బ్రహ్మా0డ భా0డోత్సవాలు
రెండు రోజుల తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాణ్డ భా0డోత్సవాలుగా శ్రీకాకుళం లోఈ నెల 10 ,11 శని ఆదివారాలలో జరిగాయి . ఒక్క అనంత శ్రీరామ్ మాత్రమే మనసుల్ని కాప్టి వేట్ చేశాడు . యువతకు సందేశమిచ్చి కార్యోన్ముఖులను చేయటానికి తోడ్పడ్డాడు . మిగిలిన వారివన్నీ ప్రపంచ తెలుగు సభల్లో ,ఎప్పుడూ జరిగే సభల లోని రొటీన్ ఉపన్యాసాలే .
ఎప్పుడూ చెప్పే ”మమ్మీ -డాడీ ”పై దాడులే ,”పెద్దబాల శిక్షలను ”ప్రవేశపెట్టమని శతకాలు వల్లే వేయించమని నీతి బోధలే .రాగ యుక్తం గా పద్యాలు పాడే వారినే పిలిచి పాడింపు, పద్య వైభోగపు పొగడ్తలే . పద్యం తప్ప ఇంకే ప్రక్రియా లేనట్లు ప్రవర్తింపే . పోనీ పద్యాలను పిల్లలతో పాడించి బహుమతులను స్వ0త డబ్బు తో ఇచ్చేవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలియదు . వారిని పిలిచి ప్రోత్సహించటాలు లేవు .సాహితీ సంస్థల విషయాలను వారి కార్యక్రమాలను గుర్తించే అలవాటు లేదు నిర్వాహకులకు తెలుసుకునే బాధ్యత కనిపించదు గౌరవంగా వారే పిలిచి చెప్పి నిర్వాహకులకు ప్రోత్సాహం కలిగించే ప్రయత్నాలు లేవు . పైపెచ్చు ఆసంస్థలు మాట్లాడటానికి ఒక నిమిషం లేక రెండు నిమిషాల సమయం .ఊక దంపుడు వారికి సింహభాగం . మాకు సాయం చేయండి అని సంస్థలు అడిగే దుస్థితి ఎందుకు రావాలి ? వీరి భోగట్టా ప్రభుత్వం దగ్గర సేకరించి ఉంచుకో వద్దా .? జిల్లాలు దాటి వచ్చిన సంస్థల నిర్వాహకులకు అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వద్దా ? వీరు శాలువాలకోసమో ”కవర్ ”ల కోసమో వచ్చిన వారు కాదు .గౌరవం గా గోడు చెప్పుకోవటానికి ,తమ కార్యక్రమాలు అందరి ద్రుష్టి కి తేవటాటినికి ,పడే తపనే . మందపు చర్మాలకు పదునెక్కించటానికి వచ్చిన వారే . అందరికీ ఇచ్చినట్లే వారికీ వేదికపై గౌరవ స్థానమిచ్చి రెండు మూడు రౌండ్లలో అభి ప్రాయాలు చెప్పిస్తే బాగుండేదని సామాన్యుడి సణుగుడు .
ఎలాగూ ఇక్కడ ప్రతి ఏడాదీ ఎదో రూపం లో బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా .ఆలయ ప్రాంగణం లోనో బయట నో ఒక శాశ్వత ఆడిటోరియం నిర్మించే ఆలోచన చేయచ్చు ప్రభుత్వం. వదాన్యులు ముందుకు వచ్చి కార్య రూపం దాల్చెట్లు చేస్తారు .అలాగే ఘంటసాల మాస్టారు గారికీ ప్రతి ఏడాదీ జయంతి జరుపుతున్నారు కనుక ఆయన పెద్ద చిత్రపటాన్ని ఆడి టోరియం గోడకు అమర్చితే గొప్ప నీరాజనం అవుతుంది
కాలేజీ విద్యార్థులను ఇక్కడికే ఆహ్వానించి కానీ లేక దగ్గర కాలేజీలలో కానీ వారి కోసం కథ ,నాటిక నవల వంటివి పరిచయం చేసే ప్రోగ్రామ్ లు చేయలేరా ? వాటిపై అవగాహన ఉన్న యువత తో మాట్లాడించ రాదా ?మనసుంటే మార్గం దొరుకు తుంది .శ్రీకాకుళం దేవాలయచరిత్ర ఆవిష్కరణకు విద్యార్థులు బహు సంఖ్య లో వచ్చి ఉంటె యెంత ప్రేరణగా ఉండేది ?
వీటన్నిటికీ మించి రోజుకు అన్ని సభలు అవసరమా /?అన్నీ పాడిందే పాటగా లేవా ?ఒక్క సాంకేతిక సదస్సు అందరి హృదయాలను తాకిందికదా .దీనిలో కూడా యువత ఉంటె రంజకం గా ఉండేది కాదా ?
అన్ని ప్రక్రియలకు సమ ప్రాధాన్యత నిస్తూ అన్నీ ఒక్క సారె కుక్కే ప్రయత్నం చేయకుండా భావి సభలు ఆహ్లాదం గా జరపాలి .
సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా సభలో ఉపయోగించక పోవటం చెప్పేదానికి ఆచరణకూ ఉన్న దూరాన్ని చెప్పకనే చెబుతుంది . శ్రీ కాకుళం నుంచి తడ దాకా ఎప్పుడొచ్చినా వీరేనా కొత్తవారిని దుర్భిణీలో వెతకలేరా ? ”ఇవి మన సభలు కావులే .మనకేమీ ప్రాతినిధ్యం ఉండదులే ”అను కొనే భావం రా కూడదు . మరిన్ని మంచి సభలు కొత్త ఆలోచనలతో రొటీన్ కి భిన్నంగా జరగాలన్న ఆరాటమే ఇదంతా . దుర్గా ప్రసాద్
—