గీర్వాణ కవులకవితాగీర్వాణం -3
401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం
కేరళకు చెందిన మాతృ దత్త కవి ‘’కామ సందేశం ‘’కావ్యం రాశాడు .మేల్పత్తూర్ కు చెందిన ఈ కవి వ్యాకరణ వేత్త .నారాయణ భట్ కుటుంబానికి చెందినవాడు .కావ్యం మొదటిభాగం లో 66 ,రెండవభాగం లో 69 శ్లోకాలున్నాయి .భార్యతో ఆనందంగా గడుపుతున్న అతనిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి చిదంబరం లో ఉంచుతాడు .అక్కడ కామ దేవుని కలిసి తిరునావయ లో తన భార్య చంద్ర లక్ష్మికి అతనిద్వారా సందేశం పంపటం ఇతి వృత్తం . అందరు సందేశకర్తలలాగానే ఈ కవీ రూట్ మాప్ ఇచ్చి పంపిస్తాడు .దారిలో రెండు సార్లు కొచ్చిన్ రాజు రామవర్మప్రస్తావన ఉంది .కావేరి నదికి ఉపనదిని కొల్లిదం అంటారు .కొచ్చిన్ రాజుకు పోర్చుగీసు వారికి మధ్య జరిగిన టోల్ ఒప్పందం కూడా ఇందులో ఉంది . 16వ శతాబ్దం లో త్రిచూర్ లో కొచ్చిన్ రాజభవన్ నిర్మాణాలు ,పాత రాజభవనాల విషయమూ ఉంది .రామవర్మ అంటే 1764 నుంచి 1801వరకు పాలించిన కేశవ రామ వర్మ అని గుర్తించారు . 1774లో కోట గోడలు మట్టితో నిర్మించటం అగడ్తలు త్రవ్వటం కూడా కవి రాశాడు . ఈయనకాలం లోనే పోర్చుగీసులతో ఒప్పందం కుదిరింది . రాజు ముసలితనం లో కాశీ యాత్ర కు వెళ్లి అక్కడే కైలాసం పొందాడు .ఈ సందేశం లో కాలికట్ నాయకరాజుల ,జమెరియన్ రాజుల వర్ణన ఉన్నది .కావేరి నాదీ తీర బ్రాహ్మణులూ ,వివిధ వృత్తులవారు అచ్యుతప్పనాయకుని ప్రశస్తి ఉన్నాయి .
402-శుభగ సందేశ కర్త -నారాయణ (16 వశతాబ్దం )
కేరళ త్రిసూర్ కు చెందిన నారాయణకవి శుభగ సందేశం రాశాడు .అంతకంటే జీవిత విశేషాలు తెలియవు .ఏవోకొన్ని అనివార్య కారణాలవల్ల దెయ్యంబారిన పడి కన్యాకుమారిలో ఉండవలసి వచ్చి త్రిసూర్ లో ఉన్న భార్యకు దూరమయ్యాడు .విరహవేదన తట్టుకోలేక పోతున్నాడు కన్యాకుమారి అమ్మవారి పూజారి స్నాతక బ్రాహ్మణుడైన సుభగ పరిచయమవగా భార్యకు అతనితో సందేశం పంపటమే కథ .కవి జయసింహనాడు పాలకుడు రామవర్మ ఆశ్రితుడు .రాజు ఆశ్రిత పోషణ గురించి వర్ణించాడు . పరిశోధకుడు ఉల్లూర్ ఈ రామవర్మ అంటే విజయనగర రాజులతో యుద్ధం చేసిన ఉదయ మార్తా0డ వర్మ సోదరుడు అని చెప్పాడు .కొట్టాయం లోని చంపకా స్సేరి దేవాల0 , దాని కోశాధికారి యజ్ఞనారాయణను రాజా రామవర్మ నియమించటం ఉన్నాయి …
403-చాతక సందేశ కర్త – ఒక బ్రాహ్మణకవి
