గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిలో ప్రతి రోజు తెల్లవారుఝామున స్వామిని మేల్కొల్పటానికి ఆలపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సుప్రభాతాలలో తలమానిక మైనది .దీన్ని రాసే అదృష్ట0 పొందినవాడు ప్రతి వాది భయంకర శ్రీ అనంతాచార్య .ఈయననే అన్నాచార్య అంటారు .ఇదిక్రీశ. 1430 లో రాయబడిందిగా భావిస్తారు .అనంతాచార్య శ్రీ మనవాల మాముని స్వామి శిష్యుడు . మనవాల స్వామి శ్రీరంగం లో శ్రీరంగ నాధ సుప్రభాతం రాసిన శ్రీ వైష్ణవ మహా భక్త శిఖామణి .
శ్రీ వేం కటేశ్వర సుప్రభాతం లో నాలుగు భాగాలుంటాయి -1- శ్రీ వేంకటేశ సుప్రభాతం -29 శ్లోకాలు 2-శ్రీ శ్రీ వేంకటేశ స్తోత్రం -10 శ్లోకాలు -3- ప్రపత్తి-16 శ్లోకాలు 4-మంగళాశాసనం .-14 శ్లోకాలు సుప్రభాతం లో మొదటి శ్లోకం వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం లోని విశ్వామిత్ర మహర్షి శ్రీ రాముని నిద్ర మేల్కొల్పుతూ చెప్పిన ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’శ్లోకం తో ప్రారంభమవుతుంది . అనంతా చార్యులు నిత్యం అర్చించిన శ్రీ లక్ష్మీ నారాయణ ,శ్రీ భూదేవీ సమే త పద్మనాభ స్వామి విగ్రహాలతోపాటు 12 దివ్య సాలగ్రామ శిలలు ప్రస్తుతం ఆయనకు 15 వ తరం వారైన ప్రతివాది భయంకర రాఘవాచార్యులవారి వద్ద ఉన్నాయి .ఇప్పటికీ అవి ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దివ్య సాలగ్రామ క్షేత్రం లో నిత్యం పూజలందుకొనటం గొప్ప విశేషం .
1-సుప్రభాతం .
1-కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే -ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం .
24-ఇత్ధమ్ వృషాచలపతే రిహసుప్రభాతం – ఏ మానవాః ప్రతిదినం పఠితుమ్ ప్రవృత్తాహ్
తేషామ్ ప్రభాత సమయే స్మ్రుతి రంగ భాజాం -ప్రజ్ఞాన్ పరార్ధ సులభ0 పరమాం ప్రసూతే . 2- స్తోత్రం
1-కమలాకుచ చూచుక కుంకుమతో -నియతారణ తాతుల నీల తనో
కమలాయత లోచన లోకపతే – విజయీభవ వేంకట శైలపతే .
10-అజ్ఞానినా మయాదోషా న శేషాన్నిహితాన్ హరే -క్షమస్వత్వం క్షమస్వత్వం శేష శైల శిఖా మనే .
3-ప్రపత్తి
1- ఈశాన్యాం జగతోస్య వేంకట పతే ర్విష్ణో పరాం ప్రేయసీ0-తద్వక్షస్థల నిత్య వాస రసికాం తత్ క్షాన్తి సంవర్ధినీం
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనే స్థితం -వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీమ్ వన్డే జగన్మాతరం .
4-మంగళాశాసనం
1-శ్రియహ్ కాంతాయ నిధయే నిధయేర్థినాం -శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం .
14-మంగళా శాసన పరై ర్ మదాచార్య పురోగమైహ్ – సర్వైశ్చ పూర్వై రాచార్యైహ్ సత్కృతాయాస్తు మంగళం .
యాభై అరవై ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకం లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు . నోటికిరాని వారు ఉండేవారుకాదు .శ్రీమతి ఏం ఎస్ సుబ్బలక్ష్మి తన అమరాగాణంతో దానికి మరింత వైభవం తెచ్చింది . ఆమె సుప్రభాతం వినకపోతే శ్రీ వేంకటేశ్వరుడు నిద్ర లేచేవాడుకాదు అన్నంతగా ప్రచారమైంది
392- యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని (1370-1450 )
తమిళనాడు ఆళ్వార్ తిరుమంఝీరిలో 1370 లో మనవాల మాముని జన్మించాడు .అసలుపేరుఅళగియమనవాల పెరుమాళ్ నాయనారు .అంటే శ్రీ రంగనాధస్వామిలాగా ఉన్న అందమైన పెళ్లి కొడుకు అని అర్ధం .. తండ్రి తిరునైదయ అన్నారు .తల్లి శ్రీరంగ నాచ్చియార్.తండ్రీ ,మాతామహులవద్ద వేదం వేదాంతం దివ్య ప్రబంధాలు అభ్యసించి , 16 వ ఏట సిక్కి కేదారం నుంచి తిరువై మోళి పిళ్ళై వెళ్ళాడు . ఇక్కడే రామానుజుల విగ్రహం ఉంది .ఇక్కడే ‘’యతిరాజ వింశతి’’రాశాడు .శ్రీ భాష్యం చదివి రామానుజ ఆదేశం పై దివ్య ప్రబంధ ప్రచారం చేస్తూ శ్రీరంగం చేరి తన పూర్వీకులులాగానే రంగనాధ సేవలో పునీతుడయ్యాడు .ఇక్కడే శ్రీ రంగనాధ సుప్రభాతం ,స్తోత్రం రాశాడు . అక్కడినుంచికనుంచి తిరుమల మొద లైన పుణ్య క్షేత్ర దర్శనం చేసి మళ్ళీ శ్రీరంగం చేరాడు
పిళ్ళై లోకాచార్య రహస్య గ్రంధాలైన ముముక్షుపది శ్రీ వచన భూషణం ,తత్వరహస్యం లపై వ్యాఖ్యానాలు రాశాడు . జ్ఞాన సారం ,ప్రమేయం సారాలపై కూడా వ్యాఖ్యలు రాశాడు .మళ్ళీ తిరునగరిచేరి ఆచార్య హృదయం పై వ్యాఖ్య రాశాడు . 1430 లో రంగనాధ స్వామి మనవాల మామునిని శ్రీరంగం కు వచ్చి నమ్మాళ్వార్ రాసిన తిరుమొళి పై ఉపన్యాసాలు ఇమ్మని ఆదేశిస్తే వచ్చి అందరికి అర్ధమయేట్లు ఆయన హృదయాన్ని ఆవిష్కరించి చెప్పాడు .ఈయన ప్రసంగాలకు మురిసిపోయిన రంగనాధుడు చివరి రోజు బాల పూజారిగా వచ్చి అభినందిస్తూ ‘’తనియన్ ‘’చెప్పి అదృశ్యమయ్యాడు . ఆ శ్లోకం అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో దివ్య ప్రబంధ గానం కు ముందు పఠిస్తారు ,-ఆ శ్లోకం –
‘’శ్రీ శైలేశ దయాపరం ధీ భక్యాది గుణార్ణవమ్ యతీంద్ర ప్రవణం రామానుజ మతారం మునిమ్ . దివ్య ప్రబంధ పఠనం -’’శ్రీమతే రమ్యాజ మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసినే భూయాత్ శ్రీ నిత్య శ్రీనిత్య మంగళం ‘’అని పూర్తి చేస్తారు అంత గౌరవం ఇస్తారు మాముని స్వామికి .ఆయన 19 గ్రందాలరాస్తే అందులో మూడు సంస్కృతం ,మిగిలినవి తమిళం లో ఉన్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-5-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా