క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం
—
అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు తెలంగాణాలోని రాకొండ లో క్షామం వస్తే శ్రీ ఆంజనేయ స్వామికి కరన్యాస ,అంగన్యాస పూర్వకంగా మన్యుసూక్తమ్ తో అభిషేకం , అర్చన చేయించి స్వామి శరీరానికి తేనెలో మిరియాలపొడి కలిపిన చూర్ణం పట్టించారు . ఆ రోజు రాత్రి భారీ వర్షం ఉరుములు మెరుపులతో కురిసి చెరువులు కుంటలు సమృద్ధిగా నీటితో నిండి బంగారు పంటలు పండి దుర్భిక్షం తొలగి సుభిక్షం ఏర్పడింది .
ఆధారం -అభినవ కాళిదాస తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గ్రంథం లో శ్రీ కపిలవాయి లింగమూర్తి గారి వ్యాసం