వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1
,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1
25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం లో మంత్రాలు చదవటం తో ‘గాత్రానికి ‘’కించిత్ అసౌకర్యం ‘’కలిగి బొంగురు మాట వచ్చింది హాల్స్ ఆరాగా ఆరాగా చప్పరించి ఉపశమనం పొందాను .. వీక్లీ అమెరికా 25 లో రెండుభాగాలు రాశాను
మంగళవారం – నిత్యపూజతో పాటు అమ్మవారి అష్టోత్తరాలూ రోజూ చేస్తున్నట్లే చేసి అయ్యవారి అష్టోత్తర సహస్ర నామ పూజ ,సుందరకాండ అయిదవ రోజు పారాయణ పూర్తి చేశాను .సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి కుమార్తె చి బిందు దత్తశ్రీ బి టెక్ ఫైనల్ ఇయర్ లో టి సి ఎస్ వాళ్ళ కాంప్ సెలెక్షన్ సాధించిందని మెయిల్ పెడితే శుభాశీస్సులు పంపాను .కస్టపడి చదివి సాధించినందుకు అభినందించాను ..
బుధవారం -సరస్వతీ పూజ -పై విధంగానే పూజ అంతరం ఆరవ రోజు సుందర కాండ పారాయణ పూర్తి చేశాను .సోమవారం నుండి ఈ రోజు వరకు గొంతుకు ఇబ్బందికాకుండా చాలా సైలెంట్ గా పూజ ,,పారాయణ చేశాను . .
28-9-17 గురువారం -ఇవాళ మౌంట్ సోమాలో చండీ హోమం కు మా అల్లుడితో పాటూ మేమూ వెళ్లాలని మా అమ్మాయి చెప్పటం ,ఈ రోజుదుర్గాష్టమి నాడు మా నాయనమ్మగారి’’ తిధి’’ అవటం వలన రాత్రి 2-30 కే లేచికార్యక్రమాలు పూర్తి చేసి తెల్లవారుఝామున 3 గంటలకుసంధ్యావందనం నిత్యపూజ ,7 వ రోజు సుందరకాండ పారాయణ ఉదయం 6 గంటలకు పూర్తి చేశాను .
మా నాయనమ్మ గారి ఆబ్దికం
6 గంటలకు నేను ఇండియానుంచి తెచ్చుకొన్న ఆబ్దిక మంత్రాల పుస్తకం తీసుకొని మంత్రాలు చదువుకొంటూ ,మానసికంగా మా మామ్మ నాగమ్మగారికి ఆబ్దిక విధి నిర్వహించాను . అన్నసూక్తం అధిశ్రవణం కూడా చదివి అంతా అయ్యేసరికి ఉదయం 7-30 అయింది .తర్వాత రామకోటి రాసి భగవద్గీత చదివి ,డైరీ రాసేసరికి 8 అయింది .మా శ్రీమతి నాతోపాటు లేచి లలితా పారాయణం చేసి రెడీ గా ఉంది .మా అమ్మాయి యధాప్రకారం వంట చేసి 8 గంటలకు ఆఫీస్ కు వెళ్ళింది.దేవుడి నైవేద్యం పెరుగులోనానేసిన అటుకులు ఫలహారంకొద్దిగా చేసి మందులు వేసుకొని మౌంట్ సోమాకు సిద్ధంగా ఉన్నాం
మౌంట్ సోమా లో చండీ యాగం
మేమిద్దరం మా అల్లుడూ కారులో ఉదయం 9-15 కు బయల్దేరి 12-30 కు మౌంట్ సోమా చేరాం .మేమిద్దరం మాతో తెచ్చుకొన్న కూర ,పచ్చడి అన్నం దారిలోనే కారులోనే తినేసాం . అక్కడ హోమం అక్కడిశ్రీ సోమేశ్వర శివాలయం అర్చకులు శ్రీ గారపాటి ప్రసాదావధాని గారు ,శ్రీమతి అనసూయ దంపతులు యాగ శాలలో నిర్వహిస్తున్నారు .కార్యక్రమం వారనుకొన్న సమయానికే ఆదాయం 11-30 కు ప్రారంభించారు .