గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
444-క్రీస్తు భాగవత మహాకావ్య కర్త -పి. సి . దేవాస్సియా -(1906-2006 )
కేరళకు చెందిన సంస్కృత కవి ,మహా విద్వా0సుడు పి. సి . దేవాస్సియా 1906 లో జన్మించి నూరేళ్ళ నిండుజీవితం గడిపి2006 లో మరణించాడు .ఆయన రచించిన క్రీస్తు భాగవత మహాకావ్యం బహు ప్రశస్తి చెంది ఎన్నో పురస్కారాలను అందించింది .ఇది 1976 లో రాస్తే 1977 లో ప్రచురితమైంది . 33 కాండలలో 1600 శ్లోకాలతో 433 పేజీల కావ్యం ఇది .సంస్కృత మహాకావ్య లక్షణాలన్నీ ఉన్నకావ్యం . 33 కాండాలు యేసు క్రీస్తు జీవించిన 33 ఏళ్లకు ప్రతీక కావచ్చు .ప్రతి సంస్కృత శ్లోకం తర్వాత ఇంగ్లిష్ అనువాదం కూడా ఉండటం ప్రత్యేకత . మూడు పేజీల ఉపోద్ఘాతం లో కవి ఈ రచనకు ఐదేళ్లు పట్టిందని తెలిపాడు .బైబిల్ ను ఏదో ఆషామాషీగా సంస్కృతం లోకి మార్చటం తనఉద్దేశ్యంకాదని మహా కావ్యంగా దాన్ని మలచటమేధ్యేయమని కవి చెప్పుకొన్నాడు . దీనికి వి రాఘవన్ ముందుమాటలు వ్యాఖ్యానం రాస్తే ,కుంజున్నిరాజా ప్రశంసా వాక్యాలు రాసి కావ్య గౌరవం కల్గించారు K. R. Srinivasa Iyengar wrote that “The Gospel-story is retained in essentials, but…
…the sonority of Sanskrit gives a fresh morning splendour and resonance to Jesus’ divine ministry. Mary held Joseph’s hand as Arundhati did Vasishtha‘s; Just as Vasudeva hid his son Krishna in Nanda‘s house, so did Joseph take Jesus to Egypt for his safety; Lazarus‘ sisters embraced him as he emerged out of his tomb, even as Devayani embraced Kacha as he revived after death…. in betraying Jesus with a kiss, wasn’t Judas anticipating Godse who was to kill the Mahatma after first saluting him? The similes come naturally, and rather bring out the basic unity of texture that binds all human history.[3]:xvii
అని మెచ్చాడు
ఈ కావ్యానికి 1979 లో మహారాణి సేతు పార్వతీబాయి అవార్డువచ్చింది ,. 1980 లో సంస్కృత రచనకు దేవాస్సియా కు సాహిత్య అకాడెమి పురస్కారం ఇచ్చింది .
ఈ కావ్య శ్లోక శోభచూద్దాం
‘’భిక్షా త్వయ దక్షి జహాస్ట దత్తా నా జీవియాత్రాహ్ వామకరైజ తేస -ధన్యస్య చైవం నిభృతాం కృతస్య పితా ఫలం దాశ్యతి గుప్తా దర్శి’’-
‘’యువ0 మా సై కి నూత నిధిమ్ ఆత్మార్థం ఉర్వ్యం హి యస్మాత్ -కిటిద్యాస్ తం కాయం ఉపనయన్తి అత్ర మూల్జంతి చౌరాసి స్వర్గ తన్ – సైల్చింయుత విభవిం యేహి తైర్ న హ్రి యంతే విత్తం యస్మిన్ భవతి భువనే తత్ర చిత్తం చ వైల్సితే . ‘’
‘’క్వ మే నిర్వియాతి బుద్ధిహ్ క్వ శ్రియే సుమహి కది -మోహిద్ భువి మై రురుక్తి జుర్ లిమాయివి మహి గిరిమ్ ‘’
‘’కిరు ఫ్జతి ద్రమతే క్రమస్వ భో అపరిధమ్ కృతం ఏ భిర్ ఇద్రసం -యద్ ఇమే నా విదుహ్ స్వకర్మ వినా చ వీ త్వ త్కరు ప్జిమ్ అపి ప్రభో ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-17-కాంప్-షార్లెట్-అమెరికా
—