‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూరి  మిత్రుడు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణాటక పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్తలుగా తీసుకొన్నారు .అందులో ఒకడు బ్రాహ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పోగొట్టటానికి కస్తూరి అతనిని ముందుగా అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె నిండుగా హరిభక్తి తో చేస్తున్న రామభజన చూసి ఆశ్చర్యపోయాడు .వారికి  హిందూ ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్లవెంట ఆనంద బాష్పవాలు ధారాపాతంగా కారిపోయాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి హరిజనవాడలో నే కస్తూరి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రాహ్మణ కుర్రాడు ఆనందంగా వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూరితో ‘’సార్ !ఈ చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞతగా ..

 గ్రామీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూరి తనబృందం తో యూనియన్ తరఫున ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రోగ్రామ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రామం లో లో నిర్వహించాడు .బస్సులో   ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్దరు ముగ్గురుకలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్లి మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు  ఉత్తమ వ్యక్తుల జీవిత గాథలు గ్రామం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్ హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం  రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రాంగిల్ మొదలైనవి చూపించేవారు .ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూరి బృందం వారికి ఆత్మీయ మిత్రులు సోదరులైపోయారు .వార0దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదే .. ఇన్ని పనుల్లో మునిగిఉన్నా కస్తూరికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది . ,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం  గాలికొట్టిన ఫుట్ బాల్  తాను అని అనుకునేవాడు  .

 యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లుకన్నడం లో  రాసేవాడు కస్తూరి . మాండ్యా  కు చెందిన యువకుడొకడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టాలుతప్పినా, పొగ వదులుకొంటూ ముందుకు కదిలే బొమ్మ వేయించి ,పుస్తకం లోపలి తనభావాలు’’ pricking bubbles ,pulling legs ,drawing carpets ,from under feet ,minimising mountains into mole-hills ,holding mirrors to the face ,explosing clay feet ,buldozing castles built in the air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూరి .. కస్తూరిరాసిన కన్నడ పుస్తకాలు ‘’అల్లోలకల్లోల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు గాలిగోపురం ,శ0ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్ ,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్ లో పాతమాటలకు కొత్తపదాలు సమకాలీనమైన సరికొత్తపదాల సృష్టి ,పాత సామెతలకు కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సోషల్ ఆంత్రోపాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను మోనోగ్రాఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణాటక ‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూరి పరిశోధక సృజన పరిమళం వ్యాపించింది ..

‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు   డా.శివరాం అనే హాస్య రచయిత పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సోది చెప్పే అమ్మాయి అని అర్ధం . కస్తూరిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు . అంగీకరించి కస్తూరి  10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి గిలిగింతలు పెట్టాడు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు ‘’కస్తూరి ‘’గుబాళింపు తో ఉండేవి.  .కస్తూరి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక మొదలైన  ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె  లక్ష్మణ్  కార్టూన్లు గీసేవాడు .నాదిగ్ అనే మరో కార్టూనిస్ట్ కూడా వేసేవాడు .

 .శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తున్నాడని  దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తున్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధతిలో పంచ్ రాస్తానననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా  కొన్ని పంపగలనని రాశాడు  కస్తూరి . దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గమే నిర్వహిస్తుందని  కనుక అవకాశం ఉండకపోవచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0జి ‘’లో తాను  కన్నడం లో రాసిన ‘’ఊరిగలు ‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్  పోస్టులో పంపాడు.  అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రాటిల్ ‘’(కేవలం తడబాటు )శీర్షికలో కస్తూరి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో  శంకర్ వేసిన కార్టూన్ క్రింద కస్తూరి హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూరి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తుంది ,మురిపిస్తుంది .

  మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూరి చేసే బహువిధ కార్యక్రమాలను దగ్గరగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూరిని ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూరిని ‘’కామెల్  ఆఫ్ ది కాలేజ్ ‘’ (కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూరి మోస్తున్నాడని అర్ధం .ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తినా కాదు అనకుండా మోయటం కస్తూరి ప్రత్యేకత .గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్సిమిటర్  తెచ్చాడు .  ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు రోజుకు ఒకగంటసేపు గ్రామీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూరికి అప్పగించాడు  . ఏ కొత్తదైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూరి గాలిలో కూడా కస్తూరి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి ‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం ఇస్తానని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రాంతాలవారికి  వినే  సౌకర్యం కలిగింది .ఒక రోజు స్టాఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం చెప్పమనిభావం . కస్తూరి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో సహా అందరికీ ఆపదం  నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది కస్తూరి చలువవలన   .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం కస్తూరి  జీవిత చరిత్ర చదివాకే  తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

–              shankar

–   First content item page

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.