మా అల్లుడిని హోమద్రవ్యాలను అగ్నిలో వ్రేల్చటానికి ,అర్చకస్వామినియోగించారు .నేను పట్టుబట్టలు కట్టుకొని ఊరికే ప్రక్కన కూర్చున్నాను . 13 ఆవృత్తాలతో హోమం జరిగింది .ప్రతిసారి గారెలు చెరుకు ముక్క చిన్న గుమ్మడికాయ దానిమ్మపండు ,పుష్పాలను తమలపాకులతో పెట్టి ఆవృత్తం అవగానే హోమ లో వేశారు .ఇలా 13 సార్లు చేశారన్నమాట చివరికి ప్రకృతిలోని మనలోనూ ఉన్న వ్యతిరేక శక్తులను కూడా శాంత పరచటానికి ‘’కూష్మా0డ బలి ‘’ఇచ్చారు. తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు అంతా అయ్యేసరికి సాయంత్రం 5 అయింది ‘.ప్రసాదం గా గారెలు ,పులిహోర . దేవాలయం ప్రక్కనే శ్రీ ఆంజనేయస్వామి పెద్ద సైజు నల్లరాతి శిలా విగ్రహం ఉన్నది .దూరంగానే చూసి నమస్కరించాను
ఈ శివాలయం నిర్మించిన అమెరికన్ దంపతులు ,మరి కొందరు స్థానిక అమెరికన్ లు ,హిందూ భక్తులు అయిదున్నర గంటలు జరిగిన హోమం లో చాలా భక్తి శ్రద్ధలతో కదలకుండా కూర్చోవటం అత్యాశ్చర్యమేసింది
హోమం పూర్తికాగానే మా నాయనమ్మగారిని తలచుకొని అర్చకులు ప్రసాదావధానిగారి చేతిలో తాంబూలం దక్షిణ పండ్లు పెట్టి నమస్కరించి సంతృప్తి చెందాను .ఈ రకంగా మా నాయనమ్మ గారి ఆబ్దికం ఇక్కడ నెరవేరింది .
తర్వాత అందరం శివాలయానికి వెళ్లాం .అర్చకస్వామి యధా విధిగా పూజ పూర్తి చేసి ఆ దంపతులు ,మా దంపతులకు దంపతి పూజగా నూతన వస్త్రాలుసమర్పించి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించి ఆశీస్సులు అందుకొన్నారు .ఇది మేము ఊ హ్హించని విషయం .విజయదశమినాడు మా అమ్మాయి పుట్టిన రోజు కనుక మా అమ్మాయికి కొత్త చీర జాకెట్ ఇచ్చారు
తర్వాత వారింటికి ఆహ్వానించి మా ముగ్గురకు భోజనం పెట్టారు పప్పు ,బీన్స్ కూర అల్లం చట్నీ ,పరవాన్నం పులిహోర గారే లతో భోజనం . ఏదో తిన్నానని పించాను .సాయంత్రం 6-15 కు బయల్దేరి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరాం .ఫోటోలు నెట్ లో పెట్టి నిద్రకు ఉపక్రమించాను
అలసట తో మాంచి నిద్ర పట్టింది
29-9-17 శుక్రవారం -లలితా పారాయణ ,భజన
ఉదయం 8 వ రోజుసుందరకాండ పారాయణ పూర్తి చేశాను .సాయంత్రం 6 గంటలకు మా అమ్మాయి సామూహిక కుంకుమ పూజ ఏర్పాటు చేసింది .నేనే అందరి చేతా చేయించాను 25 మంది మహిళలు భక్తి తో పాల్గొన్నారు . అందరికి ఒక ప్రత్యేక ప్లాస్టిక్ పెద్దపళ్లెంఅందులో ప్లాస్టిక్ భరిణె లో కుంకుమ మరొక దానిలో అక్షింతలు ,పూలు ఒక డాలర్ కాయిన్ ఏర్పాటు చేసింది కాయిన్ కు కుంకుమ బొట్టు పెట్టి ,అమ్మవారిగా భావించి పూజ జరిపించాం ,తర్వాత అందరూ కలిసి శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేశారు .7గంటలకు పూజ పూర్తయింది .
