గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )
కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు మెచ్చి ఆస్థాన విద్వా 0సుని చేశాడు . .క్షేత్ర సందర్శనం చేసి ప్రతి దేవునిపైనా కృతులు చాలాభాగం తెలుగులో కొన్ని సంస్కృతం లో రాశాడు .స్వరజతులు వర్ణాలు కృతులు తిల్లానా లు సంస్కృత తెలుగు భాషలలో రాశాడు .ఆయన కృతులన్నీ రాగభావం తో సాహిత్య సౌందర్యం తో అలరిస్తాయి .హరికాంభోజి రాగం లో రాసిన సంస్కృత కీర్తన -’’సాకేత నగరనాధ ‘’శ్రీమతి ఏం ఎస్ .సుబ్బులక్ష్మి గాత్రం తో బహుళ ప్రచారం పొందింది .తెలుగులో మాయామాళవ గౌళరాగం లోని ‘’దేవాది దేవ ననుకావ సమయమురా ‘’,ఆఠణా రాగం లో -’’వాచామ గోచరుండని ‘’,కమాస్ రాగం లో -’’పరమాధ్బుతమైన నీ సేవ ‘’హంసధ్వనిలోని స్వరజతి -’’రామాభిరామా ‘’ మొదలైనవి ఆయన ప్రతిభకు స్వరగోపురాలు . 1879 80 ఏళ్ళ వయసులో మరణించాడు .
417-సప్త తాళేశ్వర కర్త -వీణ వెంకట సుబ్బయ్య (1750-1838)
మైసూర్ లోని ప్రసిద్ధ వైణిక కుటుంబం లో 1750 లో తంజావూర్ జిల్లా కపిస్తలం లో జన్మించిన వీణ వెంకటసుబ్బయ్య మైసూర్ ను పాలించిన హైదరాలి కాలం వాడు తర్వాత మూడవ కృష్ణరాజ ఒడియార్ కు సంగీతగురువై ,ఆస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .దివాన్ పూర్ణయ్యపంతులు మైసూర్ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలాగా సాంస్కృతిక కేంద్రం చేయాలని చాలా కృషి చేశాడు . వెంకటసుబ్బయ్య రీతి గౌళరాగం లో ఎనిమిది సులాది తాళాలతో రచించిన ‘’సప్త తాళేశ్వర గీతం ‘’ సుప్రసిద్ధమైనది . 88 ఏళ్ళు జీవించిన వీణ వెంకటసుబ్బయ్య జీవిత వీణ 1838 లో ఆగిపోయింది .
418-లింగ రాజ అర్స్ (1823-1874 )
మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాజ ఒడియార్ అల్లుడు అలియ లింగ రాజ అర్స్ కన్నడ సంస్కృతాలలో అందెవేసిన చేయి .సంగీతకర్త .హెగ్గద దేవనకోట వాస్తవ్యుడు .లలితకళాభిజ్ఞుడు .అనేక నాటకాలు ,యక్షగానాలు ,50 కి పైగా కృతులు రచించాడు . లింగ ,లింగేంద్ర ,లింగరాజ అనే కలం పేరుతొ రాసేవాడు .సంస్కృతం లో పంచ వింశతి లీల ‘’అంబకీర్తన బాగా ప్రసిద్ధం . అతని నీలాంబరి రాగం చిత్త స్వరం లో ‘’ శృంగార లహరి’’ సంస్కృత కృతి అత్యద్భుతం . 51 ఏళ్ళు మాత్రమే జీవించి అర్స్ 1874 లో అసువులు బాశాడు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17- కాంప్-షార్లెట్-అమెరికా