20-10-17 శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు –
ప్రతి సంవత్సరం లాగే ఈ కార్తీకమాసం లో ధారావాహికగా ఏమి రాయాలో అని ఆలోచిస్తుంటే మేము అమెరికా లో ఉన్నప్పుడు ప్రముఖ సంస్కృతాంధ్ర విద్యావేత్త బహు గ్రంధకర్త ఆత్మీయ మిత్రుడు శ్రీ రంగా వఝల మురళీ ధరరావు గారు ఆధరంగా పంపిన ”శివానంద లహరి ఆంతర్యం ”ఇవాళే దృష్టిన పడింది ఆయన చాలా లోతుగా దాన్ని చర్చించారు .నేను మాత్రం మాయాబజార్ సినిమాలో వంగర చెప్పినట్లు ”శాస్త్రం నిష్కర్ష గా కర్కశంగా చెబుతుంది మనం సౌమ్యంగా దాని సారాంశమే గ్రహించాలి ”అన్నట్లు అందులోని ముఖ్య విశేషాలను ”శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం ”గా ధారావాహికం గా రేపటి నుండి అంద జేస్తున్నాను -దుర్గాప్రసాద్


—