’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే అతడు కొచ్చిన్ స్కాలర్షిప్ ఉంచుకొని యూనివర్సిటీ దాన్ని వదిలేశాడు  ఇది కస్తూరి ఆశలపై నీళ్లు చల్లింది ..త్రివేండ్రం చేరి మహారాజా కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలో చేరి ,సత్రం లో తింటూ సుబ్బయ్యర్ హితోపదేశం పై ఇండియన్ హిస్టరీ ని స్పెషలైజ్ చేసి అక్కడ రామ కృష్ణ వివేకానంద బృందం తో పరిచయమేర్పడి అక్కడి సంస్కృత పండిట్  హిస్టరీ హెడ్ కె వి రంగస్వామి అయ్యంగార్ దృష్టిలో పడ్డాడు .. 1916 లో తానుఉంటున్న త్రిపుత్త రకు త్రివేండ్రం 150 మైళ్ళు 32 గంటల ప్రయాణం అయితే,మద్రాస్ మూడు రె ట్ల దూరం అయినా రైల్ లో 26 గంటలప్రయాణం అనిపించింది ..అదృష్టవశాత్తు మద్రాస్ యూనివర్సిటీ త్రివేండ్రం లో హిస్టరీ ఆనర్స్ కోర్స్ ప్రవేశపెట్టింది .ప్రొఫెసర్ రంగస్వామి క్షణం ఆలస్యం చేయకుండా కస్తూరిని అక్కున చేర్చుకొన్నాడు .ప్రిన్సిపాల్ కస్తూరికి గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్ నెలకు 12 రూపాయలు మూడేళ్లకు మంజూరు చేశాడు . అక్కడే మేనమామ కూడా టీచర్ గా  ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది . ప్రొఫెసర్ గారి ఇంటి లైబ్రరీ కస్తూరికి బాగా ఉపయోగపడింది ..ఇక్కడే బెనర్జీ అనే రామకృష్ణా మిషన్ వ్యక్తితో పరిచయమై ,అందులో సభ్యులను చేర్పించి నిధి సేకరణకు తోడ్పడ్డాడు .. ప్రొఫెసర్ గారి రెండెడ్ల బండిలో ఆయనతోపాటు అనంతపద్మనాభ దర్శనం ,బీచ్ లకు వెళ్ళేవాడు .ప్రొఫెసర్ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు . అది కస్తూరి మనసుపై గొప్ప ప్రభావం చూపింది .ప్రొఫెసర్ స్కోల్లోస్ రినైసెన్స్ ను ,ప్రో సహస్రనామం ట్రాజి, కామెడీలను బోధించారు ..మూడవ ఏడాది టైఫాయిడ్ వచ్చి మేనమామ ఇంట్లో వాళ్లకు భారమే అయినా ఉండాల్సి వచ్చింది . తాత చనిపోగా తల్లి ఇక అక్కడ ఉండలేక పోయింది .ఇప్పుడు తల్లిని కూడా తెచ్చి మేనమామకు మరింత బరువు నెత్తికెత్తాడు .

 21 వ ఏటా హిస్టరీ ఆనర్స్ డిగ్రీ చేతబట్టి తల్లిని పెళ్ళాన్ని పోషించుకోవటానికి త్రివేండ్రం హై స్కూల్ టీచర్ అయ్యాడు . 1919లో కుటుంబం పెట్టాడు . మద్రాస్ ప్రెసిడెన్సీమొత్తం లో  ఆనర్స్ లో రెండవ స్థానం  పొంది ఇక్కడ బతకలేక బడిపంతులయ్యాను అనుకొన్నాడు  .ప్రొఫెసర్ గారు ఐ ఏ ఎస్ పరీక్షలు రాయమన్నాడుకాని ‘’విత్తులు ‘’లేక  లా కాలేజీలో ఉదయం సాయంత్రం క్లాసులకు హాజరై చదివాడు . అదృష్టం తలుపుతట్టి మాస్టర్ ఉద్యోగ జీతం యాభై శాతం పెరిగింది ..అక్కడ దామోదరన్ పొట్టి అనే ‘’డబ్బులావు ‘’  మనిషి పరిచయమై  తానూ సంపాదకుడుగా ఉన్న ‘’పీపుల్స్ ఫ్రెండ్ ‘’పత్రికకు ’’ ఘోస్ట్ రైటర్’’గా ఉండమని కోరాడు ..తనతరఫున తెచ్చే ప్రతిపత్రికకు 15 రూపాయలు ముట్ట చెబుతానని ఆశ చూపించాడు .సరే నని హాస్య వ్యంగ్య రచనలు పంచ్ డైలాగులూ రాసి పత్రికకు వన్నె తెచ్చాడు ..సంఘ వ్యతిరేకులమీద అవినీతిపరులు దేశ ద్రోహులపైనా తీవ్రంగా రాయమని కోరేవాడు ఆ ‘’దేశభక్తపొట్టి  . ‘’అలాగే  రెచ్చి పోయి రాసేవాడు .’’దీనితో వందేమాతర భావం వైరస్ లాగా నాకు సోకింది ‘’అంటాడుకస్తూరి .పొట్టి కోరికపై సేలం ఆయనతో వెళ్లి మహమ్మదాలీ షౌకత్ ఆలీ ల భుజాలపై చేతులు వేసి నడఁడుస్తున్న గాంధీని ,రాజాజీ ఏర్పాటు చేసిన స్వదేశీ ఎక్సి బిషన్ ,చూశాడు .

ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లికి మసూచికం సోకి కోలుకొన్నది .. టీచర్ ఉద్యోగం చేస్తూ లా చదువుతూ ,స్కూల్ లో విద్యార్థుల చేత తాను రాసిన ‘’షాజహాన్ ‘’నాటకం తనదర్శకత్వం లో వేయించటం వంటి సాంఘికకార్య క్రమాలతో గడిపాడు ..లా కాలేజీ లో చదువుతున్నప్పుడే మామగారిమామ గారు ఎప్పుడూ  ‘’లాయర్ కా వద్దు చీట్ చేయద్దు . టీచ్ చేయి  . గురువుజీవితం ఈ లోకం లోను ,పైలోకం లోను హాయిని సంతృప్తిని ఇస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొదపెట్టేవాడు..కనుక దేశం లో చాలా ప్రాంతాలనుండి ఆహ్వానాలు వచ్చినా వదిలేసి మైసూర్ డి బి హెచ్ .హై స్కూల్ లో హిస్టరీ  లెక్చరర్ గా చేరాడు . ఇప్పటివరకు ఎందరెందరిపైనో ఆధారపడ్డాడు కనుక ఇప్పుడు ఎవరికైనా ఆశ్రయం కలిగించాలని అనుకోగానే వాళ్ళ అమ్మ పల్లెటూళ్ళో నీళ్లుకారే రేకుల షెడ్ లో దరిద్ర జీవితం గడుపుతున్న తన అమ్మ అంటే కస్తూరి అమ్మమ్మ ను తమతో ఉంచుకుందామనగానే సరేనన్నాడు ..

 మైసూర్ వెళ్లి ధర్మ భానుమయ్య హై  స్కూల్ కు హెడ్మాస్టర్ ను కలవగానే ఆయనే రెండు చేతులతో నమస్కరిస్తూ ‘’వారుంగొ వారుంగొ ‘’అన్నాడు .మంచి  ఇల్లు తీసుకొని భార్య ,తల్లీ అమ్మమ్మలతో కాపురం పెట్టాడు .హిస్టరీ భోధించేవాడు .అక్కడి గోపాలకృష్ణయ్యర్ ,కృష్ణయ్యర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దారని కస్తూరి కృతజ్ఞతగా చెప్పాడు .ఉదయం అసెంబ్లీలో పా డాల్సిన ‘’ప్రార్ధన జీతం ‘’రాసి పిల్లతో రోజూ పాడించేవాడు .చంద్ర హాస ‘’నాటకం రాసి తాను క్రూర మంత్రిగా నటిస్తూ పిల్లలతో ఇంగ్లిష్ నాటకం వేయించి డైరెక్ట్ చేశాడు .వైస్ ఛాన్సలర్ చూసి చాలామెచ్చాడు .స్తూడెంట్ పార్లమెంట్ ,స్కూల్ మేగజైన్  నిర్వహించాడు ..స్నేహితుడు శంకరరావు తోకలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పిల్లల చదువు వారికివ్వాల్సిన ప్రోత్సాహం గురించి చెప్పేవాడు మైసూర్ లో యుని వర్సిటీకాలేజిలో చేరే విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులను సర్వే  చేశాడు ..కుటుంబం తో చాముండి అమ్మవారి దర్శనం  చేసేవాడు . 1923లోమొదటిపుత్ర సంతానం కలిగింది .స్కూల్ వ్యవస్థాపకుడు మునిసిపల్ ఎన్నికలలో నిలబడి టీచర్లను తనకు ప్రచారం చేయమనటం అసహ్యంగా ఇబ్బందిగా ఉంది  . ప్రచారం కోసం సెలవు ఇమ్మనేవాడు .గదులన్నీ వాళ్ళకే కేటాయించమనేవాడు

 దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకొంటుంటే స్నేహితుడొకడు గాంధేయ వాది  ,మైసూర్ మహారాజా  కాలేజీ లాజిక్ లెక్చరర్ డా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రియశిష్యుడు న్యాయవాద వృత్తి చేబట్టమని సలహా ఇచ్చాడు . అతని తండ్రి మైసూర్ రాష్ట్రం లో 50 గ్రామాలకు గురువు .కాదనలేక 350 మైళ్ళ దూరం లో ఉన్న సిద్దనహళ్లి వెళ్ళాడు  ,తనకు కన్నడం రానందువలన ,సివిల్ ప్రొసీజర్ కోడ్ పాసవనందువలన ఇప్పటిదాకా లా ప్రాక్టీస్  పెట్టలేదు .ఇప్పుడు లాయర్ గా  నమోదు చేయమని కోరాడు ..కానీ ఈగండం నుంచికూడా బయటపడ్డాడు .

 ఒక రోజుడిసెంబరునెల  ఉదయానే శంకరరావు గోపాల మారారు ను వవెంటపెట్టుకొని వచ్చాడు  ఆత ను తన సహాధ్యాయి  రాజా వంశీకుడు . మద్రాస్ లో చదివి డిగ్రీ పొందాడు .సన్యసించి రామకృష్ణా మిషన్ లో చేరి సిద్ధేశ్వరానంద గా వచ్చాడు .బేలూర్ మఠం  ఈయన్ను మైసూర్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేయమని పంపింది ..బెంగుళూర్ లో అందర్నీ అడిగి కస్తూరి గురించి వాకబు చేసి ఇక్కడికి  వచ్చాడు .సిటీ టౌన్ హాల్  లో ఒక సమావేశమేర్పాటు చేసి ఆయనతో ప్రసంగం చేయించాడు .కొన్ని నెలలో  ఆశ్రమం  తగిన వసతులతో  ఏర్పడి వర్ధిల్లింది .కాలేజీ విద్యార్థులకు ,తలిదండ్రులకు పరిచయం చేశాడు .మొదటి విస్తృత సమావేశం లో కస్తూరి ముందుగా కన్నడం లో తర్వాత సిద్దేశ్వ రానంద ఆంగ్ల0 లో అందరికి నచ్చేట్లు మాట్లాడారు . ఎందరో ప్రముఖులు హాజరయ్యారు .

