గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )
కేరళలోని ఓలాపమన్న మన్న వంశీకుడైన నారాయణన్ నంబూద్రి పండిత వంశ సంజాతుడు . 1910 లో జన్మించి 1989 లో చనిపోయాడు .ఋగ్వేదం లో మహా నిష్ణాతుడు .త్రిచూర్ బ్రాహ్మణ సర్వస్వ0 అధ్యక్షుడు .ఋగ్వేదాన్ని కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా నేర్పిన ప్రయోగ శీలి . ‘’ఋగ్వేద లక్షణార్చన ‘’ప్రారంభకుడు .ఆయన సంస్కృత రచన ‘’ఋగ్వేద భాష్యా భాష్యం ‘’ను ఆయన మేధోసర్వస్వము గా భావిస్తారు .ఆయన పేరిట ‘’దేవీ ప్రసాదం ట్రస్ట్ ‘’ఏర్పరచి ప్రతి యేటా వేద ,సంస్కృత ,సంగీత ,కథాకళీ లలో నిష్ణాతులకు పురస్కార సమ్మానాలు అందజేస్తున్నారు .
409-భారతీయ శాస్త్ర దర్శనకర్త -జి .విశ్వనాథ శర్మ (1912-1998 )
కేరళ లోని మంగుళూరు లో 1912 లో జన్మించిన విశ్వనాథ శర్మ సంస్కృతం శాస్త్రాలను విద్వా0సు లైన గొప్ప పండితులవద్ద అభ్యసించాడు .కాలడిలోని ఆశ్రమ విద్యాలయం తీపిని తూర సంస్కృత విద్యాలయాలలో రామాపురం టీచర్స్ ట్రెయింగ్ సెంటర్ లో సంస్కృత ఉపాధ్యాయుడుగా పనిచేశాడు . వేదాంతం లో స్వర్ణపతకం పొందిన మేధావి .విద్యాభూషణ ,పండిత రత్న బిరుదాంకితుడు .ఆయన సంస్కృత రచనలు -భారతీయ శాస్త్ర దర్శనం ,సంస్కృతాధ్యాపనం .
410-సామవేద ఘనాపాటీ – త్రోత్తం ఆర్యన్ నంబూద్రి (1930
కేరళలోని పంజాల్ లో జన్మించిన ఆర్యన్ నంబూద్రి సంప్రదాయ బద్ధంగా సామవేదం నేర్చి వేద పండిత బిరుదుపొంది ,కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో పనిచేసి ,సామవేదాన్ని పఠించటానికి ఇంగ్లా0డ్ నుండి ఆహ్వానం అందుకొని ,అక్కడ పఠించి మన్ననలు పొంది తిరిగివచ్చాడు .కంచి శ్రీ జయేంద్ర సరస్వతి నంబూద్రికి ;;కీర్తి ముద్ర ‘’బంగారు పతకం ప్రదానం చేశారు .కాలడి శ్రీ శంకరాచార్య సంస్కృత విద్యాలయం కోసం సామవేదాన్ని పఠించి రికార్డ్ చేశాడు . కేరళ దేశాన్ని ఈ మహానుభావులందరూ వేద వేదాంగ శాస్త్ర సారం తో పునీత0 చేసిన పుణ్య మూర్తులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా