గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )
కేరళకు చెందిన 14 వ శతాబ్దపు కవి పూర్ణ సరస్వతి -పూర్ణ జ్యోతిష్యుని శిష్యుడు .ఉత్తర మలబార్ లోని కాట్టుమటం ఇళ్లాం కు చెందినవాడు .పూ ర్ణ సరస్వతి వంశాన్ని పరశురాముడు ఆశీర్వదించి నట్లు ఐతిహ్యం .అనేక శాస్త్రాలలో విస్తృతపాండిత్యం కవిత్వ రచనలో మేటి అవటం వలన ఆయనకు పూర్ణ సరస్వతి అనేది బిరుదుగా లభించిన పేరు .కావ్యం లో పూర్వభాగం ,ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి .మొత్తం 102 శ్లోకాలు .కాంచీపురం లో ఒక కన్య ఒక ఉత్సవం లో శ్రీ కృష్ణుని మోహన రూపం చూసి మనసు పారేసుకొన్నది . ఒక హంసతో తనమనోభావాలను బృందావన కృష్ణునికి సందేశంగా పంపటం ఇతి వృత్తం .రాయబారి హంస చేర ,పాండ్య దేశాలు చూస్తూ కావేరి ,కాళింది ,తామ్రపర్ణి లను దాటి తిరువనంతపురం వగైరాలను చూస్తూ బృందావనం చేరింది వీటి నన్నిటిని కవి చక్కగా అందంగా వర్ణించాడు .తిరువాన్కూర్ రాజు సర్వకళా వల్లభ వంశీష. ఆయన బలపరాక్రమాలు వర్ణించాడు . బహుశా ఈ రాజు స్వాతి తిరుణాల్ రామవర్మ కావచ్చును .ఆయన రాజరికానికి వచ్చిన 1829-46 కాలం లో ఈ కావ్య రచన చేసి ఉండాలి .ఇందులో సుచీన్ద్రం లోని ప్రసిద్ధ ‘’కై ముక్కు ‘’అంటే వేడి నేతిలో చేయిపెట్టటం కూడా వర్ణితం . దోషి ఎవడైనా శుచీన్ద్రాలయం లో వేడి నే తిలో చేయి పెట్టించి దోషి అవునోకాదో నిర్ణయిస్తారు .దోషి అయితే చేయి కాలిపోతుంది .లేకపోతె ఏమీ కాదు
కావ్యం లో దేవదాసి వ్యవస్థ వర్ణన కూడా ఉన్నది .తామ్రపర్ణి నదీతీర బ్రాహ్మణ అగ్రహారాలు స్నానఘట్టాలు ప్రకృ తి సౌందర్యం వర్ణన కూడా కనిపిస్తుంది ,.బ్రాహ్మణులను భూదేవతలు అని వర్ణించాడుకవి .
400-మయూర సందేశ కర్త -ఉదయ (16 వ శతాబ్దం )
కేరళ సందేశకావ్యాలలో మయూర సందేశం తలమాని కమైనది . దీనికర్త ఉదయ 16 వశతాబ్ది రాజకవి.ధ్వన్యాలోకానికి అభినవ గుప్తుడు రాసిన లోచన వ్యాఖ్యానికి ఈయన ‘’కౌముది ‘’వ్యాఖ్య రాశాడు .ఉదయ మానాకులం రాజా వంశీకుడు .వీరిపూర్వీకుడు శ్రీకంఠ మహాకవి .శ్రీకంఠుడు అనే నాయకుడు అంటే కవే కున్నాం కులం వద్ద అన్నకార లో ఉన్నతనప్రేయసి మార చేమంతి కి మయూరంద్వారా తనమనసులోమాటను రాయబారంగా పంపటం .త్రివేండ్రం నుండిఅన్నకారకు మాప్ వేసి దారి చూపించడు కవి .సముద్ర తీరం వెంబడి వర్కాలనుంచి క్విలన్ కు వెళ్లి ,అక్కడినుంచి తూర్పు కు తిరిగి కంటియూర్ మీదుగా కాయముకులం రాజుల రాజధాని కొట్టాయం చేరి , పుల్లా నదిదాటి కొచ్చిన్ రాజులువుండే త్రిపునీతురావెళ్లి .అల్వాయ్ నదిదాటి చిన్నమంగళం క్రన్ననూర్ మీదుగా బ్రహ్మమక్కాలకు తన ప్రేయసిని చేరుకోవాలి అని రూట్ మాప్ ఇచ్చిపంపాడు .ఇందులో చెప్పబడిన రాజులు మహాకవులు వ్యాఖ్యానాలు రాసినవారు .కోళంబ అనేది కూపకులుల నగరం .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-17-కాంప్-షార్ల్లెట్- అమెరికా