గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)
1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం ఏ డిగ్రీ సాధించింది .అడ్వొకేట్ ఇహ్తేషామ్ ఆబిదీ ని వివాహం చేసుకున్నాక దంపతులు వారణాసి లో కాపురం పెట్టారు .. మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ నుంచి పి హెచ్ డి పొందింది .ఆమె ధీసిస్ ‘’వేద సాహిత్యం లో అశ్వినుల రూపం ‘’రాసి ప్రచురించింది
2005 లో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో చేరి ,జీతం లేకుండా లెక్చరర్ గా పని చేసింది .తర్వాత మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్ లో రోజు వారీ వేతనం పై పార్ట్ టైం లెక్చరర్ చేసింది .సంస్కృత లెక్చరర్ గా పని చేసిన మొట్టమొదటి ముస్లిం సంస్కృత విద్యా వేత్తగా రికార్డ్ పొందినా ,ఉద్యోగం లో వివక్షతకు గురై ఇబ్బందిపడింది 2008 లో మొదటిపుస్తకం ‘’సాంస్క్రిట్ సాహిత్యమే రహీం ‘’ సంస్కృత సాహిత్యం లో లోతులు తరచిన అబ్దుల్ రహీం ఖాన్ -ఏ ఖానా పై రాసింది .తర్వాత పుస్తకం మీర్జా గాలిబ్ రాసిన ‘’చైరాగ్ ఏ ధైర్ ‘’ను సంస్కృతం లో ‘’దేవాలయస్య దీప ‘’గా అనువాదం చేసింది . మూడవ పుస్తకం 50 ఉపనిషత్తుల ను మొగల్ యువరాజు దారా షికొ పర్షియా భాషలోరాసినదానికి హిందీ అనువాదం ‘’సిర్ర్ ఏ అక్బర్ ‘’. దారా పెర్షియన్ భాషలో అనువదించిన వేదాంత గ్రంధానికి , దారా రాసిన సూఫీ గ్రంధాలకు హిందీ అనువాదం చేసింది . నహీద్ అబీదీ భర్త , పిల్లలతో కాశీలోని శివపురిలో కాపురం ఉంటోంది .
నహీద్ సంస్కృత సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2014లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసి సన్మానించింది .లక్నో యూనివర్సిటీ ‘’డి .లిట్ .ఇచ్చి గౌరవించింది .సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ఆమెను ఎక్సి క్యూటివ్ కౌన్సిలర్ ను చేసి0ది .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం డా నహీద్ అబీదీ కి ‘’యష్ భారత్ ‘’పురస్కారమిచ్చి 11 లక్షల నగదు అంద జేసింది . 2007లో రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం ఆమెను రాష్ట్ర పతి భవనానికి ఆహ్వానించి సత్కరించారు .
సశేషం
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—