 తర్వాత యువత ను ఆకర్షించే ప్రయత్నం చేశారు .వివేకానంద రోవర్స్ స్కౌట్ ఏర్పరచి ట్రెయినింగ్ ఇచ్చాడుకస్తూరి .నిధి సేకరణ చేశారు .ఒక రోజు అకస్మాత్తుగా దగ్గరున్న స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది .కస్తూరి యువ బృందం వెంటనే రంగ ప్రవేశం చేసి మంటలనార్పి పెద్ద ప్రమాదం తప్పించారు .మిల్లు డైరెక్టర్ తో సహా ఎందరో కస్తూరికి అభినందనలు తెలిపారు .మైసూర్ లో జరిగిన స్టేట్ రాలీ ఆఫ్ స్కౌట్స్ లో కస్తూరి యువజన రోవర్ బృందం పోలి కిట్టి ‘’నాటకం ప్రదర్శించి మహారాజు జయచామరాజ ఒడియార్ మన్నన పొందారు .కస్తూరి రాసి,డైరెక్ట్ చేసిన మరోనాటకం ‘’ది హెడ్ మాస్టర్స్ డాటర్ ‘’కూడా ప్రదర్శించారు . ఈ విధంగా రోవర్స్ క్లబ్ అటు జనానికి ,ఇటు ఆశ్రమానికి రాజకుటుంబాలకు బాగా దగ్గరైంది .గోపాల్ మహారాజ్ ప్రెసిడెంట్ గా కస్తూరి సెక్రటరీగా సేవ లందిస్తున్నారు .కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు .రెగ్యులర్ గా రాని  వారిని గుర్తించి కారణాలను కనుక్కొని కావాల్సిన సదుపాయాలూ కల్పించి వచ్చేట్లు చేస్తున్నారు .కె వి పుట్టప్ప అనే కవి కొన్ని సమావేశాలకు రాలేదని గ్రహించి ఆయన ఉండే చోటును వెతుక్కొని వెళ్లి చూస్తే టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడని గ్రహించి డాక్టర్ ను సంప్రదించి కృష్ణరాజేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు . వారం తర్వాత తగ్గిపోయింది . తాను  ఆశ్రమం లోనే విశ్రాంతి తీసుకొంటానని ఆయన అన్నాడు .పుట్టప్ప భారతీయ సంస్కృతికి  ప్రతినిధి .ఆయనకవిత్వం ఆశ్రమ వాతావరణం లో పుష్పించి వికసించి ఫలించి లబ్ధ ప్రతిష్ఠుతుని చేసింది .సిద్ధేశ్వరానంద మైసూర్ ప్తజల హృదయం లో శాశ్వత స్థానం సంపాదించాడు ..ఇద్దరూకలిసి వైస్ ఛాన్సలర్ వీరాజేంద్రనాధ్ ను గీతపై ప్రసంగించవలసిందిగా కోరగా వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు .యుని వర్సిటీ ,కాలేజీ లలో  సంస్కృత విద్యాలయాలలో ఉన్నసై కాలజి ఫిలాసఫీ ప్రొఫెసర్లు లెక్చరర్లు వచ్చి ఆశ్రమం లో ప్రసంగించి ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కల్గించేవారు .యుని వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్య అయ్యర్ సిద్ధేశ్వరానంద శిష్యుడయ్యాడు .తాను  సెక్రెటరీ గా ఇలాంటి ఉన్నతులమధ్య గడపటం తన అ దృష్టం అన్నాడు కస్తూరి . తూర్పు పడమటి తత్వ శాస్త్ర రహస్యాలు ,ఉపనిషత్ సందేశాలు ,గీతారహస్యాలు ,అద్వైత ద్వైత వాదాలు మానసిక శాస్త్రం అన్నింటిపైనా విలువైన ప్రసంగాలు చేయించాడు కస్తూరి స్వామీజీతోకలిసి .సన్యాసులకు రెండేళ్ల శిక్షణ ప్రారంభించారు .మైసూర్ మహారాజా సుబ్బరామయ్యర్ ను ఘనంగా సన్మానించి ఆశ్రమానికి భూరి ధన సహాయమందించాడు … అనుకొన్న విధంగా సిద్ధేశ్వరానంద కస్తూరి సహాయం తో ఆశ్రమాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చేయగలిగాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.