దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్
1-బాల్య నైన్ద్యాన్ని ఎదిరించిన యూన్ మీరే.
ఆఫ్రికన్ అమెరికన్ తండ్రికి, కొరియన్ తల్లికి జన్మించిన గాయకు రాలుయూన్ మీరే . సుహృద్భావ వాతావరణం నెలకొని ఉన్న దక్షిణ కొరియాలో క్రమంగా జాత్యహంకారం వర్ణ విచక్షత పెరగటం సహించ లేక పోయింది .’’హిప్ హాప్’’ అనే ‘’రాప్ సంగీత ఉద్యమం’’ ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్న సమయం లో ఈమె త్వరగా అవగాహన పెంచుకుని ఉద్యమనేతగా ఎదిగి దక్షిణ కొరియా రాప్ సంగీత గాయకు రాలిగా ప్రసిద్ధి పొందింది .తన గానం తో సకల సంస్కృతీ వికాస యువ సభలలో స్వచ్చందంగా పాల్గొంటూ వోగ్ కొరియా స్టాప్ అండ్ లవ్ ఉద్యమనాయకు రాలుగా పెరిగింది .బాల్య నైన్ద్యా న్ని అన్ని స్థాయిలలోనూ ఎదిర్చింది .బాల్య నింద వ్యతిరేక ఉద్యమం లో భర్త టైగర్ జేకే తోకలిసి పాల్గొని మంచి ఊపు తెచ్చింది .అనేక సంస్థలు ,సంఘాలను కూడా బాల్య నింద వ్యతి రేక ఉద్యమం లో పాల్గోనేట్లు చేసి వారి పట్ల సానుభూతి కలిగించి ఆదుకునేట్లు చేయగలిగింది .ముఖ్యంగా దక్షిణ కొరియా ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ కళ్ళు తెరిపించి బాల్యానికి హాని కలుగ కుండా చర్యలు తీసుకునేట్లు చేసిన మానవీయ మూర్తి యూన్ మీరే .
బాల్య నైన్ద్య౦ చాలారకాలు .దంపతులు సత్సంతానాన్ని పొందాలి పిల్లలను అభి వృద్ధి లోకి తేవాలి .దక్షిణ కొరియాలో కుటుంబం లోని కొడుకు అప్రయోజకుడైతే తండ్రి వాడిని చంపేసేవాడు .ఎవరికీ తెలియ కుండా పాతిపెట్టె వాడు .తల్లి కూడా కూతురుపై మమకారం తో కొడుకును చులకనగా చూసేది .తలిదండ్రులు బతికి ఉన్నంతవరకు పిల్లలకు స్వేచ్చ ఉండేదికాదు .బానిసల లాగానే బతికే వారు .తప్పు చేస్తే చావు దెబ్బలే. అంటే చచ్చే దాకా కొట్టటమే .కారుణ్య కటాక్షాలు కుటుంబాలలో ఉండేవి కావన్నమాట .సానుభూతి ,సహవేదన అక్కడ నిఘంటువులలో కూడా దొరికేవి కావు .వీటినుంచి బాల్యాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న సానుభూతి పరురాలు సాహసురాలు సంగీత నిధి మియాన్ మీరే .
2-కొరియా లో అతి ప్రాచీన అబ్జర్వేటరీ నెలకొల్పిన రాణి –క్వీన్ సియోన్ డియోక్
దక్షిణ కొరియాను పాలించిన వారిలో పురుషులే చాలా ఎక్కువ . మహిళలు పాలించింది చాలా తక్కువ కాలమే .క్రీ.పూ 5 7 నుంచి క్రీశ.9 35 వరకు సెల్లియా యుగం లో మాత్రమె రాణుల పాలన ఉన్నది .ఆకాలం లో ప్రసిద్ధి చెందిన రాణి క్వీన్ సియోన్ డియోక్ క్రీ.ష 632 నుంచి 64 7 వరకు పాలించి అనేక ప్రత్యేకతలు సాధించి చరిత్రలో ఘనం గా నిల్చి పోయింది శక్తి సామర్ధ్యాలతో పాటు ప్రజా రంజకమైన పరిపాలనకు ఈ నాటికీ ఆమెను గుర్తుంచు కుంటారు .విద్యార్ధులను చైనాలో చదువుకోవటానికి అన్ని రకాల అవకాశాలు కల్పింఛి విద్యా వ్యాప్తి చేసిన ప్రాతస్మరణీయురాలు .పున్ష్ వాంగ్ ,యాంగ్ మియో దేవాలయ నిర్మాణం లో ఆమె కనబరచిన ఔదార్యం దాతృత్వం ,తపన వంనేకేక్కాయి .వీటి నిర్మాణం తో కొరియాలో బౌద్ధమత వ్యాప్తికి పెద్ద అవకాశాలు కలిగాయి .ఆసియా లోనే అతి ప్రాచీన అబ్జర్వేటరీ ‘’’’చెయోసి మొంగ్డే ‘’జియాంగ్ జు లో ఏర్పడటానికి చక్కగా పర్యవేక్షణ చేసింది .
