గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )

గీ ర్వాణకవుల కవితా గీర్వాణం -4

20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )

పరమేశ్వర మనవడైన నరపతి ఝా తరౌని గ్రామం లో పుట్టాడు . మిధిలా తత్వ విమర్శ,రాఘవ కీర్తి శతకం ,గోపీ వల్లభ కావ్యం ,వీర విరుదావలి,హంసదూతం ,ప్రబోధ చంద్రోదయం రచించాడు .ఖండ బాల వంశ రాజుల చరిత్ర ఏ రాఘవ కీర్తి శతకం .శ్రీ కృష్ణ జీవిత విశేషమే గోపీ వల్లభ కావ్యం..అంబరీష స్తుతి వీరవిరుదావలి అలభ్యం .

205- వంశధర ఉపాధ్యాయ ,చిత్రధర ఉపాధ్యాయ (17 శతాబ్దం )

17 వశతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ వంశధార ఉపాధ్యాయ ,గోకులనాధుని మేనల్లుడు .విద్యాధరుడు తన ‘’విద్యాధర సహస్రక ‘’లో ను ,ఇతనికొడుకు చిత్రధరుడు శృంగార సరిని లోను వంశధార శ్లోకాలను ఉదాహరించారు .అభి యోగి కీర్తి అని కూడా అన్నాడు  .ఇంతకు  మించి వివరాలు లేవు .

206-18 శతాబ్దికి వాడైన మహామహోపాధ్యాయ చిత్ర ధర ఉపాధ్యాయ ,వంశధరుని పెద్దకుమారుడు .  రాజ స్తుతి పద్యం ,వినాయక స్తవం రాశాడు .ఇతని 5 శ్లోకాలను తరంగిణి లో ఉదాహరింపబడినాయి .

207-గీతా గోపీ పతి కావ్యకర్త –బాలకవి క్రిష్ణదత్త  (18 వశతాబ్దం )

18 వ శతాబ్ది పూర్వార్ధ బాలకవి కృష్ణ దత్త గీతా గోపీ పతి కావ్యకర్త .సోడరపుర వంశీకుడు .బాల్యం లోనే పలు శాస్త్రాలను అప్పలించి బాలకవి అనిపించాడు .దుర్గా దేవి పరమభక్తుడు తన వైదుష్యం ఆ తల్లి చలవే అంటాడు .భోసలరాజు జానుజీ మహా రాజు ఆస్థానకవి .మంత్రి దేవాజిపతి కోరఘోరే కు అత్యంత ఆప్తుడు .కావ్యాన్ని జయదేవుని అడుగు జాడలలో రాశాడు .రసమయ శృంగార కావ్యం గా తీర్చి దిద్దాడు .గీతాలు మధుమధురం .గీతాలమధ్య వచనమూ రాశాడు .రాదా కృష్ణుల ప్రణయ శృంగార్ కేళీ విలాసమే కావ్యం .లక్ష్మి గుణమణిమాల  ఖండ కావ్యాన్ని రాణి లక్ష్మీదేవి ఔదార్య దయా దాన గుణాలను వర్ణిస్తూ రాసింది .చండికా చరిత చంద్రికా ను దేవీ మహాత్మ్యం లో భాగాన్ని తీసుకుని రాశాడు .స్కాందపురాణం లోని సేతు మహాత్మ్యం దీని భూమిక .ఈ కవి గీత గోవింద వ్యాఖ్యానకర్త కూడా .దీనికి గంగా లేక శశిలేఖ అని పేరు పెట్టాడు .మహిమ్న స్తోత్రానికీ వ్యాఖ్య చేశాడు .

  నలోదయం పై సాహిత్య దీపిక రాసిన మరో క్రిష్ణదత్తుడు ,చౌర పంచాశిక వ్యాఖ్యాత ఇంకో  క్రిష్ణదత్తుడు కూడా ఉన్నారు .

208-కాశీ శివ స్తుతి కర్త –ఖగేశ (18 వ శతాబ్దం )

18 శతాబ్ది ఖగేశ  కవిరత్న బిరుదున్నవాడు .సమస్తిపూర్ జిల్లా తబాకా లో పుట్టాడు .నర్హాన్ జమీందార్ ప్రాపు ఉన్నవాడు ..కాశీ శివస్తుతి ,శిఖరిణీ శతకం ,కాశ్యాభిలాష స్తవం రాశాడు .

కరుణాకర ఉపాధ్యాయ కొడుకు రామ చంద్ర ఉపాధ్యాయ ‘’ప్రశస్తి రత్న ‘’రాశాడు .

