షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం
సాహితీ బంధువులకు శుభవార్త . 1-10-17 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబ 0 ”దిగ్విజయంగా మధ్యాహ్నం 2- 30 నుండి రాత్రి 7-30 వరకు నాన్ స్టాప్ గా 5 గంటలసేపు జరిగి చరిత్ర సృష్టించింది .ఇందులో ప్రసంగాలు కవితలు పాటలు సంగీతం హాస్యం లు చిందులు తొక్కాయి .ప్రముఖ కూచి నృత్య దర్శకులు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు అనుకోని అతిధిగా విచ్చేసి నిండుతనం చేకూర్చారు వీరికి సరసభారతి నూతన వస్త్రాలు శాలువాకప్పి 2 ,116 రూపాయలు నగదును బహూకరించి పండిత సత్కారం చేసింది ,ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కవి మధుకీలకావ్యకర్త రవీంద్రుని శిష్యులు దేశభక్తి గీతకర్త స్వర్గీయ శ్రీ మల్లవరపు విశ్వే శ్వరరావు గారి కుమారుడు శ్రీ శివ కుమార్ , గరివిడి సంగీతం మాస్టారు శ్రీ మోకురాల మూర్తిగారు ఆత్మీయ అతిధులు గా సభకు సార్ధకత కూర్చారు .ఒకరకంగా సరస సంగీత సాహిత్య నృత్య వేదిక గా కార్యక్రమం ఆద్యంత రసప్రవాహమై నడిచి నభూతో న భవిష్యతి అని పించి రికార్డ్ సృష్టించింది. అందరిలో చైతన్యం కట్టలు తెంచుకొని ప్రవహించింది . గొప్ప సంతృప్తినిస్ఫూర్తి ప్రేరణలను కలిగించింది . ఉగాదికి కూడా ”ఉగాది విభావరి ” నిర్వహించాలనే ఊపు వచ్చింది .మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు చూడండి .మిగిలిన విషయాలతో సమగ్రంగా తర్వాత రాస్తాను –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-17 -కాంప్-షార్లెట్- అమెరికా




