గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
431-లయకు ప్రాధాన్యమిచ్చిన -జి యెన్ బాల సుబ్రహ్మణ్యం (1910-1965)
జి యెన్ బి గా లబ్ధ ప్రతిష్ఠుడైన జి యెన్ బాల సుబ్రహ్మణ్యం తమిళనాడు మాయవరం లోని గుడలూర్ లో 6-1-1910జన్మించాడు తండ్రి నారాయణ స్వామి అయ్యర్ సంగీతజ్ఞుడు .అరియకపూడి రామానుజ అయ్యర్ మానసిక గురువు .లా పాసై మద్రాస్ లజ్ కార్నర్ లో లాయర్ గా బాగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు .ఇంగ్లిష్ లో బి ఏ ఆనర్స్ పాసై ,అన్నామలై యూనివర్సిటీలో సంగీతాన్ని టీఎస్ సబేష అయ్యర్ వద్ద అభ్యసించాడు .అనారోగ్యం వల్లా మానేసి మద్రాస్ యూనివర్సిటీలో డిప్లమా కోర్స్ చేసి ప్రిన్సిపాల్ టైగర్ వరదా చారి అభిమానం పొంది కచేరీ చేయ టానికి తగిన విద్వత్తు సాధించి 1928 లో మొదటి కచేరి చేశాడు .భామావిజయం సినిమాలోనూ ,శకుంతల సినిమాలో ఏం ఎస్ సుబ్బు లక్ష్మి తోను నటించాడు .జి యెన్ బి శైలికి ఏం ఎస్ ఆకర్షితురాలై మొదట్లో అదే బాణీలో పాడేది . తర్వాత సంగీతానికి అంకితమయ్యారు బాలు .సంస్కృత తెలుగు తమిళాలలో 250 కి పైగా కృతులు రాశాడు .కొత్తరాగాలు కనిపెట్టాడు వందలాదిమందికి సంగీతం బోధించి లెక్కలేనన్ని కచేరీలు చేశాడు .మద్రాస్ రేడియోలో కర్ణాటక సంగీత డెప్యూటీ చీఫ్ ప్రొడ్యూసర్ గా పని చేశాడు .అప్పుడు లలిత సంగీత ప్రొడ్యూసర్ గా మంగళంపల్లి బాలమురళీకృష్ణ , సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ కర్ణాటక సంగీత ప్రొడ్యూసర్ గా ఉండేవారు . 1964లో కేరళ తిరువనంతపురం లోని స్వాతి తిరుణాల్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . 55 ఏళ్ళ వయసులో 1-5-1965న మరణించాడు . గమకాలను తగ్గించి లయకు అత్యంత ప్రాధాన్యమివ్వడం తో జి యెన్ బి సంగీతం కర్ణ పేయంగా ఉండేది .
సంస్కృతం లో ఆయన రాసిన -మోహనరాగం లోని -’’భువనత్రయ’’,నాట రాగం లో -’’కరిముఖ వరద ‘’,పూర్వి కల్యాణిలో -’’మధురాపురి కల్యాణి ‘’,మోహన లో ‘’సదా పాలయ సారసాక్షి ‘’సరస్వతిరాగం లో -సరస్వతి నమోస్తుతే ‘’,శివ శక్తిరాగం లో -’’చక్రరాజ నిలయే ‘’,కామ వర్ధనిలో -’’శివానంద కామవర్ధని ‘’,హంసధ్వనిలో -’’వరవల్లభ రామ ‘’కృతులకు సంగీత సాహిత్యాలతో ప్రాణ ప్రతిష్ట చేశాడు .
