గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
440- షట్కా0డాగమ కర్త -ఆచార్య భూతబలి (క్రీశ 66-90 )
క్రీశ 66 లో జన్మించి 90 లో సిద్ధి చెందిన స్వేతాంబర దిగంబర జైనా చార్యుడు భూతబలి . ఈయన ‘’షట్కా0డ ఆగమ0 ‘’ను పుష్పదంతా చార్యునితో కలిసి ప్రాకృత భాషలో రచించాడు .మధుర ప్రాంతం లో జైన మత వ్యాప్తికి గొప్ప కృషి చేశాడు .జైనుల అయిదవ గ్రంథ మైన ‘’శృతి పంచమి ‘’లో భూతబలి పుష్పదంతాచార్యులకు ప్రతి ఏడాది సంస్మరణ ఉత్సవాలు చేస్తున్నట్లు ఉంది .ఈ జంట ఆచార్యులు ‘’కాశయ పహూద ‘’అనే గ్రంథం కూడా రాశారు ..దీన్ని వాంఛా గ్రంథం (ట్రిటైజ్ ఆన్ పాషన్ ) అన్నారు.
క్రీశ మొదటి శతాబ్ది వాడైన దిగంబర పుష్పదంతాచార్య భూతబలితో కలిసి షట్కా0డ ఆగమం ‘’రాశాడు .
4 వ శతాబ్ది గుణ భద్రుడు జైన సేనునితోకలిసి ‘’మహా పురాణం ‘’రాశాడు
8 వ శతాబ్ది దిగంబర జైనాచార్యుడు అపరాజిత దిగంబర జైనులు దిగంబరంగా ఉండటాన్ని పూర్తిగా సమర్ధించాడు .దిగంబరంగా ఉండటం అంటే బట్టలు లేకుండా ఉండటం మాత్రమేకాదని ,కోరికలను ,వస్తువులను పూర్తిగా విసర్జించటమే నని బోధించాడు
441-సంస్కృత వ్యాప్తి చేస్తున్న ముస్లిం సంస్కృత పండితుడు -పండిట్ దస్తగిరి (1935 )
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా శిఖాల్ గ్రామం లో పండిట్ దస్తగిరి జన్మించాడు .అక్కడే సెకండరీ విద్య పూర్తి చేసి ప్రభుత్వ సంస్కృత కళాశాలో చేరాడు . 50 మంది బ్రాహ్మణ విద్యార్థులమధ్య తానొక్కడే ముస్లిం విద్యార్థిని అని చెప్పుకొన్నాడు .కానీ సంస్కృత గురువు తనపై ప్రత్యేక అభిమానం తో శ్రద్ధతో చక్కగా బోధించి తీర్చిదిద్దాడని కృతజ్ఞతతో చెప్పాడు .అక్కడే ఆయనే వేదాలు శాస్త్రాలు వగైరా క్షుణ్ణంగా నేర్పాడని పొంగిపోయాడు దస్తగిరి . ‘’1950 లోబొంబాయి చేరి మరాఠా సంస్థాన్ నిర్వహణలో ఉన్న ‘’మరాఠీ మీడియం ఓర్లి హై స్కూల్’’లో సంస్కృత ఉపాధ్యాయుడిగా చేరి అన్ని తరగతులకు సంస్కృతం బోధించాడు
ఇండియాలో ఎమెర్జెన్సీ పూర్తయి ,జనతా ప్రభుత్వం ఏర్పడ్డాక తాను జనసంఘ్ ఆర్ ఎస్ ఎస్ లను ఏదో నెపం తో సమర్ధిస్తున్నాని అనుమానించి విచారణ జరిపి అది శుద్ధ అబద్ధమని తేల్చారని తన నిజాయితీని ప్రశంసించారని తెలియ జేశాడు దస్తగిరి .
1980 లో ఇందిరా గాంధీ మళ్ళీ ప్రధాని అయ్యాక దస్తగిరిని పిలిపించి ఆయన మహమ్మద్ ప్రవక్త వంశీకుడైన సదవంశస్తుడు అని గ్రహించి ,1982 లో ఆయనను ‘’రాష్ట్రీయ సంస్కృత ప్రచారకునిగా నియమించేట్లు విద్యా శాఖను ఆదేశించిందని ,వాళ్ళు కక్కా లేక మింగా లేక నీళ్లు నములుతుంటే ,ముందు ఉద్యోగంపూర్తి స్వతంత్రం తో ఇచ్చి తర్వాత ఆయన పని తీరును చూడమని హెచ్చరించింది .ఆమె తనను కలవటానికి చాలాసార్లు వచ్చిందని తానుకూడా తరచుగా కలిసేవాడినని అన్నాడు . 50 వ ఏటా1987 లో సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందాడు .రిటైర్ అయ్యేదాకా సంస్కృతం బోధిస్తూ హిందుత్వానికి ఇస్లా0 కు ఉన్న పోలికలను వివరిస్తూ ప్రపంచం లో అతిప్రాచీన భాషఅయిన సంస్కృతం యొక్క ఉత్కృష్టతను వివరిస్తూ బోధన సాగించాడు పండిట్ దస్తగిరి .రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అన్ని పీఠాల శంకరాచార్యులు తనకు అత్యంత గౌరవం ఇస్తున్నారని తమలో ఒకనిగా భావిస్తూ ఆదరిస్తున్నారని గర్వంగా చెప్పుకొన్నాడు పండిట్ దస్తగిరి .సంస్కృతం పైన ఉన్నమక్కువ ఆయనను ఇస్లా0 కుదూరం చేయలేదు ‘.తనలాగా చాలామంది ముస్లిం సంస్కృత పండితులు దేశం లో ఉన్నారని కానీ వారు ఆర్ధికంగా వెనకబడి ఉండటం తో ముందుకు రాలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశాడు దస్తగిరి .భార్య వహీదా గొప్ప సహకారాన్నిస్తోంది .కొడుకు బడీ ఉజ్జమా సంస్కృత స్కాలర్ .కూతురు గ్యాసున్నీసా షోలాపూర్ లో సంస్కృత రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తోంది . ధన్యమైన కుటుంబం పండిట్ దస్తగిరిది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-17- కాంప్-షార్లెట్-అమెరికా
––
గబ్బిట దుర్గా ప్రసాద్