గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
381- సంస్కృత ఋగ్వేద ప్రధమాష్టక భాష్య కర్త మహోన్నత వేద పండితుడు -కపాలి శాస్త్రి (1886-1953)
టి వి కపాలి శాస్త్రి తమిళనాడులోని మద్రాస్ లో మైలాపూర్ లో 1886 లో తంత్ర శాస్త్ర బ్రాహ్మణా కుటుంబం లో జన్మించాడు .తల్లి ఉగ్గుపాల తోనే సకల శాస్త్ర వేద సారం గ్రహించాడు
12 వ ఏటనే సంస్కృత రామాయణాన్ని 12 సార్లు చదివేశాడు .అప్పటికే శ్రీ విద్యోపాసకుడై లలితా త్రిపుర సుందరి పరమ భక్తుడయ్యాడు . 1907లోఒక దేవాలయం లోమొదటి గురువు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని దర్శనం కలిగి ,శిష్యుడై నాలుగేళ్లు ఆయన వద్ద విద్య నేర్చి ,ఆయనతో రెండవ గురువు రమణ మహర్షిని సందర్శించి శిష్యుడయ్యాడు ..మహర్షి సందర్శనమే లేకుంటే నేను అరవిందుల దర్శనం చేసుకొనే వాడిని కాదు ‘’అన్నాడు శాస్త్రి .మూడవ గురువు అరవిందులు . 1914 లో అరవిందాశ్రమ పత్రిక ‘’ఆర్య ‘’ను చదివిన శాస్త్రి అరవిందులను దర్శించాలని కోరికకలిగి పాండి చేరి వెళ్లి 1917 లో మొదటి సారి దర్శించి సంస్కృత శ్లోకాలతో స్తుతించాడు . .అరవిందులు శాస్త్రిని ‘’సంస్కృతం కాక వేరే భాష వచ్చునా ‘’?అని అడిగాడు . 1923 లో మళ్ళీ ఒకసారి దర్శించి ఆయన బంగారు ఛాయను చూసి అప్రతి భుడయ్యాడు శాస్త్రి . మాతారవిందులకోరికపై చేస్తున్న సంస్కృత ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి ఆశ్రమంలో చేరి 1953 ఆగస్టు 15 అరవిందుని జన్మదినం నాడు చనిపోయే వరకు 15-8-1953 అక్కడే ఉన్నాడు . అంతరాత్మ ప్రబోధించినప్పుడు మాత్రమే ఏదైనా రాసేవాడు .
టి వి కపాలి శాస్త్రి అంటే 20 వ శతాబ్దపు అరుదైన వేద వేత్త మహా సంస్కృత విద్వా0సుడు అని యీ కాలం వారికి పెద్దగా తెలియదు .ఋగ్వేద విషయం లో కపాలి అపర పరమేశ్వరుడే అని అరవిందులే అన్నారు .అరవిందుల ప్రఖ్యాత ఆంగ్ల కవిత ‘’హు ‘’ను కపాలి శాస్త్రి సంస్కృతం లోకి అనువదించాడు.ఇదీ ఆ కవిత లో మొదటిపాదం – In the blue of the sky, in the green of the forWhose is the Hand that has painted the glow?.
