దసరా నవరాత్రి సందర్భంగా 57 వ శ్రీ సుందరకాండ పారాయణ
21-9-17గురు వారంఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 30-9-17 శనివారంఆశ్వయుజ శుద్ధ దశమి వరకు దసరా నవరాత్రి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో ప్రతి రోజు ఉదయం -6-30 గం నుండి నా 57 వ సుందరకాండ (షార్లెట్ లో 3 వ పారాయణ )తొమ్మిది రోజుల పారాయణ ,21-9-17 గురువారం ,25-9-17 సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మా దంపతులచే నిర్వహింప బడుతోందని తెలియ జేస్తున్నాము .
కార్య క్రమ వివరం
21-9-17 గురువారం -ఉదయం 6-30 గం నుండి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,శ్రీ లలితా అష్టోత్తర ,శ్రీ దుర్గ అష్టోత్తర ,శ్రీ సరస్వతీ అష్టోత్తర ,శ్రీ గాయత్రీ అష్టోత్తర ,శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర పూజ ,తరువాత మహాన్యాస పూర్వక నమక చమకాలతో ,దశశాంతి ,సామ్రాజ్య పట్టాభిషేకం తో అభిషేకం ,శివ అష్టోత్తర సహస్ర నామ పూజ ,బిల్వాస్టోత్తర పూజ జరుగు తుంది .
22-9-17 శుక్రవారం -నుండి-30-9-17 శనివారం వరకు ఉదయం 6-30 నుండి పై విధంగానే నిత్యం అయ్యవార్లకు అమ్మవార్లకు పూజ -అనంతరం 9 రోజుల శ్రీ సుందర కాండ పారాయణ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ జరుగుతుంది .
24-9-17 ఆదివారం మాత్రం శ్రీ రాంకీ తమ్ముడు పవన్ ఇంట్లో ఉదయం 7-30 కు శ్రీ రుద్రాభిషేకం ఉందని చెప్పటం వలన -మా ఇంట్లో పూజ, ,పారాయణ ఉదయం 4-గం నుండి 6-30 వరకు జరుగు తుంది .
25-9-17 సోమవారం -పై విధంగానే నిత్యపూజ తోపాటు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పై విధంగానే జరుగుతుంది తర్వాత యధాప్రకారం శ్రీ సుందర కాండ పారాయణం ,శతక పఠనం స్వామి వార్ల అనుగ్రహం తో జరుగుతుందని తెలియ జేస్తున్నాను . దుర్గాప్రసాద్