సరిగ్గా రాత్రి 7 గంటలకు భజన మొదలు పెట్టారు .గంటసేపు అమ్మవారి కీర్తనలు సాయి నామం తో కలిపి చేశారు . 8గంటలకుభజన పూర్తయింది .అక్టోబర్ 1 ఆదివారం సరసభారతి కార్యక్రమం లో నూ 8 వతేదీ ఆదివారం హిందూ సెంటర్ లో కూచిపూడి నాట్యాచార్యులు ప్రదర్శిస్తున్న ‘’కీచకవధ ‘’కార్యక్రమంలో అందరూ తప్పక పాల్గొనాలని చెప్పాం
రేపు విజయదశమినాడు మా అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా మామమ్మాయి విజ్జికి గ్రంధి హరి గారి భార్య విజయ లక్ష్మిగారికీ జాయింట్ గా జన్మదిన శుభా కాంక్షలు అందరూ తెలియ జేశారు
తర్వాత విందు . చపాతీ ,బంగాళాదుంప కాస్టికం కూర ,చానామసాలా కూరా రవ్వకేసరి మరొక స్వీట్ ,చక్రపొంగలి ,పులిహార కర్వేపాకు పులిహోర ,టమాటా ఊరగాయ ,సాంబారు ,పెరుగన్నం.అన్నీ బాగానే ఉన్నాయి సుమారు 45 మందిదాకా విందు ఆరగించారు . తర్వాత నేను కట్టిన రామరాజు పంచె ఉత్తరీయం చూసి శ్రీమతి గోసుకోండ అరుణ ‘’అంకుల్ మీరు పెదరాయుడు పో జు పెట్టండి .నేను ఫోటో తీస్తా ‘’అంటే పురజనులకోరికపై ఆ పోజు పెట్టగా అరుణ దంపతులు ,పవన్ దంపతులు ,మాఅమ్మాయి మాతో ఫోటోలు దిగారు .’’నాకు దిష్టి తగులుతుందేమో నని అనుమానం గా ఉంది బాబూ ‘’ .
కదంబం కు స్పందన బాగానే ఉందనిపవన్ చెప్పాడు చాలా సంతోషమేసింది .సాయి పవన్ భార్య కు ‘’మా అన్నయ్య ‘’ డాశ్రీమతి భావన గారికివారి అమ్మగారి ద్వారా ‘’శతకం ‘’అందజేశాను . రాత్రి 10-30 కి ప్రముఖ గాయని శ్రీమతి ఉష గారి అక్కగారు వచ్చి భక్తిగా అమ్మవారి పై పాటలు పాడారు .అదే సమయం లో ఇండియానుంచి ఉషగారు ఆమె కు ఫోన్ చేశారు ఆమెతో మా శ్రీమతి మా అమ్మాయి ఆవిడ ఫాన్ లమని గర్వం గా చెప్పారు .
30-9-17 శనివారం -యధావిధిగా పూజ అయ్యాక 9 వ రోజు చివరి రోజు సుందరకాండ పారాయణ పూర్తి చేసి సరికిఉదయం 10-45 అయింది . ఇది నా 57 వ్యాపారాయణ .షార్లెట్ లో 3 వ పారాయణ .
శ్రీ డొక్కా రామ్ గారు ఆస్టిన్ నుంచి పంపిన ఆత్మానందం ఆత్మారామం పుస్తకాలు అందాయి .అందినట్లు మెయిల్ ద్వారా తెలియజేసి గీర్వాణం -2 ఆయనకు పంపిస్తున్నానని రాశాను .
ఇవాళ విజయ దశమి నాడు మా అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా మా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ప్రత్యేక పూజ ,చక్రపొంగలి రవ్వకేసరి పులిహోర ప్రసాదాలు చేయించాడు మా అబ్బాయి రమణ . మా మూడవ అబ్బాయి మూర్తి రాణి దంపతులు కూర్చుని సాయంత్రం శమీ పూజ నిర్వహించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-17 -కాంప్-షార్లెట్- అమెరికా
.
గబ్బిట దుర్గా ప్రసాద్