గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )

డా .నళినీ శుక్లా కాన్పూర్ ఏ యెన్ డి మహిళా మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేసి రిటైరయింది .సంస్కృతం లో చాల రచనలు చేసింది .మంచి కధకురాలుగా ప్రసిద్ధి చెందింది .తన కధలనుప్రచురించింది .కవితలను  భావాంజలి  సంపుటిగా 1977 లో ప్రచురించింది .–రూప వర్ణ నస్త్వం –కృష్ణా కేళి గీతం అద్భుత కవిత్వ ప్రవాహం –‘’అయి నిజపుత్రం పశ్య సుముగ్ధం కరముఖ ఘ్రుత నవనీతం –మధురసహాసం లలిత విలాసం  కుసుమాయుధ జయ శీలం ‘’

‘’అరుణ కపోలం కుండల లోలం  రింగణాచలన లసంతం-వికసిత హసనం మణిసమ దశనం స్వల్పం దర్శిత వంతం ‘’

భావం –చేత వెన్నముద్ద పెరుగుగడ్డ ,యెర్రని పెదవులు నల్లని మేను,సుందరముఖం  కాంతులీనే  కనుగవ ,చెవులకు రింగులు ,మెడలో ని మణులలాంటి దంత కాంతులతో కృష్ణ బాలుడు శోభాయమానంగా కనిపిస్తున్నాడు

2-భావనా మోదస్య గాంభీర్యం లో భారతీ చతుశ్లోకీ లో శ్లోకాలు పరమాద్భుతం –

‘’నామ్నేవా శు వరప్రదాన నిరతాం ధాత్రీం జగత్తారిణీం-స్తిత్యుత్పత్తి లయాద శక్తి వివిధైర్దెవవైః సదా సంస్తుతాం

మాత్రా బిందు విసర్గ వర్ణ రచనాసార్యేన సార్దాభిదాం –పశ్యన్తీమయం మధ్యమామపి పరాం వాచం శ్రయే శారదాం ‘’

౩-గుణ కీర్తనం లో –అహోసృస్టేః కర్తా సకలభువనస్యేక శాస్త్రం –త్వమైశ్వర్య గారః పృధివి మలరత్నా కర ఇవ ‘’

ఓ సృస్తికర్తా !నువ్వు అన్నిటికి అతీతుడవు .రత్నగర్భ అయిన మహా సముద్రం లాగా సకల నిధులు నీవద్దనే ఉన్నాయి .

4-వాణీ పంచదశి అని 15 శోకాలు రాసింది .మచ్చుకి –‘’యతస్తీర్నాఃపాపాః కృతాని రతాః సంతి బహవః

భవత్యాః భవ కారుణ్యాజ్జగతి మహిమా యస్య విషదః ‘

భావం –అమ్మా సరస్వతీ !అపారమైన నీ కారుణ్యం మమ్మల్ని పాపాలనుండి దూరం చేస్తోంది .నీ దయకు అంతూ దరీలేవు

5-లలితకళలను ప్రస్తుతిస్తూ ‘’లీలాకీర్తనం ‘’రాసింది –‘’ప్రియాం గాధికాం హ్లాదినీ శక్తి భూతం త్రుషా ర్తేక్షణంసాధయంతం వ్రజేశం

స్వలీలసవైర్మోహయంతం పరేశం జగత్పాలకం శ్రద్ధయా భావయామి ‘’

కృష్ణా మనోల్లాసం కలిగించే నీలీలలు అనంతం అద్భుతం అనిర్వచనీయం .

శైలి గురించి చెప్పిన శ్లోకాలు ఎన్నదగినవి .-‘’మదన వికారం మమతాజ్జ్వరం ప్రబలం గణయతి నాయం

హర్షో పేతైః కృత సంకేతః  క్రీడతి వారం వారం ‘

భావాలకు తగిన అనేక ఛందస్సులను  కవిత్వానికి పుష్టి చేకూర్చింది

ఈ కవిత్వమంతా చదివితే డా.నళినీ శుక్లా సహజ కవయిత్రి అనిపిస్తుంది .దైవం తో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు చెప్పిన శ్లోకాలు ఆమె ఆరాధనా భావానికి పరాకాష్ట గా నిలిచాయి .ఆమెలోని తాత్విక చింతనకు అద్దంపడతాయి .లయ ,తూగు ఊపు పుష్కలంగా ఉండటం తో కవిత్వం గొప్ప స్థాయిని చేరి మధురానుభూతినిస్తుంది .అలంకార దర్శన శాస్త్రాలలో ఆమె నిధి అని అర్ధమవుతుంది .యోగాభ్యాసం లోనూ ఆమె చాలా సాధించినట్లనిపిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-2-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.