3-సర్వ కళా వల్లభి, శాకాహారి –లీ హియోరి
దక్షిణ కొరియాలో అందరి ఆహారం మాంసం అయితే ,స్వచ్చందంగా మాంసాహారం విసర్జించి శాకాహారిగా జీవిస్తూ అందరిని అవాక్కు చేస్తున్నది లీ హియోరి .ఆవిడ ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుని శాకాహారిగా ఉందా అంటే అదేమీ లేదు –ఆమె మహా గాయకురాలు నటి ,నిర్మాత ,క్రియా శీలి ,టెలివిజన్ ప్రేజెంటర్ .అందుకే ఆమెను ‘’ఫెయిర్ లేడీ ‘’అంటారు అభిమానంగా .19 9 8 లోగాయనిగా కెపాప్ గర్ల్ గ్రూప్ లో చేరి క్రమగా ఎదిగి అనేక సంగీత ఆల్బం పాడి లను విడుదల చేసింది .20 06 లో దక్షిణ కొరియా గాయకులలో అత్యంత ఎక్కువ పారి తోశికం తీసుకునే గాయనిగా రికార్డ్ సృష్టించింది .
శాకాహార జీవనానికి అలవాటు పడిన సుప్రసిద్ధ గాయని లీ హియోరి వన్య మృగ సంరక్షణకు,వాటి హక్కుల పరిరక్షణకు దీక్ష పట్టి కృషి చేస్తోంది .20 12 లో ‘’క్లోజర్ ‘’అనే ఫోటో బుక్ ను విడుదల చేసింది అందులో తన గురించి కుటుంబం నిరాశ్రయురాలైన కుక్కకు ఆశ్రయంకల్పించి పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క మొదలైన అరుదైన ఫోటోలు ఇందులో చూడవచ్చు .
4-కొరియా స్వాతంత్రోద్యమ నాయకురాలు –యు గ్వాన్సన్.
కొరియాలో జపాన్ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన మార్చ్ ఫస్ట్ ఉద్యమాన్ని సర్వ సమర్ధంగా ముందుకు నడిపించిన దైర్య సాహసోపేతురాలు యు గ్వాన్సన్.దేశ స్వాతంత్ర్యం కోసం అహింసాయుత ప్రజా ఉద్యమం నడిపిన దీరురాలామే .అందుకే ఆమెను ‘’కొరియా జోనాఫ్ ఆర్క్ ‘’అంటారు .17 ఏళ్ళ వయసులో జపాన్ కు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఆ వీర ధీర శోర్య యువతిని 19 19 లో జపాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆమె తల్లిదండ్రులు ఈ ఉద్యమం లో అసువులు బాశారు ఏడేళ్ళ కారాగార వాసం లో పోలీసుల విచాక్షణారహిత దెబ్బలు అనేక శారీరక మానసిక క్షోభానూ అనుభవించింది దేశ స్వతంత్రం కోసం .18 వ ఏట ఆ రాక్షసత్వానికి బలై మరణించిన త్యాగ శీలి .మరణా నంతరం యు గ్వాన్సన్ కు ‘’ఆర్డర్ ఆఫ్ ఇండిపెండెన్స్ మెరిట్ ‘’ను 196 2 లో ప్రదానం చేసి గౌరవించారు .
5-కొరియన్ అగ్రగామి మహిళా రిపోర్టర్-కిమ్ యంగ్ మి
కొరియా దేశ మహిళా రిపోర్టర్ లలో అగ్రగామి కిం యంగ్ మి .ఇండిపెండెంట్ డాక్యుమెంటరి డైరెక్టర్ గా సుప్రసిద్దురాలు .రిపోర్టర్ లలో మగ మహా రాజులదే హవా గా ఉన్నకాలం లో తన సృజన ,ప్రాతిభ ,ముందు చూపు ,ప్రగతి షీలా భావాలతో ధైర్యం గా ముందుకు దూసుకు వెళ్లి చరిత్ర సృష్టించి తనకంటూ ఒఅ ప్రత్యెక స్థానాన్ని సాధించింది మి .’’మి ‘’అంటే నేనూ ఉన్నాను మీతో పాటు ,ఇంకొంచెం ఎక్కువగా అని రుజువు చేసింది స్మీ ‘’మీ’’.80 దేశాలలో పర్యటించి ,అందులో ముఖ్యంగా కల్లోల పరిస్తితులలో ఉన్న సిరియా ,ఆఫ్గనిస్తాన్ ,ఇరాక్ దేశాలలో అక్కడి ఇస్లామిక్ స్టేట్ గురించి సమగ్ర సమాచారం తెలుసుకుని ప్రచురించింది .కాఫీ వాణిజ్యం, ఈస్ట్ టిమర్ మొదలైన వాటిపై సమగ్ర డాక్యు మెంతరీలు తీసి అనేక విషయాలను వెలుగు లోకి తెచ్చింది .ఆమె కృషికి తగిన ప్రతిఫలం అవార్డ్ ళ రూపేణ పొందింది .అందులో ఎం బి సి బ్రాడ్ కాస్ట్ హై అచీవ్ మెంట్ అవార్డ్ ,వై ఎంసి ఏ కొరియా వుమెన్ లీడర్షిప్ అవార్డ్ ముఖ్యమైనవి .
– గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
—