గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3
389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )
సంస్కృత కన్నడ వ్యాకరణా ల లోతులు తెరచిన యెన్ రంగనాధ శర్మ 7-1-1916న కర్ణాటకలో నాడహళ్లి లో జన్మించాడు .బెంగుళూరు చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో 1948 నుండి 1976 వరకు నాలుగు దశాబ్దాలు సంస్కృత కన్నడాలు బోధించాడు .ప్రముఖరచయితాజి వి గుండప్పకు సహాధ్యాయి .సంస్కృతం లో బాహుబలి విజయం ,ఏక చక్రం ,అనే చారిత్రిక ,పౌరాణిక నాటకాలు ,గురు పరే మిత చరితం ,గోమఠేశ్వర సుప్రభాతం ,గుమ్మటేశ పంచకం రాశాడు .కన్నడం లో చాలా విస్తృత రచనలు చేశాడు ఎన్నో అనువాదాలు రచించాడు
కర్ణాటక రాష్ట్ర బహుమతి రాష్ట్రపతి ప్రశంసాపత్రం ,రాజ్యోత్సవ పురస్కారం ఉత్తమ అధ్యాపక అవార్డు ,మొట్టమొదటి డి వి జి మెడల్ ,మహామహోపాధ్యాయ ,గౌరవ డాక్టరేట్ ,సంస్కృత గ్రంథ రచన పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నాడు . 25-1-2014 న 98 ఏళ్ళ నిండువయసులో రంగనాధ శర్మ శ్రీరంగ ధామం చేరాడు .
390-మహాయాన బౌద్ధ ప్రజ్ఞా పారమిత్ర గ్రంథం (క్రీపూ 100 )
మహాయాన బౌద్ధ ఉద్గ్రంధం ప్రజ్ఞా పారమిత్ర అంటే సర్వతోముఖ జ్ఞానం పొందే సాధన మార్గం .ఇందులో బోధిసత్వుని మాతృ దేవతగా భావించారు .ఇది మహాయానం లోని మూల సిద్ధాంతం .ఇందులోని సూత్రాలు అనుత్పాద మైనవి గా విశ్వసిస్తారు .ఒకరకం గా అపౌరుషేయాలు .ఇందులో 8 వేల సూత్రాలున్నాయి .వీటిని ‘’అష్ట సాహస్రిక ప్రజ్ఞా పార మిత్ర సూత్రాలు ‘’అంటారు .. ఇవన్నీ క్రీపూ ఒకటవ శతాబ్ది కి చెందినవి అని పరిశోధకుడు ఎడ్వర్డ్ కాంజ్ రాశాడు . ఇందులోని సంస్కృతం నిర్దుష్టమైనది కాదని భావిస్తారు .. వీటి చైనీ అనువాదం క్రీశ 2 వ శతాబ్దిలో లభించాయి .ఇవే రత్న గుణ సముచ్ఛయగా పిలువబడుతున్నాయి . మహాయానం లోని భాగమైన ‘’చాటిక ‘’లవారు అభి వృద్ధి చేశారని అనుకొంటారు .ఇవన్నీ ఆంద్ర దేశం లో కృష్ణా నదీ తీరాన అమరావతీ ధాన్యకటకం మహాయాన సంఘాలలో ఏర్పడినవిగా ఊహిస్తారు .వీటిలోని శాఖలను పూర్వశైల ,అపర శైల అంటారు .వీటిలో ఒక్కొక్కవ్రాత ప్రతి ప్రాకృత భాషలో ఉన్నాయి. వీటిలో బుద్ధుని బోధలున్నాయని హుయాన్ సాంగ్ ధృవీకరించాడు . 2012 లో హ్యారీపాక్ ,శేషి కరసీమ లు శిధిలమైన దీని వ్రాతప్రతిని ముద్రించారు .రేడియోకార్బన్ డేటా ప్రకారం ఇది క్రీశ . 75 కు చెందినదిగా గుర్తించారు .బౌద్ధ గ్రంధాలలో అతిప్రాచీనమైనదిగా దీన్ని భావిస్తున్నారు .చైనా భాషలోకి అనువదించిన లోకేశేన- గాంధారీ భాష వ్రాతప్రతిని ఆధారంగా చేసుకొని చేశాడు .జపాన్ భౌద్ధులుమాత్రం దీనికంటే ‘’వజ్రచ్చేదిక’’ప్రాచీనమైనది అంటారు .చివరికి దీనికి వజ్రచేదికా ప్రజ్ఞా పారమిత్ర అని పిలుస్తున్నారు .దీనికి ఆచార్య నాగార్జునుడు ,మైత్రేయ అసంగ ,వసుభద్ర దిఙ్నాగాదులు వ్యాఖ్యానాలు రాశారు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా