గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)
254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )
విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది .
‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు సంప్లావితా-గీర్వాణీ రసమక్షరత్సురతరో చాయాసు సంవర్ధినీ
యత్సోత్శ్రంగ సురవరం నిషేవ్య జని రప్యుక్తర్ష మా సాదితా-శ్రీమత్సుందర లాల శుక్లమనఘం తాతం సదాహం నతా ‘’
అని తండ్రి సుందరలాల్ శుక్లా తనకు సంస్కృత జ్ఞానం కలిగించినందుకు వందనాలు చేసింది .తల్లిజానకి ,గురువు కృష్ణకాంత్ లు తనలోని అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతి వెలిగించినదుకు ప్రణమిల్లింది .50భాగాలుగా కావ్యం ఉంటుందని తెలిపింది .’’తవ నామాక్షరాణి’’అనే మొదటి భాగం లో భర్త అండలేక పొతే భార్య జీవితం నీరు లేని చేప గతి అవుతుందని చెప్పింది .
‘’మీన ఇవ మే జీవనం జలమంతరేణ న జీవ్యతే ప్రియ –నిర్మలా౦భసి తవ మనసి ధవలాయితం కదామివ విశాని తవ నామాక్షరాణి’’అన్నది .సేవావీయి భాగం లో పుష్పాలు బాగా వికసించి ఉన్నా మధుపాలు లేకపోతె శోభ లేనట్లు ప్రియుడు లేని ప్రియ జీవితం శోభించదు –‘’వాటికా పుష్పితా సౌరభైః సంయుతా –భ్రున్గ సంగం వినా నైవ సా శోభతే –సేవ వీయీ మయా త్వన్మనో గమ్యతే ‘’.’’లభ్యం న రత్న మేకం ‘’భాగం లో తన ప్రియుడి పై అనుమానం ,తాను పొరబాటున వ్రేళ్ళు లేని గగన కుసుమాలకోసం ఆరాట పడుతున్నానేమో అని సందేహించింది –‘’క్షేత్రం పుష్పమే తనూ చిత్తమాకులం కిమూ మూలం వినా క్వ వల్లీ వల్లీ వినా క్వ పుష్పం ‘’.
‘’జాలా విచిన్న తేయం ‘’విభాగం లో ప్రియుడి గుణాల కు సరిసమాన గుణాలు లేని తనను ని౦ది౦చు కున్నది – ‘’గుణ రాశినా యుతెన బద్ధం త్వయా మనో మే-శక్యో మయా న బంధుం మనసా తిని ఘ్రుషేణ .’’అతని గుణాలు తనను బంధించాయికాని తన గుణాలు అతనిని దగ్గరకు చేర్చ లేకపోతున్నాయని వేదన .’’రోచతే నైవ కించిత్ ‘’లో ప్రియదర్శనం తో తన జీవిత విధానం అస్తవ్యస్తమై ,సుఖ శాంతులు కరువయ్యాయి .-‘’యద్విధానం సదా జీవనే మేభవత్ –యద్విధానం వినస్టం భవ దర్శనే-యాను భూతి ఘ్రుతాపూర్ణ తా సంయుతా సానుభూతిర్వినస్టా భవ దర్శనే –ధీరతాయా సదా జీవనం మే రతా సా గతా ధీరతామే తవ దర్శనే ‘’’. పవిత్ర గ్రంధాలు ,ప్రవచనాలు ధ్యానం ,ముక్తి మార్గం అన్నీ గుంట పెట్టి గంట కొట్టినట్లు అయ్యాయట అతడిని చూడగానే –‘’క్వం గతం సకల శాస్స్త్రామృతం క్వను చింతితా తపసా వ్రతం –క్వ గతా విమోక్షసరణి రసౌ కేనాపి శకలం హర్యతే ‘’.ప్రియుడి దరహాసం శివుని నవ్వు లాగా తన హృదయాన్ని లాగేసింది,శాంతి లేకుండా చేసింది .అతని చేస్టలు ప్రశం౦చతగినవి అనిపించలేదట . ‘’స్వవశతా కధం నీతా ‘’భాగం లో తన హృదయాన్ని లాగేసుకున్నవారెవరో తెలియ లేదని ,కాని అతని సుందర వీక్షణం తో తన జీవిత గతే పూర్తిగా మారిపోయిందని చెప్పింది –‘’మనో మే నీయ తేర భాసాంతి కంతే కేన నో జానే –క్షణం సంప్రేక్ష్య తే రూపం ధరా నిఖిలైవ విపరీతా ‘’.
‘’చేతో భావిని జన్మాని ‘’లో పునర్జన్మ విషయం చెప్పి ఈ జన్మలో ప్రియ సమగమనం కాకపోయినా వచ్చే జన్మలో నైనా కలగాలని భావించింది .
ఆమె దుఖం అనంతమైనది .కృష్ణ శాస్త్రి ‘’నాకుగాదులు లేవు .ఉషస్సులు లేవు .ఏను అనంత శోక లోకైక తిమిర పతిని ‘’అన్నట్లుగానే పుష్పాత్రివేది’’తన విరహ బాధను అత్యద్భుతం గా ఆవిష్కరించింది –చివరికి ‘’గతోవా గంతావా శమమపి పీడా నవసితా –న యాతా నో యాతా క్షణమపి విరాగే మామ కధా-న రేమే నంతా వా వికలిత విదంభే హతమనో –మనోజ్నేసి త్వం రే నమ మమ మనోజ్ఞాయత కధం’’అంటూ ఈ అనంత దుఖం ఆరేదీ తీరేదీ కాదు ఆగేదీ ఆగిపోఏదీకాదుతన కల్లోలమానసం స్వస్తత చెందేదీ స్వస్తత చేకూర్చేదీ లేదు ,మనోజ్నునికి తన ఎద లోపలి పొరలలోని వేదనా , ఆవేదనా తెలుసుకోలేనిది అని నిట్టూర్చింది .ఆమె దుఖం ,వేదనా ,విరహం ఆమెను’’ అగ్ని శిఖలా’’ దహించేస్తున్నాయి .దాన్ని తట్టుకోవటం చాలా కష్టమై పోతోందని కవయిత్రి తన మనో వేదనను ఒక రకంగా ఈశ్వరార్పణం గా నివేదిన్చుకున్నట్లు కనిపిస్తుంది .
ఈ విప్రలంభ కావ్యాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ సత్యవ్రత శాస్త్రి మంచి ముక్తాయింపు గీర్వాణ౦ లో ఇచ్చాడు –
‘’మనోహరం కావ్యమిదం నిపాఠం- నిపాఠమాయాతి మనో న తృప్తిం –భూయో రసాస్వాదన తత్పరం సద్-భద్నాతి భూయోపి చ తత్ర భావం –మాధ్వీక మాధుర్య ధరా మనోజ్ఞా
విరాజమానా గుణ రాజి భిక్షా –వాగన్నసత్యం ప్రసభం మనాంసి –హరేత్సమేషామితి మే ప్రతీతిః
రసైః సు పుష్టం సుమలంకృతం చ –నిర్దోష లేశం సుతరాం చ హారి- కావ్యం భవత్యా హృది సంధి బంధం –నేత్రద్వయా సేచనకం విభాతి ‘’
గొప్ప కవిత్వాని మరింత గొప్ప ప్రశంస .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—