209-రస ప్రదీపిక కర్త –సచల మిశ్రా (18 వ శతాబ్దం )

మహా మహోపాధ్యాయ సచల మిశ్ర ,రఘుదేవ రంభ దంపతుల కుమారుడు .మహా న్యాయవేత్తగా ప్రసిద్ధుడు .చిత్రధరుని శిష్యుడు .తిర్హట్ న్యాయాధిపతి .సంస్కృతం లో ఈయన 17 9 4 జూన్ 10 న వెలువరించిన తీర్పును కేపి జయస్వాల్ ప్రచురించాడు.పీష్వామాధవరావు  నారాయణ రెండు అగ్రహారాలను ప్రదానం చేశాడు .ఈయన రాసిన ఏకైక సంస్కృత కావ్యం –రస ప్రదీపిక .

210-రాధా నయన ద్విశతి కర్త-మోహన మిశ్ర (18 వ శతాబ్దం )

18 వ శతాబ్ది మహామహోపాధ్యాయ మోహన మిశ్ర సచాలమిశ్ర చిన్నతమ్ముడు .రాదానయన ద్విశతి అనే ఖండ కావ్యం ఒక్కటే రాశాడు .217 శ్లోకాలలో రాదా దేవి కనుల సోయగాన్ని తనివి తీర మనోహరం గా వర్ణించాడు .రాధ కృష్ణుల దివ్య ప్రేమకు అక్షర బృందావనం నిర్మించాడు .భక్తికల్పద్రుమం అనేది కూడా రాసినట్లు తెలుస్తోంది .

211-తారా చంద్రోదయ కావ్యకర్త –వైద్యనాధమిధిల (18 వ శతాబ్దం )

18 వ శతాబ్ది కవి వైద్యనాధ మిధిల-కేశవ చరిత్ర ,తారా చంద్రోదయ కావ్యాలను రాశాడు .వీటిని తన ప్రభువు రాజా ,కేశవా దేవా ,కుమారుడు రాజా తారా చంద్ర ళ కోరికపై వీటిని రచించాడు .ఇంతకంటే వివరాలు తెలియవు .

212-నలోదయ కావ్య కర్త –కాళిదాస మిశ్ర (18 శతాబ్ది )

మిధిలా వాసి కాళిదాస మిశ్ర నాలుగు ఆశ్వాసాల నలోద్యకావ్యం రాశాడు .ప్రజ్ఞాకార మిశ్ర కుమారుడు విద్యాకారా మిశ్ర దీనికి ‘సుబోధిని ‘’వ్యాఖ్యానం రచించాడు

21 3- రామవిజయ మహా కావ్య కర్త –రూపనాథ (178 6-187 4 ) వశతాబ్దం )

18 శతాబ్ది ఉత్తరార్ధకవి రూపనాధ 1786 లో జన్మించి , 8 8 ఏళ్ళు జీవించి 1874 లో చనిపోయాడు కవిత్వ ,దర్శన ,వేదాంతాలలో ప్రసిద్ధుడు .9 కందాల రామ విజయ మహా కవ్యం రాశాడు .మూలం వాల్మీకి రామాయణం .రావనునిపై రామ విజయమే కధ.

214-విద్యాకార సహస్రక కూర్పరి –విద్యాకార మిశ్ర (18 శతాబ్దం )

మహా మహోపాధ్యాయ విద్యాకరుడు మహామహోపాధ్యాయ ఆన౦దకర కుమారుడు ,ప్రజ్ఞాకారుని తండ్రి .నలోదయకావ్యం లో తండ్రి గొప్పతనాన్ని సంపూర్ణం గా వర్ణించాడు .తండ్రి సర్వశాస్త్ర పారంగాతుదని తర్కం లో కర్కశుడనిచెప్పాడు .ఆంత్రోపాలజిస్ట్ గా విద్యాకారుడు సుప్రసిద్ధుడు .వివిధకవుల కవితలను ముఖ్యంగా మిదిలకవుల కవితలు  కూర్చి విద్యాకార సహస్రిక తయారు చేశాడు  .అమరుశతకం ,రాక్షస కావ్యం ,రుతువర్నన ,విదగ్ధ ముఖ మండన లకు గొప్ప వ్యాఖ్యానాలు రాశాడు

215-సుబోధిని కర్త –ప్రజ్ఞాకార (18 శతాబ్దం )

ప్రజ్ఞాకర ,మహోపాధ్యాయ విద్యాకర కొడుకు .నలోదయానికి సుబోధిని వ్యాఖ్య రాశాడు .ఉపద్ఘాటం లో తన కుటు౦బ  కవుల మహా వైదుష్యాన్ని మహా గొప్పగా అభి వర్ణించాడు .

201 నుంచి –   215 వరకు ఆధారం –contribution of Midhila to Sanskrit .

సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-18 –ఉయ్యూరు

 

  

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.