శాస్త్రిని జ్ఞానాంబునిథి అన్నాడు ఆయన శిష్యుడు చిన్మయి .అరవిందాశ్రమ మదర్ గురించి శాస్త్రి ఆంగ్లం లో ‘’ఫ్లేమ్ ఆ ప్ ది వైట్ లైట్ ‘’అనే అపూర్వ గ్రంధం రాశాడు దీనిని శాస్త్రి కోరికపై చిన్మయి బెంగాలీ భాషలోకి ‘’సదా జ్యోతి శిఖా ‘’గా అనువదించాడు . 1997లో సాక్షి ట్రస్ట్ వారు ‘’అరవింద కపాలి శాస్త్రి ఇన్ స్టి ట్యూట్ ఆ ప్ వేదిక్ కల్చర్ ‘’స్థాపించి వేద ,,అరవిందుల సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేశారు
. జీవితకాలమంతా రమణ మహర్షి ,అరవింద యోగి ల వేదాంతతత్వాన్ని వ్యాపింప జేయటానికే కృషి చేశాడు శాస్త్రి .ఉపాధ్యాయుడుగా అనువాదకునిగా ,విశ్లేషకునిగా ,వ్యాస రచయితగా కవిగా ,తంత్ర శాస్త్ర వేత్తగా శాస్త్రి లబ్ధ ప్రతిష్టుడు .అరవిందులవద్ద సాధన చేస్తున్నా ,శాస్త్రి రమణమహర్షి పై ఆరాధనా భావం వదలలేదు.ఏ క్షేత్రం లో పనిచేసినా శాస్త్రి దాని లోతులు తరిచాడు .ప్రాచీన భావధారకు అధునాతన విధానానికి గొప్ప సేతువు కపాలి శాస్త్రి .వేదాలలోని మహత్తర భావాలను అంతర్ దృష్టి యోగసాధనలతో వెలికి దీసి లోకానికి అందించిన పూర్ణ పురుషుడు శాస్త్రి.ఋగ్వేద ప్రధమ అస్టకానికి కపాలి శాస్త్రి సంస్కృతం లో రచించిన వ్యాఖ్యానం’’ఋగ్భాష్య భూమిక ‘’ అనితర సాధ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది .సాయనా చార్యుల కర్మ సిద్ధాంతానికి అతీతంగా రాసిన వ్యాఖ్య ఇది . ఇది ఆంగ్లం లోనూ వెలువడింది అందుకనే 20 వశతాబ్దపు అత్యుత్తమ సంస్కృత వేద వేత్తగా కపాలి శాస్త్రిని గౌరవిస్తారు .వేదం లోని స్వర్ణమయ కాంతులను దర్శించి ,లోకానికి ఆదర్శన భాగ్యాన్ని ప్రసాదించినవాడు శాస్త్రి .వేద ,తంత్ర ,ఉపనిషత్తుల విజ్ఞాన బాండాగారాన్ని తెరచి ఆ దివ్య నిధిని లోకానికి అందించినఅనితర సాధ్య సాధకుడు శాస్త్రి .ఆయన మంత్రాలతో దేవతలను ఆహ్వానిస్తుంటే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ ప్రత్యక్షమయ్యేవారు దేవతలు .ఉపనిషత్తులు ఆత్మావిద్యా సాధనకు కరదీపికలు అని అరవిందులు భావించినట్లే శాస్త్రీ జీ కూడా భావించాడు
24 సంవత్సరాలు పాండిచ్చేరిలో శ్రీ మాతారవిందుల అంతేవాసిగా ఉండి అరవిందుల పూర్ణయోగ సాధనలో పండిపోయి దాన్ని గొప్పగా ప్రచారం చేశాడు శాస్త్రి .శాస్త్రి రాసిన గ్రంధాల వివరాలు-
సంస్కృత గ్రంధాలు-1ఋగ్వేద భాష్య -సిద్ధాంజన -ఋగ్ భాష్య భూమిక 2-ఋగ్వేద సంహిత -మొదటి అష్టకం -సంస్కృతం లో పదం అర్ధం భాష్యం వివరణ 3-వాసిష్టమునిరాసైనా -ఉమాసహస్ర కావ్యం -ఆయన జీవిత చరిత్ర వాసిష్ఠ వైభవం అనే కాపాలి శాస్త్రి రచన 4-సంస్కృత మంత్రాలు శ్లోకాలు -వ్యాఖ్యానం అనువాదం 5-షట్ దర్శన భాష్యం ,రమణగీతప్రకాశం ,సావిత్రి 6-కొన్ని తెలుగు సంస్కృత రచనలు .
ఆంగ్లం లో -లైట్స్ ఆన్ ది వేదాస్ , ఉపనిషత్స్ ,లైట్స్ ఆన్ టీచింగ్స్ వేదిక్ సిక్రెట్స్ ఇన్ కాంపాక్ట్ ఫార్మ్ ,ఫర్దర్ లైట్స్ ఆన్ ది వేదాస్ ,ది మహర్షి మొదలైనవి
కపాల శాస్త్రి పేరు 1953లో ఆయన చనిపోయిన తర్వాత లోకానికి బాగా తెలిసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
