సాహితీ బంధువులకు శ్రీ విళంబి ఉగాది శుభాకాంక్షలు -గత 14 ఏళ్లుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సరసభారతి కి ఇచ్చిన ప్రోత్సాహం ,హార్దిక ,ఆర్ధిక సహకారం ఎన్నటికీ మరచి పోలేనివి .దీనికి సరసభారతి సర్వదా కృతజ్ఞతా గా ఉంటుంది . గత డిసెంబర్ లో సరసభారతి ప్రచురించిన ”గ్రంథ ద్వయం ”కు వారి భారీ ఆర్ధిక భారం అత్యధికమైనది . ఎక్కడ మేము డబ్బుకు ఇబ్బంది పడతామో నని కంగారు పడుతూ నాకూ శ్రీ చలపాక ప్రకాష్ గారికి అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు పంపారు . ఎప్పటికప్పుడు ఈ పధ్నాలు గేళ్లుగా మేమిద్దరం వారికి లెక్కలు తెలియ జేస్తూనే ఉన్నాం .వారు సంతోషిస్తూనే ఉన్నారు . .
గ్రంథద్వయం రేపల్లె లో ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ ఖర్చు కూడా మైనేని గారే ఆనందంగా భరించారు . మైనేని దంపతుల వయోభారం ఆరోగ్య సమస్యలు తో కొంత కలత చెంది ,జన జీవితం నుంచి దూరం అవ్వాలని భావించి ఆ విషయం మాకు తెలియ జేసి,వారు అధికంగా పంపిన డబ్బులో మా వద్ద నిల్వ ఉన్న దానిని సరసభారతి కార్యక్రమాలకు ,శ్రీ సువర్చలాంజనేయ స్వామి సేవలకు వినియోగించవలసినదిగా కోరారు ..సంతోషం గా అంగీకరించాము . ఖర్చులు పోను నా దగ్గర ఉన్న వారి డబ్బు రూ 19 ,300 ,మరియు శ్రీ చలపాక ప్రకాష్ గారి వద్ద నిల్వ ఉన్నడబ్బురూ 16 ,102 నాకే పంపగా, కలిసి మొత్తం ఈ నాటికి రూ 35 ,402 ఉన్నది దీన్ని సార్ధకం చేయాలన్న తలంపుతో ఈ మొత్తానికి రూ 14 ,598 జత చేసి మొత్తం రూ 50 000 చేసి శ్రీ మైనేని దంపతుల కానుకగా ఈ రోజే అంటే ఉగాది కి ముందు రోజే ,3 సంవత్సరాలకు ఫిక్సెడ్ డిపాజిట్ చేశాను దీనిపై వచ్చే వడ్డీ తో సరసభారతి ,నిర్వహించే కార్యక్రమాలకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి సేవలకు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో వినియోగిస్తామని తెలియ జేస్తున్నాను .వారిద్దరూ నాపై ఉంచిన విశ్వాసానికి ,నమ్మకానికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు .తెలుపు కుంటున్నాను .ఈ డబ్బును శ్రీ మైనేని దంపతుల శ్రీ విళంబి ఉగాది కానుకగా అందరం భావిద్దాం -దుర్గా ప్రసాద్