గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 ))
సంస్కృత ఆచార్య ,ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ గోదావరీష్ దాష్ 1910 ;లో ఒరిస్సా గంజాం జిల్లా పొడమారి లో జన్మించి శతమానం భవతి గా నిండు నూరేళ్ళూ జీవించి 2010 మరణించాడు .సంస్కృతం లో ‘’లిపి తత్వ ‘’ఒక్కటే రాశాడు ఒరియాలో వేదాలకు ఏడు అద్భుత వ్యాఖ్యానాలు రచించాడు .
259-సంస్కృత మందాకినీ కర్త –గోపాల కృష్ణ దాష్(19 52)
24-11-19 52 పూరీ లో జన్మించిన గోపాల కృష్ణదాష్ యజుర్వేద మాధ్యందిన సంహిత లో ఎంఏ ఎం ఫిల్ పిహెచ్ డి చేసి,ఉత్కళ యూని వర్సిటి సంస్కృత పిజి డిపార్ట్మెంట్ హెడ్ అయ్యాడు .గొప్ప గురుపరంపర ఉన్నవాడు –పండిట్ పరమేశ్వరదాస్ ,జనార్దన సరస్వతి ,ప్రొఫెసర్ ఏ సి స్వైన్ ప్రొఫెసర్ సదాశివ ప్రహరాజ్ లాంటి ఉద్దండులవద్ద విద్య నేర్చాడు .శిష్య పరంపరలో లబ్ధ ప్రతిష్టు లైన ప్ర రాదా మాధవ్ దాస్ ,ప్రొ .సురేంద్ర మోహన మిశ్రా ,ప్రొ .సుఖదేవ్ భోజ్ ,డా .మధు సూదన మిశ్రా వంటి వారున్నారు .27 గ్రంధాలు రాశాడు ముఖ్యమైనవి –సంస్కృత మందాకినీ ,వ్యాకరణ దర్పణ ,సంస్కృత ప్రభ ,సిద్ధాంత కౌముది .విద్వత్ సమ్మాన్ ,కవి శ్రీ హర్ష సమ్మాన్ , సరస్వతి వరద పుత్ర సమ్మాన్ వంటివి చాలా పొందాడు .ఒడిస్సా సంస్కృత అకాడెమి అవార్డ్ తోపాటు ,స్కాలర్ ఆఫ్ ఎక్సెలెన్స్ అవార్డ్ ,కృష్ణ చంద్ర ఆర్య అవార్డ్ ,పూరీలోని నీలాచల తత్వ సంధాన పరిషత్ అవార్డులు అందుకున్న సరస్వతీ పుత్రుడు కృష్ణ దాష్ .మారిషస్ బోర్డ్ ఆఫ్ రైటర్స్ కు చైర్మన్ .
260-చారుదత్తం కర్త –కాదంబినీ దాష్ (1958 )
16-1-1958 పూరి లో జన్మించిన కాదంబినీ సంస్కృత పిహెచ్ డి చేసి ,రీడర్ గా కటక్ లోని శైలబాలా వుమెన్స్ కాలేజి లో పనిచేసింది పండిట్ దివాకర్ దాస్ ,ఎసి స్వైన్ ,ప్రొ ఏ .సి .సారంగి మొదలైన వారివద్ద విద్య నేర్చి ,భాగ్యలిపిమాల ,డా సురేఖా దాస్ ,నందితామిశ్రా ,రోజిలిన్ మహ౦తి అనే ప్రముఖ శిష్యులకు గురువైంది .రఘు వంశం ,చారుదత్తం ,మేఘదూతం సిద్ధాంత కౌముది మొదలైన 24 గ్రంధాలు రాసింది .డా కుంజ బిహారీ త్రిపాఠి స్మ్రుతి సమ్మాన్ , అందుకున్నది .ఆల్ ఒడిస్సా అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ టీచర్స్ ఇన్ సాంస్క్రిట్ కు పాట్రన్ గా ఉన్నది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –14-2-18 –ఉయ్యూరు