సంసారంలో రిగమపదనిసలు
ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు . .
ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని మా అయన పెళ్లయి నాలుగేళ్లయినా ఇంట్లో ఇంతవరకు ఒక్క ”వికెట్ ”కూడా తీయలేదు ”అంది . వెంటనే బాట్స్ మన్ పెళ్ళాం ”నా బాధ ఏం చెప్పుకొను ? ఆటలో సెంచరీలపై సెంచరీలు చేస్తున్నాడు .మూడేళ్లయింది కాపరానికొచ్చి ఎప్పుడూ ”డకౌటే ”నా ఖర్మకాలి అని ముక్కు చీదుకొన్నది . వెంటనే వికెట్ కీపర్ భార్యఅందుకొని ”గ్రౌండ్ లో ఏ బాలూ మిస్ కాకుండా కాచ్ పడతాడు . ఒంట్లో బాల్స్ సంగతి పట్టించుకోడు నేనెవరికీ చెప్పుకోను ”?అంది బొటబొటా కన్నీళ్లు కారుస్తూ . అంపైర్ పెళ్ళాం రంగం లోకి దూకి ”ఫోర్ కి ,సిక్స్ కి వైడ్ కి అవుట్ కి చేతులు చాపే మాఆయన మంచం మీద మాత్రం చేతులు చెప్పనే చాపడు .ఇంకపిల్లలేం పుడతారు మామ్మా “‘అంది గోడు గోడు మంటూ .
ఆటగాళ్ల పెళ్ళాల వంతు అయ్యాక వాద్య కారుల భార్యలు బాధా ఆరోణ అవరోహణాలు మొదలుపెట్టారు .ముందుగా తబలా ఆయన భార్య ”సంగీతం అంటే పరిగెత్తుతాడు .మృదంగం రెండు కాళ్ళమధ్యా పెట్టుకొని ఎడా పెడా వాయిస్తూ, పాడేవాడికి చక్కని సహకారం అందిస్తాడు మాఆయన .కానీ సంసారం లో నేను సహకరిస్తున్నా దులభరిస్తూ దూరం జరుగుతాడు .ఇక వాయింపుకేం నోచుకోను ”అని గోడుగోడుమంది . వయోలిన్ కళాకారుడి భార్య ”బామ్మా !తీగలు మీటటం లో ఉన్న ఆనందాన్ని తనువు తీగ మీటటం లో చూపించటం లేదు .ఇక శ్రుతికలీసే దెప్పుడు సంతానం కలిగేదేప్పుడే బామ్మో బామ్మ ”అని కన్నీరు కార్చింది . వెంటనే గాప్ లేకుండా వీణ ఆయన పెళ్ళాం అందుకొని ”కిందోబుర్ర ,పైనో బుర్రా ఉన్న తీగలపై టింగ్ టింగ్ మని గోళ్ళతో మీటు తాడేకాని రెండు బుర్రలూ పక్కపక్కనే ఉన్నా తాకనైనా తాకేదే బామ్మా ఇక మీటుడు సంగతే0 చెప్పను .చెప్పుకొంటే సిగ్గుచేటు ”అని కన్నీరొలికించింది . .తర్వాత విరామం లేకుండా ఘటం –సారీ ,సారీ ఘటం వాయించే ఆయన పెళ్ళాం ”ప్రాణం లేని మట్టి కుండఒళ్ళో పెట్టుకొని .తలకాయ అటూ ఇటూ తిప్పుతూ సంగీతానికి తగినట్లు వాయించే మా ఆయన ,కళ్లెదుట సజీవ బాండాలున్నా తకధిమి తో0 అనటంలేదు మామ్మో ”అన్నది .
