గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర భాగవతార్ (1815-1892 )
కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా .స్వాతి తిరుణాల్ రాసిన వాటికి పరమేశ్వర్ నకలు రాసేవాడు .గొప్ప వీణ విద్వా 0సుడు .స్వరబత్ వాయిద్యం లోను దిట్ట . హరికథాగానం తో జనాలను ఉర్రూత లూగించేవాడు . స్వాతి రాజాస్థాన సంగీత విద్వా0 సుడు గురువు వడివేలు మరణించాక భాగవతార్ ను ఆస్థాన విద్వా0సుని చేశాడు రాజు పరమేశ్వర భాగవతార్ సంస్కృతం లో కీర్తనలు రాశాడు . అవి అచ్చు స్వాతి తిరుణాల్ ,ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలాగానే ఉంటాయి .అనేక వర్ణాలూ రాశాడు .ఆయన రాసిన కీర్తనలలోనాటరాగం లోని ‘’సరసిజనాభ’’,శ్రీ మహా గణపతిం భజే ‘’కీర్తనలు మంచి గుర్తింపు తెచ్చి కచేరీలు వరమయ్యాయి . 87 వ ఏట 1892 లో భాగవతార్ మరణించాడు . మలయాళం లో కూడా కీర్తనలు రాశాడు .
413-తిరువనంత స్థల పురాణకర్త -కుట్టికుంజన్ తంగాచి (1820-1904 )
కుట్టికుంజన్ తంగాచి ఇరై మాన్ తంబీ ఏకైక కుమార్తె .కేరళలో 1820 లో పుట్టి 1904 లో చనిపోయింది . తండ్రి స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా0సుడు .తండ్రి వద్దే సంగీతం నేర్చింది .హరిప్పద కోచిప్పిల్ల వారియర్ వద్ద సంస్కృతం అభ్యసించి సంస్కృత ,మళయాళ భాషలో గొప్ప విదుషీమణి అయింది . నృత్యం కూడా తండ్రివద్దే నేర్చి దాని లోనూ ప్రతిభ చాటింది . .పార్వతీపరిణయం శ్రీమతి స్వయంవరం అనే అట్టకాలు రాసింది .సంస్కృతం లో తిరువనంతపురం స్థలపురాణం ,గజేంద్ర మోక్షం ,నలచరిత్రం రాసింది .అనేక కృతులు ,వర్ణాలు రచించింది అందులో కాంభోజిరాగం లో ‘’కాత్యాయని మాం ‘’కళ్యాణిరాగం లో ‘’సామజహరే ‘’మంచి గుర్తింపుపొందాయి .సంస్కృత తిల్లానా కూడా రాసింది . కేరళలో కీర్తనలు రాసిన ప్రధమ మహిళావాగ్గేయకారిణిగా ఆమె గుర్తిపు పొందింది. 84 వ ఏట1904 లో మరణించింది .
414-108 రాగాలలో 108 కీర్తనలు రాసిన -ఎన్నపాదం వెంకటరామ భాగవతార్ (1880-1961)
కేరళలో కొచ్చిన్ లోని ఎన్నపాదం లో వెంకటరామ భాగవతార్ 1880 లో జన్మించి 1961 లో 81 వ ఏట మరణించాడు . హరికథాగానం లో సాటిలేనిమిటి .సంస్కృత తెలుగు కన్నడ మిళ మళయాళ భాషలో హరికథలు రాసి చెప్పి ఒప్పించినహరికథా సరస్వతి .తిరువనంతపురం కొచ్చిన్ మైసూర్ ,బరోడా మొదలైన సంస్థానాలలో హరికథా గానం చేసి మెప్పుపొంది సత్కారాలు అందుకొన్నాడు .అనేక కొత్తరాగాలు సృష్టించాడు . కృష్ణ అష్టోత్తర శతనామ కీర్తనలు ‘’108 రాగాలలో 108 కీర్తనలు అంటే నామానికి ఒక్క కీర్తనగా రచించిన భక్త శిఖామణి . ప్రకాశిని రాగం లో ‘’గుహం ఆశ్రయామి ‘’,సుముఖిరాగం లో ‘’మాతంగ ముఖం ‘’కీర్త నలు ప్రసిద్ధి చెందాయి .
415-మణిప్రవాళ శైలి కృతి కర్త -తమస్సేరి కృష్ణన్ భట్టాత్రి (1890-1963 )
1890 లో పుట్టి 1963 లో చనిపోయిన తమస్సేరి కృష్ణన్ భట్టాత్రి కేరళలో జన్మించాడు .సంస్కృత మళయాళభాషలలో గొప్ప ప్రజ్ఞావంతుడు . ఈ రెండు భాషలు కలిపి మణిప్రవాళ శైలిలో కృతులు రాశాడు .బేగడ రాగం లో ‘’శ్రీరాఘవ పరిపాలయ ‘’,ఆనంద భైరవిలో ‘’ఆనంద నంద నందనం నమామి ‘’మొదలైనవి ప్రసిద్ధ కీర్తనలు .
416-దేవయాని చరిత నాటక కర్త -కుట్టు ముత్తు కుంజు కురుప్ (1880-1943)
కేరళలో కనియూర్ లో 1880 లో పుట్టి 63 ఏళ్లకు 1943లో చనిపోయిన కుట్టుముట్టు కుంజు కురుప్ సాహిత్య సంగీతాలలో మహా విద్వా 0సుడు . సంస్కృతం లో దేవయాని చరిత నాటకం ,విద్యా శ0ఖ ధ్వని ,బాలగోపాలం వంటివి ఆయన ప్రతిభా ప్రదర్శనాలు .తననాటకాలలో 300 కు పైగా కృతులు రాసి స్వరపరచిన మేధావి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-17 -కాంప్–షార్లెట్-అమెరికా