ్గరకు పిలిచి ‘’నాయనా !కంగారు పడకు .నేను ఇక్కడే మూడు రోజులు ఉండి నీకు కావలసింది అంతా బోధిస్తాను .నాల్గవ రోజు శరీర త్యాగం చేస్తాను ‘’అని చెప్పాడు ..
స్వామిరామా ఆయోగివద్ద మూడు రోజులు ఉండి ఆత్మజ్ఞానం బోధనవలన సంతుష్టుడయ్యాడు .రామా జీవితం లో ఈ మూడు రోజులు చిరస్మరణీయమైనవని భావించాడు .ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం బోధించాడు .ప్రతి రోజు ఆయన నోటి నుంచి ‘’నువ్వు యదార్ధంగా ఎవరివో అది అవ్వాలి నువ్వు .నువ్వు కానిదానికోసం నటించవద్దు ‘’ఈ మహా వాక్యాన్ని రోజూ అనేక సార్లు ఉచ్ఛరించేవాడు ఆ యోగి పుంగవుడు ..మూడు రోజులు అయ్యాక ఆయన రామా తో ‘’నేను జల సమాధి ఆవాలను కొంటున్నాను ‘’అని చెప్పి నదికి నడిచి వెళ్లి అందులో అదృశ్యమయ్యాడు .జనం తర్వాత వచ్చి అడిగితె ఆయన నదిలో మునిగిపోయాడు మళ్ళీ కనిపించలేదు అని చెప్పాడు . వాళ్లంతా ఆ నదిని అంగుళం అంగుళం గాలించి వెతికారు . కానీ ఆయన దేహం వాళ్లకు దొరకలేదు .మహర్షులు మహాయోగులు ఏదో ఒక మతానికి చెందినవారు కాదు .ఈ అడ్డుగోడలకు అతీతంగా ఉండేవారు .వారు సర్వమానవాళికి చెందినవారు .. మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా