మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-3

కాన్పూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సేవ

ఐ. ఐ. టి.కాన్పూర్ గా పిలువబడే ఈ విద్యాకేంద్రం స్వర్గీయ పీ.కే .కేల్కర్ అనేక సంప్రదాయేతర నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయటం తో విభిన్న ,వినూత్న విద్యాకేంద్రంగా భారత దేశం లో శోభించింది .ఈ అదృష్టానికి కారకుడు కేల్కర్ .దీనికి నిర్దుష్టమైన ,సరైన బోధనా సిబ్బంది ని నియమించటం లో కేల్కర్ బహు జాగ్రత్త వహించి దీనిస్థాయి పెంఛి ఆకర్షణీయం చేశాడు . ఆయన నియమించిన మొదటి నలుగురు ఫాకల్టి సభ్యులలో శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారు౦డటం విశేషం .కేల్కర్ కు కుడి భుజంగా ఉంటూ, చొరవ తీసుకొని అత్యున్నత అత్యుత్తమ ఫాకల్టి నియామకానికి వెంకటేశ్వర్లు గారి కృషి చిరస్థాయి గా నిలిచింది .దేశం అంతా అత్యున్నత ప్రమాణ సాంకేతిక విద్య కోసం కాన్పూర్ ఐ. ఐ. టి . వైపు చూసేట్లు చేశారు .

  1960 నాటికే అత్యంత ప్రతిభావంత శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగాఇండియాలోనూ విదేశాలలోనూ  గుర్తింపబడి,మరింత ఉత్తమ భవిష్యత్తు ఉన్న  శ్రీ వెంకటేశ్వర్లు లోని వినూత్న ఆలోచనా సరళి ఈ నూతన విద్యాసంస్థ ఏర్పడటం ,దాని అభి వృద్ధికి అహరహం కృషి చేయటం కేల్కర్ గమనించాడు .ఆయనలోని అకు౦ఠిత దీక్ష ,తపన ,అంకితభావం ఈయనకు ఎంతో నచ్చాయి.తన పరిశోధనకే పరిమితం కాకుండా మొత్తం ఆ విద్య సంస్థ కోసం ఆయన చేస్తున్న ,అమలు బరుస్తున్న ప్రణాళికలు  కేల్కర్ ను ముగ్దుడిని చేశాయి . కేల్కర్ చాలా మందితో పని చేస్తున్నా ,వెంకటేశ్వర్లు వంటి మార్గ దర్శి ,స్పూర్తి నిచ్చే వ్యక్తి వేరొకరు లేరనుకొన్నాడు .మేధస్సు ,సునిసిత జ్ఞానం ,చొరవ ,నాయకత్వ లక్షణం ఉన్నప్పటికీ అనుచరుడుగా సంస్థ అభ్యున్నతికి ఆయన అరమరికలు లేకుండా పని చేసే అపూర్వ వ్యక్తిగా గుర్తించాడు కేల్కర్ .

  విద్యా వేత్తగా అనేక రంగాలలో పని చేస్తున్నా వెంకటేశ్వర్లు గారికి పరిశోధనే ప్రాణం .ఇక్కడ చేరిన కొద్దికాలం లోనే తన బృందానికి కావలసిన పరిశోధనా సామగ్రి కోసం ఆర్డర్ వేసి ,తనతోపని చేస్తున్న యువ పరిశోధకులను ఉత్సాహ పరుస్తూ ,ఉన్న స్థలంలోనే  ,అందుబాటులోఉన్న పరికరాలతోనే పని చేయించారు .ఫిజిక్స్ లోనే కాక కెమిస్ట్రి లో కూడా ప్రతిభ ఉన్నవారిని ఆకట్టుకొన్నారు ఇండియాలో జరిగే ముఖ్య శాస్త్రీయ సమావేశాలకు  హాజరవుతూ,అక్కడున్న వారిలో తన డ్రీం ప్రాజెక్ట్ ఐ .ఐ .టి.కాన్పూర్ తత్వానికి  తగిన ప్రతిభావంతులను ఎంపిక చేసేవారు.    

కేల్కర్ సారధ్యం లో వెంకటేశ్వర్లు మనదేశం లోని సమర్ధులైన సైంటిస్ట్ లతో తరచూ సంభాషణలు జరుపుతూ ,వారి వద్ద  ‘’మేధో నవనీతం ‘’(క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్) ఉన్నవారిని ,తన విద్యా సంస్థ నాణ్యత పెంచే వారిని వెతికి ఆహ్వానించి మరింత ఉన్నత స్థాయి కలిపించారు .సాధారణంగా ఐఐ టి లో ఇంటర్వ్యు కమిటీల ద్వారా ఎంపిక చేయటం సంప్రదాయం .కానీ వెంకటేశ్వర్లు అంత దాకా ఆగే స్వభావం కలవారుకాదు .ఆయనకు పనులన్నీ వేగంగా జరిగిపోవాలి .

వెంకటేశ్వర్లు గారి కార్య క్షేత్రం అంటే కర్మ భూమి ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ . 1961 నుండి 1967 వరకు పని చేసిన 6 సంవత్సరాలలొ ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ..ఈ కాలం లో ఆయన చేసిన అనేక పనులతో పాటు లేజర్ శక్తి సామర్ధ్యాలను గుర్తించటం ముఖ్య విషయమై పోయింది.లేజర్ ను ఉపయోగించి స్పెక్ట్రో స్కోపి పరిశోధింఛటమేకాదు ఫిజిక్స్ ,కెమికల్ ఇంజినీరింగ్ ,ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని తన  సహచరులకు  కూడా లేజర్ టెక్నాలజీ పై అభిరుచి , అభిలాష కలిగేట్లు చేశారు . దీనికి ఉదాహరణ తన సహచరుడు ఆర్ .ఆర్. దాసరి ని రెండేళ్ళు ఎం. ఐ .టి . లాబ్ లో పనిచేయించటం  . ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లోని మరొక సహచరుడు కె .ఆర్. శర్మ ఒక ఏడాది ఎం. ఐ .టిలో గడిపి ,ఆప్టికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో బోధనకు ,పరిశోధనకు సమర్ధుడ   య్యాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-17 –ఉయ్యూరు

    


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.