మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5

మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు-5

అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో అందించిన సేవలు -2

1992లో ప్రొఫెసర్ పుచ్చా వెంకటేశ్వర్లు అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు .దురదృష్ట వశాత్తు 76 ఏళ్ళ వయసులో 1997 ఆగస్ట్ 8 న చేరిన అయదేళ్ళకే అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోయారు .ఎప్పటిలాగానే అంకిత భావం తో తుది శ్వాస వరకు  కృషి చేస్తూ సేవలందించారు .ఆ రోజు కూడా సాయంత్రం 6 గంటలవరకు పని చేసి ,ఇంటికి వెళ్లి  ఆ రాత్రే చనిపోయారు .

  ప్రయోగాత్మక ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనలు చేస్తూ దీనికోసం యు ఎస్ .ఆర్మీ మిసైల్ కమాండ్ సంస్థ నుంచి మొదటి సారిగా రిసెర్చ్ గ్రాంట్ పొందారు .ఇదే ఈసంస్థలో ఆప్టిక్స్ /లేజర్ పరిశోధనకు నాంది అయింది .ఇది కాక నాన్ లీనియర్ ఆప్టిక్స్ ,ఆప్టికల్ మెటీరియల్స్ రిసెర్చ్ కోసం   మరొక 10 మిలియన్ డాలర్ల గ్రాంట్ ను పదేళ్లకు గాను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుంచి అందుకున్నారు .ఇలా 12 రిసెర్చ్ గ్రాంట్ లను NSF,DOE,NASA AIR FORCE ARMY RESEARCH OFFICE వంటి  , అనేక ఫెడరల్ ఏజేన్సీలనుండి సాధించిన ఘనత  ఆయనది .చారిత్రాత్మక బ్లాక్ కాలేజీలు యూని వర్సిటీలలో AAMU అగ్రశ్రేణి ప్రగతి పధ గామి విద్యా సంస్థగా పేరెన్నిక గన్నది .అమెరికాలో ఆప్టిక్స్ /లేజర్ కోర్సు లో పి .హెచ్. డి.. చేసే అవకాశమున్న అతి కొద్ది సంస్థలలో ఒకటిగా నిలిచింది .ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో ఇప్పుడున్న ఫాకల్టి సభ్యులు ఆయన రిసెర్చ్ గ్రాంట్ లవలన పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్స్ లనుండి నియామకం పొందినవారే .

  అలబామా సంస్థ మొదటి పిహెచ్ డి విద్యార్ధి హోసేన్ అబ్దిల్ డయెం వెంకటేశ్వర్లుగారి పర్య వేక్షణలో 1991 లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు .ఇప్పుడు అతను నాసా /మేరీ లాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో పని చేస్తున్నాడు .తరువాత సంవత్సరాలలో చాలామంది పిహెచ్ డి ,,ఎం .ఎస్ .విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు .1991 -97 కాలం లో 10 మందికి రిసెర్చ్ గైడ్ గా ఉన్నారు .ఆయన నిరంతర కృషి ఫలితంగా  ఆ నాటికి 47 మంది డాక్టరేట్ లు అయ్యారు .ఇది ఆసంస్థ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు అత్యంత గర్వకారణమైంది .వెంకటేశ్వర్లుగారి అమెరికా అసోసియేట్ లందరూ కలిసి  ఆయన సాధించిన విజయాలపై ఒక  సింపోజియం 1997అక్టోబర్ లో నిర్వహించి ఘన సన్మానం    చేయాలని సంకల్పించారు . కాని ఆగస్ట్ లోనే ఆయన మృతి చెందటం వలన ఆ సమావేశం స్మ్రుతి నివాళిగా నిర్వహించాల్సి వచ్చింది .

  వెంకటేశ్వర్ల గారి సేవానిరతి కి గుర్తుగా ఈ అలబామా సంస్థ ప్రెసిడెంట్ జాన్ గిబ్సన్ నాయకత్వం లో వార్షిక స్మారక  ప్రసంగాలను నిర్వ హించటానికి గ్రాంట్ మంజూరు చేసింది .మొదటి మెమోరియల్ లెక్చర్ అక్టోబర్ 1998 లో రైస్ యూని వర్సిటి కిచెండిన నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కర్ల్ చేశాడు .మరుసటి ఏడాది  నేషనల్ ఇన్ స్టి ట్యూట్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన  మరొక నోబెల్ లారియేట్ విలియం ఫిలిప్స్ , 2000లో కొలంబియాకు చెందిన నోబెల్ గ్రహీత హార్స్ట్ స్టార్మర్,20 01 లో నోబెల్ లారియేట్ నికొలాస్ బ్లోమేర్జెన్ ,2002 లో నోబెల్ గ్రహీత డగ్లాస్ ఒషేరాఫ్ ,2003లో నోబెల్ గ్రహీత ఎరిక్ కార్నెల్ ,2004 లో నోబెల్ లారియేట్ అలాన్ ఈగర్ లు స్మారక ప్రసంగాలు చేసి వెంకటేశ్వర్లుగారికి ఘనం గా నీరాజనాలు అందజేశారు .ప్రతి సంవత్సరం వెంకటేశ్వర్లుగారి స్మారక ప్రసంగాలను  నోబెల్ బహుమతి పొందిన వారితోనే చేయించాలని నిర్ణయింఛి చేస్తున్నారు  .అలబామా మరియు A and M యూని వర్సిటీల సభ్యులు శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు గారిని ‘’ఫాదర్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్  ఆప్టిక్స్ రిసెర్చ్ యట్ అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి’’గా మనసులలో భద్రం గా పదిల పరచుకున్నారు . .ఇలా శ్రీ పుచ్చావెంకటేశ్వర్లు  గారు ‘’అలబామా ప్రయోగాత్మక  కాంతి శాస్త్ర పరిశోధన పిత ‘’ అయ్యారు .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-17 –ఉయ్యూరు

    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.