”ఒసే పిల్లల్లారా !మీ బాధ విన్నాను .గుండె కరిగి పోతోందే .. నేను ఒక సలహా చెబుతా .పట్టు వదలకుండా సాధన చేయాలి ”అన్నది బామ్మ బాలమ్మ . ”చెప్పు బామ్మా -తూచా తప్పకుండా పాటిస్తాం ”అన్నారు అందరూ ఏక కంఠం తో .అయితే వినండి ”మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ మొగుళ్ళు చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు .మీరూ ఇంకా మంచి వాళ్ళుగానే అనిపించారు .కానీ ఒత్తి వాజమ్మలు అనిపించింది నాకు . ఆట అవతలివాడు మొదలు పెట్టక పోతే మనమే ముందు మొదలు పెట్టాలి అంతే కానీ నంగ నాచి తుంగ బుర్రల్లాగా ఉంటె ఫలితం ఉండదు ”అన్నది . అప్పుడు అందులో ఒకావిడ ”బామ్మా !ఇందులో నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటె చెప్పు .ప్రాక్టికల్ ఫిలాసఫీ మంచిదికదా ”అంది .దానికి బామ్మ ”నిజమేనర్రా .నేనే దీనికి ఉదాహరణ .మీభాషలోరోల్ మోడల్ అనుకోండి . మా ఆయన కుస్తీ ఫహిల్వాన్ .ఎప్పుడు ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వెళ్లి పోయేవాడు అక్కడే తయారు తిండి తిని పోటీలో పాల్గొని గెలిఛీ ఓడీ వస్తూ ఇంటికొచ్చి గుర్రుపెట్టేవాడు .రెండేళ్లు ఓపికపట్టా . ఒక రోజు అనుకోకుండా మా బామ్మ వచ్చింది .ఆవిడ దగ్గర మీలాగానే నా బతుకు వెళ్ళ బోసుకొన్నా .ఆవిడ తేలిగ్గా తీసుకొని ఉపాయం చెప్పింది .దాన్ని బెసగ కుండా మా ఆయనపై ప్రయోగించా .ఏడాది తిరిగేటప్పటికీ కోడి రామమూర్తిలాంటి కొడుకు పుట్టాడు .ఆ కిటుకే ఇప్పుడు మీకు చెబుతా విని ఆచరించండి . మీ మొగుళ్ళు అటాక్ ఇవ్వకపోతే మీరే అడ్వాంస్ అవ్వాలి .నయానా భయానా కాలం దాటి పోయింది .ఇక వీర విజృంభణమే చెయ్యాలి మీరు . ఇంట్లో విజయం లేకపోతె బయటి విజయానికి సహకరించమని భీష్మించండి బెసఁగఁ నీయకండి . ఉడుం పట్టుపట్టండి . అనుకొన్నది సాధించండి మొహమాట పడద్దు . వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపారేయండి . ముందుకు దూకండి .ఆతర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు బోలెడు సినిమా సీరియళ్ల అనుభవాలున్నమీరు ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డలతో నాకు కనబడాలి .ఈ లోపు మీ మొహాలు కూడా నేను చూడను ”అన్నది .అందరికి బల్బ్ వెలిగింది .దూకుడుగా ఇళ్లకు వెళ్లిపోయారు బామ్మకు తాంక్స్ చెప్పి .
సరిగ్గా ఏడాదికి మళ్ళీ వాళ్లంతా చంకలో పిల్లనో ,పిల్లాడినో ఎత్తుకొని బామ్మ తో సమావేశమయ్యారు .అందరి ముఖాలలో నవ్వు వరదలై ప్రవహిస్తోంది .అందరూ ముక్త కంఠం తో ”బామ్మా !నీకు థాంక్స్ . నువ్వు చెప్పినట్లే చేసి పిల్లల్ని సాధించాం ”అన్నారుఆనందంగా . ‘ఒసే బానే ఉంది కానీ పిల్లలకు ఏం పేరు పెట్టారే ”అని అడిగింది .వాళ్ళు బామ్మ పేరుమీదుగా ఆడపిల్లకు బాలమ్మ అని మగపిల్లాడికి బాలయ్య అని పేరు పెట్టినట్లు ఉత్సాహంగా చెప్పారు .పాపం ఇప్పుడు బాలమ్మబామ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారిపోయాయి .ఇందరు మనవాళ్ళు మనవరాండ్రను చూసే సరికి . వాళ్లందరికీ మర్నాడు భర్తలతో సహా తన ఇంట భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నిండా తినిపించారు బాలమ్మ దంపతులు. పిల్లలందరికీ కొత్త చొక్కాలాగు లంగా లు కొని వాళ్లకు ఇచ్చి తొడిగించారు . . వీళ్ళు ఊరుకుంటారా అందరూ ఆ దంపతులకు తమ శక్తికొద్దీ కొత్తబట్టలు పెట్టి ఆశీర్వాదం పొందారు
శ్రీ కృష్ణాష్టమి, భారత 71 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభా కాంక్షలతో .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా .
—