గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద (క్రీపూ 8 -క్రీశ 44 )
కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . . కనుక గ్రామనామమే ఆయన పేరు అయి ఉంటుంది .క్రీ పూ 8 లో పుట్టి 33 వ ఏట జైన మతాచార్యుడై 52 ఏళ్ళు ఆచార్యత్వం లో ఉండి 85 ఏళ్ళు జీవించి క్రీశ 44 లో నిర్యాణం చెందాడు .రెండవ భద్రబాహు ,అర్ధబలి ,జినసేనుల సమకాలికుడు అంటారు ..బోధ ప్రహుదా లో తాను భద్ర బాహు శిష్యుడనని చెప్పుకొన్నాడు . ఈ భద్రబాహు క్రీపూ 37-14 వరకు జీవించాడు . జైనం లో స్వేతాంబర దిగంబర మూల సంఘానికి నాయకుడు . . ఆయన రాసిన గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందాయి .జైన మతాచార్యులలో మహావీరుడు ,గౌతమగంగాధరుని తరవాత స్థానం కుంద కుంద దే . స్వయం కృషితో దిగంబర జైన దర్శనాలను సృజించిన మేధావిగా వినుతికెక్కాడు . దిగంబర జైనులు మహావీర , గౌతమగంగాధర లతోపాటు కుంద కుంద ను స్మరించి ధన్యులౌతారు . ‘’మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమమ్ గని -మంగళం కుంద కందాయ జైన ధర్మో స్తు మంగళం ‘’ అని జైనులు స్మరిస్తారు . భద్రబాహు ,విశాఖ లకంటే ఉన్నతస్థానాన్ని కుంద కుంద కు కల్పించారు .అంతటి ప్రతిభా సంపన్నుడు . ఆయన రాసిన’’ ప్రవచన సార’’లో సత్యానికున్న రెండు పార్శ్వాలను చెప్పాడు 1-వ్యావహారన య -అంటే మొహం 2-నిశ్చయాయన అంటే పారమార్ధం లేక శుద్ధ సత్యం .
ప్రాకృత భాషలో కుంద కుంద రాసిన గ్రంధాలు మూడు రకాలు -మొదటి వర్గం లోనివి -సారం కలవి -1-నియమసార -ఇందులో 187 శ్లోకాలున్నాయి 2-పంచస్తికయ సార లో 153 శ్లోకాలున్నాయి . 3-సమయసార -లో 439 శ్లోకాలున్నాయి 4-ప్రవచనసార -లో 275 శ్లోకాలున్నాయి .
రెండవ రకం లో -జైన ఆచార్యులపై భక్తిపూర్వకం గా రాసిన శ్లోకాలు ,జైన గ్రంధాలపై రాసినవి సాధకులు పాటించాల్సిన నియమాలు ఉంటాయి -వీటినే చరిత భక్తి ఉన్న శ్లోక కదంబంఅంటారు . .వీటిని స్వే తాంబర దిగంబర జైనులు నిత్యపూజా విధానం లో విధిగా పఠిస్తారు ,పాటిస్తారుకూడా .
మూడవ రకానికి చెందిన వాటిని ‘’ప్రభ్రత’’అంటారు -ఇందులో 8 చిన్న చిన్న గ్రంధాలున్నాయి .ఇవి పూర్వీకులు రాసిన వాటి నుండి సేకరింపబడినవి – వీటిలో దర్శన ప్రభృతలో 26 శ్లోకాలు చరిత ప్రభృతలో 44 ,సూత్ర ప్రభృత లో 27 శ్లోకాలు అలాగే మిగిలినవాటిలోనూ ఉన్నాయి .అనేక జైన గ్రంధాలలో కుంద కుందా చార్య 84 ‘’పాహుర్ ‘’లు రాసినట్లు ఉంది .కానీ అన్నీ లభ్యం కాలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-17- కాంప్-షార్లెట్-అమెరికా
––