432- భావ ,లయలకు ప్రాణం పోసిన -ఏం డి బి రామనాధన్ (1923-1984)
ఏం డి బి గా ప్రసిద్ధుడైన మంజప్ర దేవేశ భాగవతార్ రామనాథన్ 20-5-1923 న తమిళ నాడు లోని పాలకాడు జిల్లామంజప్ర గ్రామం లో జన్మించి ,భావ లయాలకు ప్రాధాన్యమిచ్చిన వాగ్గేయకారుడిగా పేరుపొందారు .తండ్రి దేవేశ భాగవతార్ సంగీత ఉపాధ్యాయుడు .పాలక్కాడు విక్టోరియాకాలేజిలో చదివి ఫిజిక్స్ లో డిగ్రీ పొంది ,మద్రాస్ వచ్చి తండ్రివద్దనే సంగీత మర్మాలు గ్రహించాడు .అదే సమయం లో రుక్మిణి అరండేల్ కళాక్షేత్రం లో సంగీత శిరోమణి కోర్స్ 1944 లో ప్రారంభిస్తే మొదటి బాచ్ కి ఎన్నికైన ఏకైక విద్యార్థి మన ఏం డి బి ఒక్కడే .అక్కడి గురువు టైగర్ వరదాచారి ముఖ్య ఏకైక శిష్యుడై సంగీత0 తో మరీ దగ్గరయ్యాడు .అక్కడే అసిస్టెంట్ గా చేరి సంగీత ప్రొఫెసర్ అయి కళాక్షేత్ర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు . నెమ్మదిగా పాడటం ప్రారంభించి శ్రోతలను తనతోపాటు తీసుకువెడుతూ సాహిత్యం లోని అందాలను అనుభవించేట్లు చేయటం ఈయన ప్రత్యేకత .కధాకళీ లోని విలంబిత కాలగానం తనను బాగా తీర్చి దిద్దిందని చెప్పేవాడు ..ప్రముఖుల కృతులు పాడేటప్పుడు సాహిత్యాన్ని మార్చిపాడి విమర్శకు గుయారయ్యేవాడు .మరో ప్రత్యేకత అనుపల్లవితో ప్రారంభించి తర్వాత పల్లవి పాడటం .ఇది బాగా నచ్చేది అందరికి ..మూడుభాషలలో 300 కుపైగా కృతులురాశాడు . 1984 ఏప్రిల్ 27 న 61 ఏళ్ళవయసులో చనిపోయాడు .
ఏం డి బి రచించిన సంస్కృత కృతులు -బేహాగ్ రాగం లో -’’భజభజ మనుజ ‘’,ఆరభిలో -భారతేశ నుతే ‘’,శ్రీ రాగం లో -’’దుర్గాదేవి ‘’,హంసధ్వనిలో -’’గజవదన ‘’కానడ లో -’’గురు చరణం ‘’,ధన్యాసి లో ‘’గురువారం భజ మనసా ‘’,ధీర శంకరాభరణం లో -’’జనని నతజనపాలి ని ‘’-బాగేశ్వరిలో -’’సాగర శయన విభో ‘’,కాపీరాగం లో తిల్లాన ,కేదారం లో-’’త్యాగరాజ గురుం ‘’,
1974లో పద్మశ్రీ ని కేంద్ర సంగీత అకాడెమీ పురస్కారాన్ని ,1976 లో సంగీత శిఖామణి ,1983 లో సంగీత కళానిధి బిరుదు పొందాడు .
433- సంగీత దర్పణ కర్త -వి . రామ నాథం (1917 -2008 )
సంగీత కళాకారుడు రచయితా టీచర్ ప్రిన్సిపాల్ వి రామనాధం 1917 లో జన్మించి 70 ఏళ్ళు సంగీత 0లో మునిగి తేలి 2008 లో చనిపోయాడు .మైసూర్ సంగీతరత్న శిష్యుడై ,మైసూర్ యూనివర్సిటీ మ్యూజిక్ డాన్స్ కాలేజీ మొదటిప్రిన్సిపాల్ అయి 1987 లో రిటైరయ్యాడు .సుమారు 25 కృతులు సంస్కృత తెలుగు కన్నడాలలో రాశాడు . 3 గ్రంధాలు స్వయంగా కానీ ఇతరులతోకలిసి కాని రాశాడు .కర్ణాటక సంగీత శాస్త్రం పై విలువైన గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి -సంగీత దర్పణం ,కర్ణాటక సంగీత సుధ,సంగీత శాస్త్ర పరిచయం ,కర్ణాటక సంగీత లక్ష్య లక్షణ సంగ్రహం ,అపూర్వ వాగ్గేయ కృతిమంజరి మొదలైనవి ..
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
––