గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
428-తంజావూర్ సంగీత చతుష్టయం (1801-1856)
తంజావూర్ కు చెందిన చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం వడివేలు అనే నలుగురు సోదరులను తంజావూర్ సంగీత చతుష్టయ0 అంటారు .భరతనాట్యం కర్ణాటక సంగీత వ్యాప్తికి వారి కృషి మరువలేనిది .తంజావూర్ మహారాజు షెర్ఫోజి ఆస్థాన సంగీత విద్వా0సులుగా ఉండేవారు . తరువాత తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ కొలువులో చేరారు .దీక్షితార్ వంటి మహా విద్వా 0సుల వద్ద సంగీత శిక్షణపొంది లోతులను తరచారు . వీరిలో వడివేలు పిళ్ళై ఏక సంధాగ్రాహి అని ముత్తుస్వామి దీక్షితార్ ప్రశంసించాడు .గురువుగారికి కానుకగా ‘’నవరత్న మేళ’’కూర్చారు సోదరులు .వడివేలును ఆస్థాన గాయకునిగా స్వాతి తిరుణాల్ నియమించాడు .వడివేలు మహాజ్ఞాని . వయోలిన్ కూడా నేర్చి స0స్థానం లో వాయించి రాజు మెప్పుపొందాడు .కల్పిత సంగీతాన్ని మనోధర్మ సంగీతాన్ని వయోలిన్ పై పలికించవచ్చునని రుజువు చేశాడు వడివేలు .ముత్తుస్వామి దీక్షితులు సోదరుడు బాలు స్వామి ఒక పాశ్చాత్యు నివద్ద వయోలిన్ నేర్చి రాజు కొలువులో వాయించగా వడివేలు ‘’మోహిని అట్టం ‘’ను సృష్టించి ఆడించాడు అప్పటివరకు కేరళలో కథాకళి మాత్రమే ఉండేది అదీ మగవారికి మాత్రమే పరిమితం .రాజు స్వాతి తిరుణాల్ తోకలిసి వడివేలు మోహినీ అట్టం ను సమగ్రంగా తీర్చి దిద్దాడు .దీనితో ఆడవారికి కూడా నాట్యం చేసే అవకాశం కలిగింది .
ఈ తంజావూర్ సంగీత చతుష్టయం సంస్కృత ,తెలుగు భాషలలో కృతులు ,వర్ణాలు అనేకం రాశారు .అందులో ముఖ్యమైనవి -నీలాంబరి లో అంబ సౌరాంబ, అంబ నీలాంబ ,పూర్వీకళ్యాణిలో -’’సాటిలేని ‘’.
429-72 మేళ కర్త రాగాలతో రాగమాలిక అల్లిన-మహా వైద్యనాధ శివన్ (1844-1893)
అలవోకగా మహా సంగీతం పాడే గొప్ప సంగీతకర్త మహా వైద్య నాధశివన్ 1844 లో తంజావూర్ జిల్లా వియచేరి గ్రామం లో పుట్టాడు .తండ్రి దొరైస్వామి అయ్యర్ గొప్ప సంగీతజ్ఞుడు .ఆనై అయ్యా బ్రదర్స్ వద్ద సంగీత శిక్షణ పొందాడు .తర్వాత త్యాగరాజస్వామి శిష్యుడు మానాంబు చావడి వెంకట సుబ్బయ్యర్ వద్ద మెళకువలు గ్రహించాడు .రాగాలాపనలో శివన్ శివమెత్తి స్తాడు .తమ్ముడు రామస్వామి శివన్ తో కలిసి కచేరీలు చేసి కర్ణాటక సంగీత తొలి జంటగా రికార్డ్ సృష్టించాడు .’’గుహదాస ‘’అనే ముద్ర తో రాశాడు . సంస్కృతం తెలుగు తమిళం లో చాలా కృతులురాశాడు .సంస్కృతం లో జన రంజని రాగం లో -’’పాహిమాం రాజ రాజేశ్వరి ‘’రాగమాలికలో -’’ప్రణతార్తి హర ప్రభో పురారే ‘’,నాగ స్వరాలిలో -’’శ్రీ శంకర గురువరం ‘’శివన్ సంగీత పాండిత్యానికి మచ్చు తునకలు . సారాంగిరాగతెలుగు కృతి -’’నీ కేల దయరాదు ‘’సుప్రసిద్ధమైనది .
430-’’జయతి జయతి భారత మాత ‘’దేశభక్తి గీతకర్త – మయూరం విశ్వనాధ శాస్త్రి (1893-1958)
తమిళనాడులోని మయూరం గ్రామం లో 1893 లో పుట్టినవిశ్వనాధ శాస్త్రి రచించిన దేశభక్తి గీతం ‘’జయతి జయతి భారత మాత ‘’తో సుప్రసిద్ధుడయ్యాడు .ఆనాడు పాడని కర్ణాటక సంగీత గాయకులు ఉండేవారుకాదు .నామక్కల్ నరసింహ అయ్యంగార్ ,కాసవాద్యం వెంకట రామ అయ్యంగార్ వంటి వద్ద సంగీతం అభ్యసించాడు .తెలుగు సంస్కృతాలలో 160 దాకా కృతులురాశాడు . 65 ఏళ్ళు జీవించి మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—