గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3
311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)
28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు .సంస్కృతం వ్యాకరణ కావ్య అలంకార ,తర్క పురాణ ,ఇతిహాసాదులను మహారాజా సంస్కృత కళాశాలలో విడిగా సంగీతం నేర్చుకొంటూనే అభ్యసించాడు . మహారాజూ అందజేసిన పారితోషికం తో ప్రసిధ్ధ సంగీత విద్వా0సుడు పట్నం సుబ్రహ్మణ్య పిళ్ళై దగ్గర ,కావేరి డెల్టా లోని అనేక ప్రసిద్ధ సంగీత విద్వా 0సులవద్ద సంగీతపు లోతులు తరచి తెలుసుకొన్నాడు .
వాసుదేవాచార్య సంగీత విద్వత్తుని గుర్తించిన మహారాజు ఆస్థాన సంగీత విద్వా0సుని చేసి గౌరవించాడు . గురువు వద్ద నేర్చిన మాధ్యమకాల తానం లో మహా నిష్ణాతుడయ్యాడు .గురువు పట్నం ,శిష్యుడు మైసూర్ ను కీర్తనల రచనల విషయం లో సలహాలు తీసుకునేవాడు. ఇది శిష్యుడికి బాగా ఉపయోగపడి వాగ్గేయకారుడవటానికి తోడ్పడింది . వాసుదేవాచార్య కర్ణాటక సంగీతం లోని రాగం ,తానం ,ఆలాపన ,పల్లవి ,కల్పనస్వరాలలో సాటిలేనివాడయ్యాడు
వాసుదేవాచార్య తాను రచించిన సంస్కృత ,తెలుగు కృతులు 200 లను ‘’వాసుదేవ కృతి మంజరి ‘’గా ప్రచురించాడు .ఈ రెండుభాషలలో ఆయనరాసినవి సుమధురంగా భాషా పరిజ్ఞానంతో భాసిస్తాయి .తెలుగు హృదయం లోకి ప్రవేశించటం త్యాగరాజ గురు భిక్ష అని వినయంగా చెప్పుకొనేవాడు .ఇతర దాస కూట ద్వైత గీతాలలాగా కాకుండా ఈయన గీతాలు ‘’పరమపురుష వాసుదేవ ‘’లేక ‘’వాసు దేవ’’అనే విష్ణు నామం తో విరాజిల్లటం విశేషం . అదే ఆయన ‘’ముద్ర ‘’కూడా .త్యాగరాజ శిష్యపరంపర లోని వారిలాగే ఈయనా శ్రీ రామునిపైనే ఎక్కువ కృతులు ,కీర్తనలు రాశాడు.వర్ణాలు ,తిల్లాన శ్లోకాలు కూడా రాశాడు .కర్ణాటక సంగీత త్రిమూర్తులలో అద్వితీయుడైన త్యాగ బ్రహ్మం గారిని కళ్యాణిరాగ కీర్తనలో ‘’శ్రీ మదాది త్యాగరాజ గురువారం ‘’అంటూ స్తుతించాడు .ఒక రాగమాలికలో శ్రీరామ చంద్రుని మరి రెండు రాగమాలికలో ముత్తుస్వామి దీక్షితులు ,శ్యామశాస్త్రి ని కీర్తించాడు .వాసుదేవాచార్య కృతులు చక్కర పాకం లాగా మధు మధురంగా ఉండటం విశేషం .
కన్నడం లో తన జీవిత చరిత్ర ‘’నేనపు గలు ‘’(జ్జ్ఞాపకాలు )పుస్తకం ,తనకు తెలిసిన సంగీత విద్వా 0సుల జీవిత చరిత్రలను ‘’నా కంద కలవిదరు ‘’గ్రంథం గా రాశాడు .వృద్ధాప్యం పైనబడినా శ్రీమతి రుక్మిణీదేవి అభ్యర్థనపై ఆమె కళాక్షేత్రం లో ముఖ్య సంగీత విద్వా 0సుడిగా సంగీతం బోధించాడు .సంస్కృత రామాయణానికి సంగీతం కూర్చాడు. ఆయన మరణం తర్వాత మనవడు రాజారామ్ బాధ్యతలు తీసుకొని తాతగారు మొదటినాలుగుకాండలకు సంగీతం కూర్చితే మిగిలినవాటికి సమకూర్చాడు . మరోమనవడు కృష్ణ మూర్తి ఆకాశవాణిలో పనిచేస్తూ తాతగారు రాసిన స్మృతులను ఆంగ్లం లోకి అనువదించాడు . వాసుదేవాచార్య సంగీత విద్వత్తుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందించి గౌరవించింది . కమాస్ రాగం లో ‘’బ్రోచే వారెవరురా ‘’,సునాద వినోదిని రాగం లో ‘’’దేవాధిదేవ ‘’,హిందోళం లో ’మామవతు సరస్వతీ’’,అభేరీరాగం లో ‘’భజరే రే మానస ‘’అనే ఆయన కృతులు ఆనంద పులకితు లను చేస్తాయి .ఆయన భాషా పాండిత్యానికి కైమోడ్పులు సమర్పించేట్లు చేస్తాయి . 96 ఏళ్ళ నిండు జీవనం గడిపిన ఆ సంగీత సాహిత్య సరస్వతి మైసూర్ వసుదేవాచార్య 17-5-1961న తానునమ్మిన వాసుదేవ పదం చేరుకొన్నాడు .
సంస్కృతం లో మైసూర్ వాసుదేవాచార్య కీర్తన సొబగులు చూద్దాం –
1-గంభీర నాట రాగం లో -’’గిరిజా రమణా నటరాజ న శరణ -కరుణారస పూర్ణ స్మరహర నాగాభరణా-
పరవాసుదేవ రధనా ధురీణ కార ధృత హరిణా కలిమల హరణా -మహా పంచాక్షరీ మంత్ర మూర్తే మహాభక్త కౌంతేయ నుత కీర్తే
మహాగణపతి గుహ సేవిత మూర్తే -మహాదేవ పరిహృత దీనజన ఆర్తే -మహానంది భృంగాది నాట్య ప్రదర్శక కైలాసపతే ‘’.
2-అభేరీరాగం లో -’’గోకుల నిలయ ‘’
3-హిందోళయం లో -’’మామవతు సరస్వతీ ‘’
4-గౌరీమనోహరిరాగం లో -’’వరలక్ష్మి నమోస్తుతే ‘’
5-బిళహరి రాగం లో -శ్రీ చాముండేశ్వరి
6-గరుడ ధ్వని రాగం లో -దేవి కమలాలయే మొదలైనవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-17- కాంప్-షార్లెట్-అమెరికా
—