కేరళ మలబార్ ప్రాంత తిరువంతం కుంజు లోని నంబూద్రి బ్రాహ్మణకవి తిరువాన్కూర్ మహా రాజ రామవర్మకు ఒక చాతకపక్షి ద్వారా తనకు ఆర్థికసాయం చేయమని పంపిన సందేశం . 1787లో టిప్పూ సుల్తాన్ మలబారును ఆక్రమించినపుడు ఈబ్రాహ్మణుడు తిరువాన్కూర్ మహారాజు కార్తీక తిరుణాల్ ఆశ్రయం పొందాడు .కొంతకాలానికి అకస్మాత్తుగా జబ్బు చేసి రాజుకు తెలియ బరచకుండా తన స్వగ్రామం చేరాడు .అక్కడ కాళికాదేవి పూజలో గడిపాడు .అక్కడ ఒక వనం లో చాతకపక్షికనిపిస్తే దానికి తన గోడు చెప్పి రాజుగారికి వెళ్ళగక్కమని సందేశానికిపంపటం ఇతి వృత్తం .ఇందులోనూ దారిలోఉన్నపట్టణాలు ప్రజాసమూహాలు రాజులవర్ణన యధాప్రకారం కవి దట్టించాడు .ఇందులో కొచ్చిన్ మంత్రి రాజ గోపాల్ ప్రస్తావన ఉంది .ఈయన పి .రాజగోపాలాచారి అని కొచ్చిన్ దివాన్ గా 1896-1901వరకు ఉన్నాడు అన్నది చారిత్రిక సత్యం .ఎడ ప్పల్లి బ్రాహ్మణ రాజుల వర్ణనా ఉంది .వాళ్ళు దాంతాలి నాయకులు కావచ్చు .
404-నీలకంఠ సందేశకర్త -శ్రీధరన్ నంబి (1774-1830 )
నెమలి సందేశం అనే సందేశకావ్యాన్ని శ్రీధరన్ నంబి రాశాడు . కేరళ పట్టాంబి వంశం వాడు .భారత పిశరాట్టి శిష్యుడై గొప్ప జ్యోతిశ్శా స్త్ర వేత్త అయ్యాడు ,. ఈ వంశం వారు కాలికట్ రాజుల ఆస్థాన కవులు జ్యోతిష శాస్త్ర వేత్తలుఅయ్యారు .ఈ కవి విక్రమాదిత్య చరిత్ర కూడా రాశాడు .నాయకుడు నాయకికి నీలకంఠం అంటే నెమలి ద్వారా పంపిన సందేశం .జామోరీ రాజులకు హైదర్ జంగ్ కు జరిగిన యుద్ధం ,యూరోపియన్ జంటలు వాహనాలమీద తిరగటం ,బ్రాహ్మణులు వేద వేదాంత శాస్త్రాలు నేర్వటం వగైరా వర్ణనలన్నీ ఉన్నాయి .
405-మరికొన్ని సందేశ కావ్యాలు
కవి సార్వ భౌమ కొకుణ్ణి తంపురన్ కోటు నల్లూర్ (1858-1926 )’’విప్రసందేశం ‘’,18 వ శతాబ్దికి చెందిన రామపనివాద ‘’122 శ్లోకాల శారికాసందేశం ‘’1858-1926 కాలపు కవి సార్వ భౌమ కొకుణ్ణి తాంపురన్ కోటు నల్లూర్ ‘’విప్ర సందేశం ‘’అజ్ఞాతకవి విరచిత ‘’చకోర సందేశం ,పులియనల్లూర్ తెక్కపట్టు అనే నంబూద్రి బ్రాహ్మణకవి ‘’సంపాతి సందేశం ‘’,వాయస్కర కు చెందిన ఆర్యన్ నారాయణ మసాటు ‘’స్యేన సందేశం ‘’కేరళలో సందేశకావ్యాలుగా చరిత్రకెక్కి సంస్కృత వాజ్మయం లో స్థానం పొందాయి. ఇవన్నీ మూస కావ్యాలుగా కనిపించినా వాటిలో చారిత్రిక నేపధ్యం ఉన్నది. ఆకాలపు రాజుల, ప్రజల జీవిత విధానాలకు అవి అద్దం పట్టాయి . వీటిపై ప్రత్యేక పరిశోధనలు జరిగి వాటిలోని చారిత్రిక విషయాల నిగ్గు తేల్చారు పరిశోధకులు .. ఆరకంగా ఇవి చారిత్రిక సందేశ కావ్యాలుగా రాణ కెక్కాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8–8-17 -కాంప్-షార్లెట్-అమెరికా